భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్ గురించి కాదు.. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన ఫోటోగ్రాఫర్లపై అతడు తీవ్రంగా మండిపడ్డాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ (Mahieka Sharma) ఫోటోలను అభ్యంతరకరమైన యాంగిల్లో తీయడంపై హార్దిక్ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న హార్దిక్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక ఘాటు సందేశాన్ని పోస్ట్ చేశాడు.
హద్దులు దాటారు.. ఇది చీప్ పబ్లిసిటీ

బాంద్రాలోని ఒక రెస్టారెంట్ మెట్లపై మహీకా శర్మ దిగుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు ఆమె ఫోటోలను తీసిన విధానం హార్దిక్ పాండ్యాకు కోపం తెప్పించింది. దీనిపై ఇన్‌స్టా స్టోరీస్ లో అతడు ఓ పోస్ట్ చేశాడు.
"పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాపై నిఘా, ఆసక్తి ఉండటం సహజమేనని నాకు అర్థమవుతుంది. అది నేను ఎంచుకున్న జీవితంలో భాగమే. కానీ ఈరోజు ఒక హద్దు దాటారు. మహీకా బాంద్రాలోని ఒక రెస్టారెంట్ మెట్లు దిగుతుంటే.. ఫొటోగ్రాఫర్లు ఆమెను ఏ మహిళనూ తీయకూడని కోణంలో ఫోటోలు తీశారు. ఒక ప్రైవేట్ మూమెంట్‌ను చీప్ సెన్సేషనలిజం కోసం వాడుకున్నారు" అని హార్దిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
"క్లిక్‌ల కోసం మానవత్వం మర్చిపోకండి"
దేశంలో మహిళల పట్ల మరింత గౌరవప్రదమైన ప్రవర్తన ఉండాలని హార్దిక్ కోరాడు. తాను మీడియాను ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ కేవలం వ్యూస్, క్లిక్‌ల కోసం ఇలా చేయడం సరికాదని హితవు పలికాడు.
"ఇది హెడ్‌లైన్స్ గురించో, ఎవరు ఫోటో తీశారనే దాని గురించో కాదు.. ఇది కనీస గౌరవం గురించి. మహిళలకు గౌరవం దక్కాలి. ప్రతి ఒక్కరికీ కొన్ని హద్దులు ఉంటాయి. రోజూ కష్టపడే మీడియా సోదరులకు నా విన్నపం.. మీ కష్టాన్ని నేను గౌరవిస్తాను. ఎప్పుడూ సహకరిస్తాను. కానీ దయచేసి కొంచెం ఆలోచించండి. ప్రతిదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి యాంగిల్‌లోనూ ఫోటోలు తీయకూడదు. ఈ ఆటలో కాస్త మానవత్వాన్ని ఉంచుదాం. ధన్యవాదాలు" అని హార్దిక్ ముగించాడు.
హార్దిక్ - మహీకా లవ్ స్టోరీ
ఈ ఏడాది అక్టోబర్‌లో పుకార్లకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా, మహీకా శర్మతో తన రిలేషన్‌షిప్‌ను ధృవీకరించాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు, ఆమెను తన "11:11 విష్" అని పిలుస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
{{/usCountry}}ఈ ఏడాది అక్టోబర్‌లో పుకార్లకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా, మహీకా శర్మతో తన రిలేషన్‌షిప్‌ను ధృవీకరించాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు, ఆమెను తన "11:11 విష్" అని పిలుస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
{{/usCountry}}ఇటీవల "మై బిగ్ 3" అంటే తన జీవితంలో ముఖ్యమైన ముగ్గురు అంటూ క్రికెట్, తన కొడుకు అగస్త్య, మహీకాలతో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి పూజ చేయడం, వర్కౌట్ చేయడం వంటి ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. గతంలో నటి నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన హార్దిక్.. ఆమెతో కలిసి కొడుకు అగస్త్య బాధ్యతలను పంచుకుంటున్నాడు.