క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి-మోడల్ మహీకా శర్మ తమ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లకు తావిచ్చారు. ఇటీవల హార్దిక్ పంచుకున్న ఫోటోలలో మహీకా వేలికి ఉన్న ఉంగరం ఈ పుకార్లకు ప్రధాన కారణమైంది. అంతేకాదు వాళ్లు ఫొటోలకు పోజులిచ్చిన తీరు కూడా అదే కన్ఫమ్ చేస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.
మహీకా వేలికి మెరిసిన ఉంగరం

క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి-మోడల్ మహీకా శర్మ సోషల్ మీడియాలో నిరంతరం తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే బుధవారం (నవంబర్ 19) నాడు హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో వారిద్దరూ కలిసి చేసిన పూజ కూడా ఉంది. అయితే ఈ ఫోటోలలో మహీకా వేలికి ఉన్న మెరిసే ఉంగరం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. దీంతో వారిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
హార్దిక్ పోస్ట్‌తోనే పుకార్లు
హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన రిలేషన్షిప్ గురించి హింట్ ఇస్తూ ఒక ఫోటో డంప్‌ను పోస్ట్ చేశాడు. దీనికి "మై బిగ్ 3 (బ్లూ హార్ట్ ఎమోజి, ఓం ఎమోజి, క్రికెట్ బ్యాట్ ఎమోజి)" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌లో చొక్కా లేకుండా బ్యాట్‌తో పోజులిచ్చిన హార్దిక్, మైదానంలో యాక్షన్ క్షణాలు, కొడుకు అగస్త్య, పెంపుడు కుక్కలతో ఉన్న ఫొటోలు, మహీకాతో గడిపిన మధుర క్షణాలు ఉన్నాయి.
హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహీకాతో కలిసి ఇంట్లో పూజ చేయడం, ఇద్దరూ ఒకే రకమైన సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఈ ఎంగేజ్మెంట్ పుకార్లకు తావిస్తోంది. ఒక ఫోటోలో హార్దిక్, మహీకాను తన చేతుల్లో పైకి ఎత్తి మిర్రర్ సెల్ఫీ తీసుకోవడం.. ఈ సెల్ఫీలో మహీకా వేలికి మెరిసే ఉంగరం స్పష్టంగా కనిపించడం కూడా దీనికి కారణమయ్యాయి.
అభిమానులు ఈ ఉంగరాన్ని చూసి.. వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని నమ్ముతున్నారు. "అలాగే అనిపిస్తుంది. అతను ఈ సంబంధాన్ని అందరికీ చూపిస్తున్న తీరు చూస్తుంటే" అని ఒకరు కామెంట్ చేయగా.. "వారు నిశ్చితార్థం చేసుకుని ఉండవచ్చు. ఆమె ఉంగరాన్ని పరోక్షంగా చూపిస్తోంది" అని మరొకరు రాశారు.
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం
{{/usCountry}}అభిమానులు ఈ ఉంగరాన్ని చూసి.. వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని నమ్ముతున్నారు. "అలాగే అనిపిస్తుంది. అతను ఈ సంబంధాన్ని అందరికీ చూపిస్తున్న తీరు చూస్తుంటే" అని ఒకరు కామెంట్ చేయగా.. "వారు నిశ్చితార్థం చేసుకుని ఉండవచ్చు. ఆమె ఉంగరాన్ని పరోక్షంగా చూపిస్తోంది" అని మరొకరు రాశారు.
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం
{{/usCountry}}ఈ సంవత్సరం అక్టోబర్‌లో వారిద్దరి సంబంధం గురించి పుకార్లు వచ్చిన కొద్ది వారాలకే.. హార్దిక్ తన రిలేషన్షిప్ ను ధృవీకరించాడు. వాళ్లు ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించారు. హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహీకా ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో హార్దిక్ యూకే గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. హార్దిక్ ఆడుతున్నప్పుడు ఆమె స్టేడియంలో కనిపించింది. అయితే తరువాత వారు విడిపోయారని వార్తలు వచ్చాయి.
హార్దిక్ గతంలో నటి నటాషా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నాడు. 2020లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు అదే సంవత్సరం అగస్త్య జన్మించాడు. అయితే ఎన్నో ఊహాగానాల తర్వాత గత సంవత్సరం జులైలో ఈ జంట విడిపోయినట్లు ధృవీకరించింది.