...
...
Next Story

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌వితేజ‌లో సేమ్ క్వాలిటీ-మాస్ మ‌హ‌రాజ్ టైటిల్ నాదే-మళ్లీ బ్లాక్ బస్టర్ కొడతా: హ‌రీష్ శంక‌ర్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రవితేజలో సేమ్ క్వాలిటీ ఉందన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

Published on: Jan 10, 2026, 22:22:26 IST
Advertisement

వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న రవితేజ ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి’ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం (జనవరి 10) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రవితేజ, పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

హరీష్ శంకర్ కామెంట్లు

హరీష్ శంకర్ (youtube)
హరీష్ శంకర్ (youtube)

భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ‘‘సినిమా ఆడిందా, ఓడిందా అనేది పట్టించుకోడు. తెల్లారి షూటింగ్ కు వస్తాడు. భగవద్గీతలో చెప్పినదాన్ని అర్థమయ్యేలా చెప్తా. బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఫ్లాఫ్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు. మరి ఆయన (రవితేజ) భగవద్గీత చదువుకున్నారో లేదో నాకు తెలియదు. దీన్ని స్థితప్రజ్ఞత అంటారు’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.

ఈ క్వాలిటీ

‘‘స్థితప్రజ్ఞత క్వాలిటీని ఇద్దరిలో చూశా. పవన్ కల్యాణ్ లో చూశా. సేమ్ క్వాలిటీ రవితేజలో చూశా. ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ అలవర్చుకున్నారో కానీ మాలాంటి వాళ్లందరికీ నేర్పించారు. అందుకే మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా’’ అని హరీష్ శంకర్ చెప్పాడు. గతంలో రవితేజ, పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ సినిమాలు తీశాడు.

ఆ టైటిల్ నాది

ఇక రవితేజ మాస్ మహరాజ్ టైటిల్ తనదేనని హరీష్ శంకర్ అన్నాడు. ‘‘ఆయన మాస్ మహరాజ్ తీసేయండని అన్నారని సోషల్ మీడియాలో వచ్చింది. మాస్ మహరాజ్ టైటిల్ పెట్టింది నేను. పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఉంచాలన్నా, తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మిరపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మా అన్నయ్య (రవితేజ). మాస్ మహరాజ్ అన్న పదం ఉంచాలా, తీసేయాలా? అన్నది మీ ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం కష్టం’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.

బ్లాక్ బస్టర్ కొడతా

కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ, ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks