Harish Shankar: నా నుంచి అద్భుతమైన కళాఖండం ఆశించి ఉంటే క్షమించండి.. నాకు ఇలాగే వచ్చు: ఉస్తాద్ భగత్ సింగ్‌పై హరీష్ శంకర్
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన నుంచి ఏదైనా అద్భుతమైన కళాఖండం ఆశించి ఉంటే క్షమించండి అని అనడం గమనార్హం. అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Harish Shankar: పవర్ స్టార్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 14 ఏళ్ల తర్వాత వచ్చిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా ఏళ్లుగా సాగి ఉగాది సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు కొన్ని గంటల్లోనే సక్సెస్ మీట్ పెట్టారు. అంతేకాదు ఇందులో హరీష్ చేసిన కామెంట్స్ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

కళాఖండం ఆశిస్తే క్షమించండి
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురువారం (మార్చి 19) థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. కొన్ని గంటల్లోనే మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “కల్యాణ్ గారి స్వాగ్.. కల్యాణ్ గారి డైలాగ్ డెలివరీ.. ఇవే టార్గెట్ గా పెట్టుకున్నా.. అవే చూపించా. ఒకవేళ కల్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా.. అద్భుతమైన కథ, అద్భుతమైన కళాఖండాన్ని నా నుంచి ఆశించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నాకు ఇదే వచ్చు. ఇలాగే తీస్తాను” అని అనడం విశేషం.
ఎర్లీ షోస్ నుంచే పాజిటివ్ రిపోర్ట్స్..
ఓ మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని ఈ సందర్భంగా హరీష్ చెప్పాడు. "ఇది ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ కాబట్టి, దీనికి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం టైమ్ పడుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే సినిమాకు చాలా ఎంకరేజింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కంటెంట్ చూసి ఆడియన్స్ అందరూ నిజంగా చాలా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను, నా విజన్ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాను. నేను ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీస్తున్నానని, ఫ్యాన్స్‌కు కావలసిన ఆ వింటేజ్ పవన్ కల్యాణ్ ను స్క్రీన్ మీద పక్కాగా ప్రెజెంట్ చేస్తానని ముందే చెప్పాను.. అదే చేశాను" అని హరీష్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
అక్రమ వలసదారుల ఇష్యూ.. తొలిప్రేమ రీమిక్స్..
సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మంచి ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశామని హరీష్ అన్నాడు. "తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త టాపిక్‌ను మేం ఇందులో తీసుకున్నాం. అదే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ (అక్రమ వలసదారులు) సమస్య. స్టోరీలో ప్రతి క్యారెక్టర్‌కు ఒక స్పెషల్ ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో ప్రతి బిట్‌ను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేసిన 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికొస్తే.. చాలా తక్కువ టైమ్‌లోనే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాను ఇంకో లెవల్‌కు తీసుకెళ్లాడు," అని హరీష్ శంకర్ తన టీమ్ వర్క్‌ను ప్రశంసించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


