...
...
Next Story

OTT: ఓటీటీలోకి హెబ్బా పటేల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. శృంగారానికి బానిసను చేసే డ్రగ్స్.. బోల్డ్ సీన్స్

ఓటీటీలోకి హెబ్బా పటేల్ నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. గత నెల 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సెక్స్, గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ కు బానిసను చేసే డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. బోల్డ్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి.

Published on: Jan 21, 2026, 21:07:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah Patel) ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా ఇంకా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. వరుసగా చిన్న సినిమాలు చేస్తున్న ఆమె.. ఈ మధ్యే ‘మారియో’ (Mario) అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది.

మారియో ఓటీటీ రిలీజ్ డేట్

OTT: ఓటీటీలోకి హెబ్బా పటేల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. శృంగారానికి బానిసను చేసే డ్రగ్స్.. బోల్డ్ సీన్స్
OTT: ఓటీటీలోకి హెబ్బా పటేల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. శృంగారానికి బానిసను చేసే డ్రగ్స్.. బోల్డ్ సీన్స్

హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన మూవీ మారియో. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ దక్కించుకుంది. ఇప్పుడీ సినిమాను ఆ ఓటీటీ డిజిటల్ ప్రీమియర్ చేయబోతోంది. ఈ శుక్రవారం అంటే జనవరి 23 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. “రెడ్ హాట్ అలెర్ట్. టర్బో ఛార్జ్డ్, ర్యాంప్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.. మారియో జనవరి 23 నుంచి ఆహా వీడియోలో” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

మారియో మూవీ కథేంటంటే?

ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోయిన్ (హెబ్బా పటేల్) డ్రగ్స్ మాఫియా చేతిలో చిక్కుకుంటుంది. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, బ్లాక్ మెయిల్ చేసి ఆమెతోనే డ్రగ్స్ సరఫరా చేయిస్తారు. ఈ పని కోసం ఆమె ‘మారియో’ అనే ప్రత్యేక శక్తులున్న కారున్న ఒక వ్యక్తి సహాయం తీసుకుంటుంది.

అసలు ఆమె ఆ డ్రగ్స్ మాఫియా నుంచి ఎలా బయటపడింది? ఆ కారుతో ఆమె చేసిన సాహసాలేంటి? అన్నదే ఈ సినిమా కథ. సెక్స్ తోపాటు ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ కు బానిసను చేసే డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. చాలా బోల్డ్ సీన్స్, బూతు డైలాగులు ఇందులో ఉన్నాయి.

కొత్త లుక్‌లో హెబ్బా..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks