ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ.. నాలుగు రోజుల్లోనే అరుదైన మైల్‌స్టోన్.. ఆహా అనిపిస్తున్న అబ్బవరం

ఓటీటీలో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Published on: Nov 19, 2025, 19:50:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ కే-ర్యాంప్. ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఆ వివరాలేంటో చూడండి.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ.. నాలుగు రోజుల్లోనే అరుదైన మైల్‌స్టోన్.. ఆహా అనిపిస్తున్న అబ్బవరం
ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ.. నాలుగు రోజుల్లోనే అరుదైన మైల్‌స్టోన్.. ఆహా అనిపిస్తున్న అబ్బవరం

కే-ర్యాంప్ రికార్డు స్ట్రీమింగ్ మినట్స్

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే-ర్యాంప్ ప్రస్తుతం ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 15న డిజిటల్ ప్రీమియర్ అయింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీకి 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు కావడం విశేషం. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

“ఆహాలో అబ్బవరం మాస్ ర్యాంపేజ్.. కే-ర్యాంప్ ఇప్పుడు కేవలం ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్న పోస్టర్ ను కూడా జత చేసింది. మూవీకి ఓటీటీలో వస్తున్న ఆదరణకు ఇది అద్దం పడుతోంది.

కే-ర్యాంప్ మూవీ గురించి..

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కే-ర్యాంప్. ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. మంచి ఫన్ ఎలిమెంట్స్ తో పాటు రొమాన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి థియేటర్లో మంచి టాక్ వచ్చింది.

కె ర్యాంప్ మూవీ డైరెక్టర్ జైన్స్ నాని. అతనికి దర్శకుడిగా ఇదే ఫస్ట్ సినిమా. ఇందులో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. గతేడాది ‘క’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దిల్ రూబా’తో ఫ్లాప్ అందుకున్నాడు కిరణ్. ఇప్పుడు కె ర్యాంప్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.

అల్లరిచిల్లరిగా తిరిగే ఓ రిచ్ అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, ఆమెకు ఓ మానసిక వ్యాధి ఉండటం చుట్టూ సాగే కథనే కె ర్యాంప్. కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఓ రిచ్ ఫ్యామిలీలో పుడతాడు. చిన్నప్పటి నుంచి బలాదూర్ గా తిరుగుతాడు. చదువు ఎక్కదు. ఎంసెట్ కూడా ఫెయిల్ అవుతాడు. అయితే ఓ జ్యోతిష్యుడి సలహాతో కుమార్ ను కేరళలోని కాలేజీలో జాయిన్ చేస్తాడు తండ్రి.

కేరళలో కూడా కుమార్ అలాగే తాగుతూ బలాదూర్ గా తిరుగుతాడు. అప్పుడే ఒక రోజు ఇబ్బంది పడుతున్న కుమార్ ను మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) కాపాడుతుంది. తన కాలేజీలోనే చదువుతున్న మెర్సీతో లవ్ లో పడతాడు కుమార్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అప్పుడే మెర్సీకి ఉన్న మానసిక సమస్య గురించి తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More