...
...
Next Story

Hema Malini: ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదు.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లు..ఎంతిస్తే అంత తీసుకున్నా: హేమా మాలిని

Hema Malini: హేమా మాలిని ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన నటి. కానీ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటి కూడా అని వస్తున్న వార్తలను ఆమె తాజాగా ఖండించారు. అప్పట్లో చాలా తక్కువ ఇచ్చే వారని, అయినా డబ్బు కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని ఆమె చెప్పారు.

Published on: Jul 7, 2026, 18:35:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Hema Malini: బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్' హేమా మాలిని తన రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలను గట్టిగా ఖండించారు. 1970, 80ల కాలంలో బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ తనే అన్న రూమర్స్ పై ఆమె ఓపెన్ అయ్యారు. రీసెంట్ గా హిందీ రష్ కి ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఈ సీనియర్ నటి.. తాను ఏనాడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటి స్టార్స్ లాగా ఎప్పుడూ మేకర్స్ ను డిమాండ్ చేయలేదంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఎవరో చెప్పారు ఆ మాటలు.. నాకెప్పుడూ అంత డబ్బు రాలేదు

Hema Malini: ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదు.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లు..ఎంతిస్తే అంత తీసుకున్నా: హేమా మాలిని
Hema Malini: ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదు.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లు..ఎంతిస్తే అంత తీసుకున్నా: హేమా మాలిని

అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న ఫిమేల్ యాక్టర్ మీరే కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హేమా మాలిని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

"అసలు ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? కానే కాదు.. అప్పట్లో మాకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నన్ను బాగా ఇష్టపడేవారు కానీ, నేను ఎప్పుడూ డబ్బు కోసం పనిచేయలేదు" అని ఆమె చెప్పుకొచ్చారు. పేరు ప్రఖ్యాతులు పెరిగేకొద్దీ వాళ్లే కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయారే తప్ప, తాను ఎప్పుడూ డిమాండ్ చేయలేదన్నారు.

ఇప్పటి స్టార్స్ తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్స్ తో పోలిస్తే.. అప్పట్లో తనకు దక్కింది అందులో ఒక చిన్న వంతు కూడా లేదని ఆమె చెప్పారు. డబ్బు కన్నా సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు, అనుభవం తనకు చాలా ఎక్కువ అని హేమ ఎమోషనల్ అయ్యారు. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తే అంత తీసుకోవడమే తప్ప, తనకు ఇంతే కావాలని ఏనాడూ పట్టుబట్టలేదని స్పష్టం చేశారు.

కవర్లలో పెట్టింది తీసుకున్నాం.. మా అమ్మే అన్నీ చూసుకునేది

తన రెమ్యునరేషన్ వ్యవహారాలన్నీ తన తల్లి చూసుకునేవారని హేమ మాలిని గుర్తుచేసుకున్నారు. ప్రొడ్యూసర్ల పట్ల తన తల్లి చాలా ఉదారంగా ఉండేవారని, ఈ సినిమాకు ఎక్కువ ఇవ్వలేమని ఎవరైనా చెప్తే 'నో ప్రాబ్లమ్' అనేవారని చెప్పారు. వాళ్లు కవర్ లో ఎంత పెట్టి ఇచ్చినా, ఒక భిక్షంలా భావించి తీసుకున్నామని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బ్లాక్ బస్టర్ హిట్స్.. గ్లోబల్ గుర్తింపు

నటిగానే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా ఆమె సక్సెస్ అయ్యారు. 1992లో దివ్య భారతి, షారుఖ్ ఖాన్ లీడ్ రోల్స్ లో 'దిల్ ఆష్నా హై' సినిమాను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 1995లో తన మేనకోడలు మధు, సుదేశ్ బెర్రీలతో 'మోహిని' అనే ప్రాజెక్ట్ చేశారు. సినిమాలతో పాటు క్లాసికల్ డ్యాన్స్ పై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ, అద్భుతమైన భరతనాట్యం డ్యాన్సర్ గా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన హేమా మాలిని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2012లో పదంపాత్ సింఘానియా యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎంపీగా తన సేవలను కొనసాగిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe