Payal Rajput: మీకు సిగ్గుండాలి.. నా బాడీ, సైజ్, నా గర్వం..మీ పని మీరు చూసుకోండి..హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ సంచలన పోస్ట్!

Payal Rajput: టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ పేరు మరోసారి వార్తల్లో వినిపిస్తోంది. ఈ భామ చేసిన లేటెస్ట్ ట్వీట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మీకు సిగ్గుండాలి అంటూ తన బాడీని ట్రోల్స్ చేస్తున్న వాళ్లందరికీ పాయల్ గట్టిగా ఇచ్చిపడేసింది. 

Published on: Oct 21, 2026, 05:41:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Payal Rajput: సోషల్ మీడియా వేదికగా తన శరీరాకృతిపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వైరల్ అవుతున్న వీడియోలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎక్స్ (ట్విట్టర్)లో విరుచుకుపడింది. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న నెటిజన్లకు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది.

మీకు సిగ్గుండాలి.. నా బాడీ, సైజ్, నా గర్వం..మీ పని మీరు చూసుకోండి..హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ సంచలన పోస్ట్! (x/paayal rajput)
మీకు సిగ్గుండాలి.. నా బాడీ, సైజ్, నా గర్వం..మీ పని మీరు చూసుకోండి..హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ సంచలన పోస్ట్! (x/paayal rajput)

మీకు సిగ్గుండాలి

మంగళవారం (అక్టోబర్ 20) అర్ధరాత్రి దాటిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ తన ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.

"మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి" అని పాయల్ పోస్టు చేసింది.

పాయల్ కు కోపం

పాయల్ తాజా పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హీరోయిన్ల బాడీని ట్రోల్స్ చేయడం, వాళ్ల వీడియోలను ఏఐతో మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం ఎక్కువైంది. ఈ విషయంపై ఇప్పటికే డిబేట్ జరుగుతోంది. ఈ సమయంలో హీరోయిన్ పాయల్ ట్వీట్ చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఆర్ఎక్స్ 100 సంచలనం

ఢిల్లీకి చెందిన పాయల్ రాజ్‌పుత్ హిందీ టెలివిజన్ రంగంతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ‘సప్నోన్ సే భరే నైనా’ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత పంజాబీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ‘చన్నా మేరేయా’ (2017)తోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పంజాబీ అవార్డును దక్కించుకుంది.

అయితే, తెలుగులో కార్తికేయ సరసన నటించిన ఆర్ఎక్స్ 100 (2018) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులోని ఇందు పాత్రలో ఆమె అద్భుతమైన నటన, గ్లామర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌గా నిలబెట్టాయి.

ఈ సినిమాలు

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఆమె వరుసగా ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో భాగమైంది. ఇటీవల (2023) దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన మంగళవారం సినిమాలో ఆమె ప్రదర్శించిన డీ-గ్లామర్, బోల్డ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘రక్షణ’ (2024) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.

సరిహద్దులు దాటవద్దంటూ హెచ్చరిక

పాయల్ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఎంతో ధైర్యంగా, ముక్కుసూటిగా ఉంటారు. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఛానెల్‌పై వస్తున్న అంచనాలకు స్పందిస్తూ.. "ఎవరైనా కేవలం హాట్ పిక్చర్స్ లేదా బోల్డ్ కంటెంట్ కోసమే సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే దయచేసి చేయవద్దు. ఇది కేవలం నా తెరవెనుక నిజ జీవితాన్ని పంచుకోవడానికే" అని స్పష్టం చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More