Poonam Kaur: ప్రాబ్లం ఉంటే తప్పుకొంటాడు..అవసరం రాగానే వాడుకుంటాడు..త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఈ సారి నేరుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును ప్రస్తావిస్తూ ఆమె పెట్టిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ గా మారింది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడని త్రివిక్రమ్ పై ఆమె చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
Poonam Kaur: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ నటి పూనమ్ కౌర్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కొన్నేళ్లుగా కేవలం పరోక్ష వ్యాఖ్యలు, వ్యంగ్య పోస్టులతో సరిపెట్టిన ఆమె, తాజాగా డైరెక్ట్ గా పేరుతో సంచలన ఆరోపణలు చేశారు.

పూనమ్ కౌర్ ఆరోపణలు
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. తన తాజా ఇన్‌స్టా స్టోరీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రవర్తనను ఎండగడుతూ ఆమె పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ కుటుంబం అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఉన్న సమయాన్ని చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరం ఉన్నప్పుడు
ఆ సమయంలో తన కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, ఆయనకు అనుకూలంగా ఉండేలా బలవంతపు స్టేట్‌మెంట్లు త్రివిక్రమ్ ఇప్పించారని పూనమ్ కౌర్ ఆరోపించారు. అయితే అప్పుడు ఒత్తిడితో ఇప్పించిన ఆ ప్రకటనలకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండబోమని ఆమె స్పష్టం చేశారు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, వివాదాలు రాగానే సైలెంట్‌గా తప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శించారు.
‘మా’ ఏం చేస్తోంది?
ఇదే క్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తీరును కూడా పూనమ్ కౌర్ తీవ్రస్థాయిలో నిలదీశారు. తాను గతంలోనే ఈ-మెయిల్ ద్వారా అధికారికంగా త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ, అసోసియేషన్ పెద్దలు ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
పరిశ్రమలో పలుకుబడి గల పెద్ద తలకాయలకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్ల ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం కావాలని ఇండస్ట్రీ పెద్దలు ఎదురుచూస్తున్నారని నిప్పులు చెరిగారు.
సెలైంట్ గా త్రివిక్రమ్
పూనమ్ కౌర్ చేసిన ఈ సంచలన ఆరోపణల స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పూనమ్ కౌర్‌కు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి నిజాలు బయటకు రావాలని కోరుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇంతటి బహిరంగ ఆరోపణలు వస్తున్నప్పటికీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎప్పటిలాగే స్పందించకుండా పూర్తిగా సైలెంట్ గా ఉండటం గమనార్హం.

ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


