Aadarsha Kutumbam: షాకింగ్.. ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదానా? త్రివిక్రమ్- వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారు?
Aadarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కు మరోసారి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ హైప్ తో థియేటర్లకు రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడిందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. అసలు త్రివిక్రమ్- వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారన్నది వైరల్ అవుతోంది.
Aadarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47) విడుదల తేదీ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఆదర్శ కుటుంబం రిలీజ్
ఆదర్శ కుటుంబం సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఫస్ట్ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 2కి, ఆపై అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అక్టోబర్ 9న కూడా ఈ సినిమా థియేటర్లలోకి రావడం కష్టమేననే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆ రెండు డేట్లు
వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం రిలీజ్ పై ఇంకా పక్కా క్లారిటీ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ చెప్తున్నట్లు అక్టోబర్ 9నే సినిమా వస్తుందనుకుంటే ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్ కు తీసుకెళ్లాలి. కానీ ఓ ఇంటర్వ్యూ రిలీజ్ చేసి మేకర్స్ సైలెంట్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో ఆదర్శ కుటుంబం మూవీ మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్లకు బలం చేకూరింది. అక్టోబర్ 16 లేదా అక్టోబర్ 30 తేదీలను ప్రత్యామ్నాయాలుగా మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, వాయిదా ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మంచి టైమింగ్ అనుకుంటే
నిజానికి అక్టోబర్ 9 అనేది ఆదర్శ కుటుంబం రిలీజ్ కు మంచి టైమింగ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగులో ఫ్యామిలీ మూవీ వచ్చి చాలా రోజులైంది. మంచి సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న మూవీ వస్తే అడ్వాంటేజీ ఉంటుంది.
అక్టోబర్ 9కే వస్తాం, డేట్ మార్చేదే లేదని నాగవంశీ ఎక్స్ లో పోస్టు పెట్టి మరీ గట్టిగా చెప్పాడు. కానీ ఇప్పుడా రిలీజ్ డేట్ పై గందరగోళం నెలకొందనే టాక్ ఉంది. మరోవైపు అదే రోజు హనుమాన్ అంశ్ తెలుగులో రిలీజ్ అవుతుండటం గమనార్హం.
అక్టోబర్ 16 క్లాష్
ఒకవేళ 'AK47' అక్టోబర్ 16కి మారితే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అక్టోబర్ 16న సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2', అలాగే విజయ్ దేవరకొండ, రష్మికల 'రణబాలి' చిత్రాలు విడుదల రేసులో ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, 'జైలర్ 2' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత కావడమే కాకుండా, 'AK47' నిర్మాతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
మరోవైపు అక్టోబర్ 30వ తేదీని ఎంచుకుంటే విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకోవడానికి చిత్రబృందానికి తగినంత సమయం లభిస్తుంది.
రేపే తేలిపోనున్న అసలు కథ
ప్రస్తుతానికి మేకర్స్ నుంచి అక్టోబర్ 9నే అధికారిక తేదీగా ఉన్నప్పటికీ, అక్టోబర్ 6న ప్లాన్ చేసిన ట్రైలర్ లాంచ్ ఈ సస్పెన్స్‌కు తెరదించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ట్రైలర్ విడుదలైతే, అక్టోబర్ 9న సినిమా రావడం పక్కా అని స్పష్టమవుతుంది.
ఒకవేళ ట్రైలర్ విడుదల వాయిదా పడితే మాత్రం సినిమా అక్టోబర్ 16 లేదా 30కి వెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


