Heroine: ఆ బోల్డ్ సీన్ లీక్ అయిన తర్వాత భయపడిపోయా.. డోర్‌బెల్ కొట్టినా వణికేదాన్ని.. వాచ్‌మ్యాన్ కూడా అది చూశాడు: రాధిక
Heroine: రాధికా ఆప్టే మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఓ సినిమాలో చేసిన బోల్డ్ సీన్ లీక్ కావడం, ఆ తర్వాత తన సొంతింట్లోనే తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Heroine:బోల్డ్ కంటెంట్, ఇంటెన్స్ యాక్టింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానకమైన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో తన సినిమా నుంచి ఒక ఇంటిమేట్ సీన్ లీక్ అయినప్పుడు భయంతో వరుసగా నాలుగు రోజులు ఇంటి నుంచి బయటకు అడుగు కూడా పెట్టలేకపోయానని షాకింగ్ నిజాలు రివీల్ చేశారు. ఆ సమయంలో తన వాచ్‌మెన్, తన స్టైలిస్ట్ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా ఆ క్లిప్ చూడటంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యానని తెలిపారు.

"వాచ్‌మెన్ కూడా ఆ వీడియో చూశాడు".. ఆ రాత్రుళ్లు భయం భయం
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'లస్ట్ స్టోరీస్ 3' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. ఇంటిమేట్ సీన్స్ షూట్ చేయడం ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో వివరించారు. లీక్ అయిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారిందని చెప్పారు.
"నా స్టైలిస్ట్ నాతో చెబుతూ.. తన డ్రైవర్ ఆ లీక్డ్ వీడియో చూస్తూనే ఉన్నాడని, 'నువ్వు ఆమె ఇంటికే వెళ్తున్నావా?' అని అడిగాడని చెప్పింది. అంతేకాదు నా ఇంటి వాచ్‌మెన్ కూడా ఆ వీడియో చూశాడని తెలిసింది. ఒక ఒంటరి మహిళగా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నాకు ఆ రోజుల్లో ఎవరైనా డోర్‌బెల్ కొడితేనే ఒళ్లు వణికిపోయేది" అని రాధిక తన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
డ్రైవర్, స్పాట్ దాదాతో రాధికా ఆప్టే కండిషన్
ఆ క్లిష్ట సమయంలో తన రక్షణ కోసం టీమ్ సభ్యుల సహాయం తీసుకోక తప్పలేదని రాధిక వెల్లడించారు. భయం ఎక్కువ కావడంతో తన పర్సనల్ డ్రైవర్, స్పాట్ దాదాని పిలిచి నేరుగా ఒక కండిషన్ పెట్టారట.
"నా డ్రైవర్, స్పాట్ దాదాను పిలిచి ఆ లీక్డ్ వీడియో చూపించాను. 'ఈ క్లిప్ లీక్ అయింది. మీరు చూశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇది చూసిన తర్వాత కూడా మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలము అనుకుంటేనే నా దగ్గర పని చేయండి. లేదంటే మీ జీతం తీసుకుని ఇప్పుడే వెళ్లిపోవచ్చు' అని స్పష్టంగా చెప్పేశా. వాళ్లిద్దరూ నన్ను కాపాడతామని భరోసా ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నా" అని రాధిక చెప్పుకొచ్చారు.
ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన రాధికా ఆప్టే
ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని కూడా రాధిక కామెంట్స్ చేశారు. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చినా, ఆ టైమ్‌లో ఉన్న పొలిటికల్ వాతావరణం, కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమాని వదులుకున్నానని చెప్పారు. ఆ సమయంలో ప్రసిద్ధ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఆ ప్రాజెక్ట్ చేయవద్దని సలహా ఇచ్చారట.
ఇదిలా ఉంటే పర్సనల్ లైఫ్‌లో రాధికా ఆప్టే ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బ్రిటీష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను పెళ్లి చేసుకున్న ఈ నటి.. డిసెంబర్ 2024లో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన వారానికే వర్క్ మీటింగ్‌లో పాలు పడుతున్న ఫోటో షేర్ చేసి వార్తల్లో నిలిచారు.
అలాగే ఫిబ్రవరి 2025లో లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'బాఫ్టా' (BAFTA) ఈవెంట్‌లోనూ మిల్క్ పంపింగ్ బ్రేక్స్ తీసుకుంటూ వర్క్, మదర్‌హుడ్ బ్యాలెన్స్ చేసి అందరికీ ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. రీసెంట్‌గా రిలీజైన 'సిస్టర్ మిడ్‌నైట్' తో పాటు 'లస్ట్ స్టోరీస్ 3' లో తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


