Lust Stories 3 Review: అంబులెన్స్‌లో సెక్స్.. బోల్డ్ కథలు రాసే అదితి.. నెట్‌ఫ్లిక్స్ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ ఎలా ఉందంటే?
Lust Stories 3 Review: లస్ట్ స్టోరీస్ 3 నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ కొత్త సీజన్ మరో నాలుగు సరికొత్త కథలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ కొత్త సీజన్ లో సిద్ధార్థ్, అదితి జంట ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. విజయ్ వర్మ, రాధికా ఆప్టే బోల్డ్ సీన్స్ ఈ సిరీస్ ను ఓ మస్ట్ వాచ్ చేసేశాయి.
Lust Stories 3 Review: నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాపులర్ బోల్డ్ ఫ్రాంచైజ్ నుంచి 'లస్ట్ స్టోరీస్ 3' (Lust Stories 3) శుక్రవారం (సెప్టెంబర్ 18) ఓటీటీలోకి వచ్చేసింది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రాతో పాటు విశాల్ భరద్వాజ్ లాంటి నలుగురు క్రేజీ బాలీవుడ్ డైరెక్టర్లు తెరకెక్కించిన ఈ కొత్త ఆంథాలజీ రిలేషన్‌షిప్స్, మోహం, కామం, వివాహ బంధంలోని కాంప్లికేషన్ల చుట్టూ తిరుగుతుంది.

కేవలం శృంగారం మాత్రమే కాకుండా మనుషుల మనసుల్లో ఉండే అసంతృప్తి, కోరికలను ఈ ఆంథాలజీ సిరీస్ కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. నలుగురు టాప్ డైరెక్టర్ల నుంచి వచ్చిన ఈ నాలుగు డిఫరెంట్ కథలు ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించాయో ఈ రివ్యూలో చూడండి.
క్లోజ్ ఫ్రెండ్స్ భర్తల స్వాపింగ్.. రెచ్చిపోయిన విజయ్, రాధిక
లస్ట్ స్టోరీస్ 3 ఆంథాలజీలో మొదటి స్టోరీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ భర్తల స్వాపింగ్ ఐడియా చుట్టూ తిరుగుతుంది. విక్రమాదిత్య మోత్వానే డైరెక్ట్ చేసిన ఈ సెగ్మెంట్‌లో కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే 40 ఏళ్ల వయసున్న మహిళలుగా, పిల్లలను కన్న తర్వాత సెక్స్ కోసం పరితపించే వారిగా కనిపించారు.
బోరింగ్‌గా మారిన తమ జీవితాల్లో కిక్ నింపడానికి పార్ట్‌నర్ స్వాపింగ్ అనే షాకింగ్ ఐడియాతో ముందుకు వెళ్తారు. ఇందులో విజయ్ వర్మ, రాధికా ఆప్టే జంటగా.. అటు అభిషేక్ బెనర్జీ, కొంకణా సేన్ శర్మ మరో జంటగా నటించారు. ఇందులో విజయ్, రాధికా రెచ్చిపోయి అంబులెన్స్ లో సెక్స్ చేసే సీన్ ఈ సిరీస్ కే హైలైట్ అని చెప్పొచ్చు.
ముంబై డ్రీమ్స్.. కిరణ్ రావు డైరెక్షన్
లాపతా లేడీస్ మూవీ ఫేమ్ కిరణ్ రావు తెరకెక్కించిన సెగ్మెంట్ ముంబై సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పిజ్జా డెలివరీ చేస్తూ సీక్రెట్‌గా డ్రగ్స్ సప్లై చేసే కరణ్ (గుర్‌ఫతే పిర్జాదా), లైఫ్‌లో స్థిరపడాలని చూసే నెయిల్ ఆర్టిస్ట్ లిసా (సనా థంపి) మధ్య నడిచే డ్రామా ఇది.
డబ్బు, కోరికల చుట్టూ ఈ కథను కిరణ్ రావు బాగానే డిజైన్ చేసినా, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలా ఉన్న ట్విస్టుల వల్ల ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. ఈ ఆంథాలజీలో కాస్త వీక్ గా కనిపించిన స్టోరీ ఇదే.
మీర్జాపూర్ హీరోతో శకున్ బాత్రా
శకున్ బాత్రా డైరెక్ట్ చేసిన సెగ్మెంట్‌లో అలీ ఫజల్, రాధికా మదన్ (వరుణ్, సైలీ) యంగ్ కపుల్‌గా నటించారు. రోజూ ఏవో ఒక గొడవల పడే ఈ జంట.. కేవలం శృంగారం ద్వారా మాత్రమే ఒకరికొకరు కనెక్ట్ అవుతుంటారు.
అలీ ఫజల్, రాధికా మదన్ మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా కుదిరింది. ముఖ్యంగా ఒక ఎలివేటర్ సీన్‌లో వీళ్లద్దరి నటన, దానిని డైరెక్టర్ చూపించిన విధానం చాలా బాగా కుదిరింది.
1980ల నాటి హైదరాబాద్ నేపథ్యలో సిద్ధార్థ్, అదితి
రియల్ లైఫ్ భార్యాభర్తలు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ నటించిన సెగ్మెంట్ ఈ సీజన్ 3లో చివరిది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేశాడు. మొత్తం సీజన్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిన స్టోరీ ఇదే అని చెప్పొచ్చు. ఈ స్టోరీ 1980ల నాటి హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగడం విశేషం. ఇందులో సైరా, బద్రు అనే పాత్రల్లో అదితి, సిద్ధార్థ్ నటించారు.
ఇస్మత్ చుగ్తాయ్, సాదత్ హసన్ మంటో పుస్తకాలు చదివి, ఆ తర్వాత తనలోని కోరికలను గుర్తించి స్వయంగా ఎరోటిక్ కథలు రాయడం ప్రారంభించే ఓ ముస్లిం మహిళగా అదితి రావు హైదరీ తన నటనతో ఫిదా చేసింది. సిద్ధార్థ్, అదితి మధ్య రొమాన్స్ తో పాటు గజరాజ్ రావు క్యారెక్టర్ ఈ కథకు ప్రధాన బలంగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్ లో గత రెండు సీజన్ల పాటు చాలా బాగా అలరించిన లస్ట్ స్టోరీస్ ఈ మూడో సీజన్ లో కాస్త డల్లుగా అనిపించినా.. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ ఓసారి చూసేయొచ్చు. ముఖ్యంగా సిద్ధార్థ్, అదితి సెగ్మెంట్ ను మిస్ కావద్దు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


