Heroine: టాలీవుడ్‌లో రాబోతున్న కొత్త సినిమా 'సహ' (Sahaa) ప్రమోషన్లలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ (Swetha Lakshman) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మూవీ చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయితే అమీర్‌పేట సెంటర్లో గుండు కొట్టించుకుంటానంటూ చేసిన ఛాలెంజ్ ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమీర్‌పేట్ సెంటర్లో గుండు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ 'సహ' సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా నిరాశపడితే, తాను స్వయంగా అమీర్‌పేట్ మెయిన్ రోడ్డుపై నిలబడి గుండు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బాంబ్ పేల్చింది. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశామని, గట్టిగా కొట్టబోతున్నామని ఆమె చెప్పడం విశేషం.
ఓ హీరోయిన్ తన సినిమా ప్రమోషన్ కోసం ఇంత బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా కంటెంట్ మీద ఉన్న బలమైన నమ్మకంతోనే ఇలా మాట్లాడిందా లేదా కేవలం పబ్లిసిటీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంటా అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఆమె మాట చెప్పగానే వెనుకాలే ఉన్న సినిమా యూనిట్ సభ్యులంతా నవ్వడం, ఆశ్చర్యపోవడం వీడియోలో కనిపించింది.
రూ.50 కోట్ల గ్రాస్ ఖాయం.. హీరో కుమార్ కాసారం ధీమా
మరోవైపు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న కుమార్ కాసారం కూడా బాక్సాఫీస్ కలెక్షన్లపై భారీ రేంజ్ అంచనా ఇచ్చారు. తమ సినిమాకు తగినన్ని థియేటర్లు కేటాయిస్తే బాక్సాఫీస్ వద్ద ఈజీగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ఆయన చెప్పారు.
ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రావడం ఖాయమని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో తమ సినిమా నిరూపిస్తుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు.
ఓవర్ కాన్ఫిడెన్సా? ప్రమోషన్ల జిమ్మిక్కా?
{{/usCountry}}ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రావడం ఖాయమని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో తమ సినిమా నిరూపిస్తుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు.
ఓవర్ కాన్ఫిడెన్సా? ప్రమోషన్ల జిమ్మిక్కా?
{{/usCountry}}ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చే ముందు ఆడియన్స్ అటెన్షన్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి విచిత్రమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. గతంలోనూ కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఫ్లాప్ అయితే ఫిలిం నగర్‌లో బట్టలు విప్పి తిరుగుతామని, మీసాలు తీసేస్తామని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.
అయితే ప్రేక్షకులు మాత్రం ఇప్పుడు కేవలం ప్రమోషనల్ బిల్డప్‌లను చూసి థియేటర్లకు రావడం లేదు. కంటెంట్‌లో దమ్ముంటేనే ఆదరిస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న 'సహ' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు మెప్పిస్తుందో, ఈ టీమ్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.