...
...
Next Story

మేడారంలో పెంపుడు కుక్కకు తులాభారం- భక్తుల ఫైర్- సారీ చెప్పిన హీరోయిన్- అసలు ఏమైందంటే?

ప్రముఖ పుణ్య క్షేత్రం మేడారంలో టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన ఓ పని వివాదాస్పదంగా మారింది. తన పెంపుడు కుక్కకు తులాభారం వేసి బంగారం సమర్పించడం తీవ్ర కాంట్రవర్సీకి దారితీసింది. చివరకు ఆ హీరోయిన్ సారీ చెప్పింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Published on: Jan 22, 2026, 06:23:49 IST
Advertisement

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది మేడారం. ఇక్కడ మహా జాతర వైభవంగా జరుగుతుంది. తెలంగాణ, ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు వచ్చి సమ్మక్క, సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన ఓ పని తీవ్ర వివాదానికి దారి తీసింది. చివరకు ఆమె సారీ చెప్పాల్సి వచ్చింది.

టీనా శ్రావ్య వివాదం

టీనా శ్రావ్య (x)
టీనా శ్రావ్య (x)

మేడారంలో అమ్మవార్లకు మొక్కుగా భక్తులు బంగారం (బెల్లం) చెల్లించుకుంటారు. తులాభారం వేస్తారు. అంటే మొక్కిన వాళ్లు తమ బరువున్న బెల్లాన్ని తూకం వేయించుకుని, అమ్మవార్లకు సమర్పిస్తారు. హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మొక్కు చెల్లించుకుంది. కానీ తన పెంపుడు కుక్కకు ఆమె తులాభారం వేసి, బెల్లం సమర్పించడమే ఇక్కడ వివాదానికి దారి తీసింది.

భక్తులు ఫైర్

మేడారంలో తన పెంపుడు కుక్కకు టీనా శ్రావ్య తులాభారం వేయించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో భక్తులు టీనా శ్రావ్యపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని, ఇది కచ్చితంగా అవమానించడమేనని, ఇలా కుక్కకు ఎవరైనా తులాభారం వేసి మొక్కు తీర్చుకుంటారా అని టీనాపై మండిపడ్డారు. ఇది పెద్ద వివాదానికి కారణమైంది.

సారీ చెప్పిన టీనా

మేడారం జాతరలో భాగంగా అమ్మవార్లకు మొక్కు సమర్పించుకునే క్రమంలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసినందుకు టీనా శ్రావ్య సారీ చెప్పింది. కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో సినిమాల్లో టీనా శ్రావ్య నటించింది.

‘‘మొక్కు చెల్లించాలని కుక్కకు బంగారు తూకం వేశాం. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశా. ఇంకేం ఉద్దేశించి కానీ ఎవరినీ కించ పరచాలని కానీ చేయలేదు. మన మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పు అని తెలుసుకున్నా. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నా’’ అని టీనా వీడియోలో సారీ చెప్పింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks