సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ - మేడారానికి పోటెత్తిన భక్తులు, భారీగా వాహనాల రద్దీ

సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో మేడారానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఉదయం నుంచే మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పొలాల్లో పార్కింగ్ కోసం వాహనాలను మళ్లిస్తున్నారు. 

Published on: Jan 16, 2026, 14:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మేడారం వైపు రహదారులన్నీ రద్దీగా మారాయి. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాగారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ ఉండగా… కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.

మేడారం
మేడారం

గట్టమ్మ ఆలయం వద్ద రద్దీ…

మేడారంలో ఒక్కసారిగా రద్దీ పెరగటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొలాల్లో పార్కింగ్ కోసం వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇక ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు మేడారంలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నారు. ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర సంబంధిత సమాచారం కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ మరియు క్యూఆర్ కోడ్తో పాటు ప్రత్యేక లోగో మరియు వీడియోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ జాతర కోసం 21 విభాగాలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది గిరిజన యువ వాలంటీర్లను నియమించారు. ఈ జాతర కోసం ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

మేడారంలో జరుగుతున్న పనులను మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రులు ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించి, శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దేల పునరుద్ధరణ పనులను పరిశీలించి, వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం లోని ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించి

స్వయంగా ఫ్లోరింగ్ కింది భాగంలో ఇసుక ఎంత మేరకు నింపుతున్నారో పరిశీలించారు. పి టి భీమ్స్ పై అమర్చుతున్న బ్రాకెట్ లను, మీడియా టవర్స్ నిర్మాణాలను, క్యూ లైన్స్ షేడ్స్ లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కల్చరల్ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ…. ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు.

పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారిని ఐనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని ఆలయ ప్రాంగణా పరిసరాలలో మిగిలిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. డివైడర్‌ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్‌ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్‌ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More