మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చి చరిత్ర సృష్టించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాను స్టార్ మా ప్రీమియర్ చేయబోతోంది. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.
కొత్త లోక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో వచ్చింది. ఈ సినిమాను ఆదివారం (జనవరి 11) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ప్రీమియర్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఒక లోకం. ఒక పోరాటం. అంతులేని పరీక్షలు.. ది రైజ్ ఆఫ్ చంద్ర రేపే ప్రారంభమవుతోంది. కొత్త లోక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
కొత్త లోక మూవీ విశేషాలు
మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చిన ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఈ లోకా ఛాప్టర్ 1: చంద్ర. ఇప్పటికే ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది అక్టోబర్ 31నే స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడు స్టార్ మాలోకి రాబోతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ఈ సినిమా గతేడాది ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ అయింది.
మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా ఈ లోకా ఛాప్టర్ 1: చంద్ర నిలిచింది. ఈ క్రమంలో మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ రికార్డును బ్రేక్ చేసింది. నిజానికి ఈ సినిమా స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ లోనే అని చాలా రోజుల కిందటే తేలిపోయినా.. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల మార్క్ దాటేంత వరకు స్ట్రీమింగ్ తేదీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లు, ఓటీటీలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు టీవీలో చూడొచ్చు.
{{/usCountry}}దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లు, ఓటీటీలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు టీవీలో చూడొచ్చు.
{{/usCountry}}