ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి మలయాళం ఫ్యామిలీ డ్రామా.. డ్రగ్స్‌కు బానిసైన భర్త.. తల్లీకూతుళ్ల బతుకు పోరాటం
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం ఫ్యామిలీ డ్రామా వచ్చింది. 2024లో రిలీజైన ఈ సినిమా సుమారు ఏడాదిన్నర తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ మూవీ ఏంటి? దాని విశేషాల గురించి తెలుసుకోండి.
మలయాళ నటి అన్ను ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మెమరీ ప్లస్' (Memory Plus). 2024 ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ మలయాళ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మనోరమ మ్యాక్స్ లో జనవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

మెమొరీ ప్లస్ మూవీ విశేషాలు
ఏడాదిన్నర కిందటే థియేటర్లలో రిలీజైన ఈ మెమొరీ ప్లస్ మూవీలో అన్ను ఆంటోనీ, అనీష్ జి మీనన్, స్మిను సిజో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, బాధ, గాయాలు, తమను తాము తెలుసుకునేందుకు ఓ తల్లీకూతుళ్లు చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 50 లక్షలలోపే వసూలు చేసింది. ఈ మెమొరీ ప్లస్ సినిమాను కె.టి. మన్సూర్ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
మనోరమ మ్యాక్స్‌లో ఇతర మలయాళం మూవీస్
ఈ మనోరమ మ్యాక్స్ ఓటీటీ ఇటీవల మరికొన్ని కొత్త సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో పూవు అతనే మూవీ ఒకటి. ఇది జీవన్ అనే మధ్యవయస్కుడి కథ. తన జీవితంపై ప్రభావం చూపిన నలుగురు స్త్రీలతో అతను చేసే ప్రయాణం ఇది.
ఇక అప్పురమ్ అనేది మరో మూవీ. ఇది కఠినమైన ఆచారాలు ఉన్న ఇంట్లో, మానసిక అనారోగ్యంతో ఉన్న తల్లితో పెరిగే ఒక యువతి కథ. ఇవే కాకుండా సర్కీట్, కరమ్, ఫెమినిచి ఫాతిమా, షేడ్స్ ఆఫ్ లైఫ్, అతిభీకర కాముకన్ కూడా మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సన్ నెక్స్ట్‌లో 'నిధియుమ్ భూతవుమ్'
'మెమరీ ప్లస్' నటుడు అనీష్ జి మీనన్ నటించిన మరో లేటెస్ట్ సినిమా 'నిధియుమ్ భూతవుమ్' (Nidhiyum Bhoothavum) ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు మెకానిక్ ఫ్రెండ్స్ ఒక గెస్ట్ హౌస్‌లో దిగుతారు. స్థానికులు అది దెయ్యాల కొంప అని చెబుతారు. అక్కడ వీరికి ఎదురైన వింత అనుభవాలు, దాని వల్ల వచ్చే నవ్వులే ఈ సినిమా.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


