ఓటీటీలోకి శుక్రవారం (జనవరి 9) వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2. గతంలో వచ్చిన తొలి సీజన్ కు ఇది సీక్వెల్. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారు అనేది ఇక్కడ చూడండి.

వెబ్ సిరీస్: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2
ప్లాట్‌ఫామ్: సోనీ లివ్ (Sony LIV)
నటీనటులు: సిద్దాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా తదితరులు.
క్రియేటర్: నిఖిల్ అద్వానీ
బ్రిటీష్ రాజ కుటుంబంపై వచ్చిన 'ది క్రౌన్' (The Crown) సిరీస్‌తో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ను తరచుగా పోలుస్తుంటారు. కానీ భారత దేశ చరిత్రను డీల్ చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ నాయకులను కొందరు దేవుళ్లుగా కొలుస్తారు.. మరికొందరు విలన్లుగా చూస్తారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని బ్యాలెన్స్ చేస్తూ నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన రెండో సీజన్ ఎలా ఉందో చూద్దాం.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ కథేంటి?
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2 సరిగ్గా 1947లో మొదలవుతుంది. బ్రిటిషర్లు హడావిడిగా ఇండియాను వదిలి వెళ్లాలనుకునే సమయం అది. బౌండరీ కమిషన్ ఏర్పాటు, నెహ్రూ-జిన్నాల మధ్య ఇగో గొడవలు, సర్దార్ పటేల్, వి.పి. మీనన్ కలిసి 562 సంస్థానాలను (ముఖ్యంగా జునాగఢ్, కశ్మీర్) ఇండియాలో ఎలా విలీనం చేశారు అనే అంశాలను చూపించారు.
విభజన సమయంలో నెహ్రూ, గాంధీల మధ్య పెరిగిన దూరం, మత అల్లర్లు, 1947 కశ్మీర్ యుద్ధం, గాంధీ హత్య వంటి అత్యంత కీలకమైన, ఎమోషనల్ సంఘటనల చుట్టూ ఈ సీజన్ తిరుగుతుంది.
సీజన్ 2లో ఆకట్టుకున్నవి ఇవి
'గదర్' సినిమాల్లాగా ఇందులో దేశభక్తి లౌడ్‌గా, అరుపులతో ఉండదు. చాలా సైలెంట్‌గా, ఎమోషనల్‌గా గుండెకు తాకుతుంది. దీన్ని ఒక హిస్టారికల్ డాక్యుమెంటరీలా కాకుండా, మనుషుల మధ్య జరిగే డ్రామాలా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
{{/usCountry}}'గదర్' సినిమాల్లాగా ఇందులో దేశభక్తి లౌడ్‌గా, అరుపులతో ఉండదు. చాలా సైలెంట్‌గా, ఎమోషనల్‌గా గుండెకు తాకుతుంది. దీన్ని ఒక హిస్టారికల్ డాక్యుమెంటరీలా కాకుండా, మనుషుల మధ్య జరిగే డ్రామాలా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
{{/usCountry}}కశ్మీర్ తన ఇల్లు కాబట్టి అది కావాలని పట్టుబట్టే నెహ్రూ.. జిన్నా ప్రవర్తనతో విసిగిపోయిన పటేల్.. తన శిష్యులు (నెహ్రూ, పటేల్) తన మాట వినట్లేదని బాధపడే గాంధీ.. ఇలా వాళ్ళను కేవలం నాయకులుగా కాకుండా, మనలాంటి మనుషులుగా, వాళ్ళ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించారు. మనం చరిత్ర పుస్తకాల్లో చదివిన గదులు, సంభాషణలు, ఆ బ్లాక్ అండ్ వైట్ బొమ్మలకు ఈ సిరీస్ ప్రాణం పోసింది.
మైనస్ పాయింట్స్ ఇవీ..
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మన నాయకులను హీరోలుగా చూపించడం ఓకే.. కానీ అవతలి వాళ్లను మరీ కామెడీగా చూపించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. జిన్నాను కేవలం కుట్రలు చేసే ఒక మోసకారిగా చూపించారు. కశ్మీర్ రాజు హరి సింగ్‌ను ఒక జోకర్‌లా మార్చేశారు. మన వాళ్లను డీటైల్డ్ గా చూపించి, మిగతా వాళ్లను విలన్లుగా ఫిక్స్ చేయడం వల్ల కథలో ఉండాల్సిన డెప్త్ కొంచెం తగ్గింది.
మొత్తంగా కొన్ని పక్షపాతాలు ఉన్నప్పటికీ.. 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2' ఒక అద్భుతమైన ప్రయత్నం. విభజన నాటి పరిస్థితులను, కశ్మీర్ సమస్యను, గాంధీ హత్య వెనుక ఉన్న ఎమోషన్‌ను చాలా సెన్సిటివ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించారు. హిస్టరీని ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.