ఓటీటీలోకి రూ.2400 కోట్ల మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐఎండీబీలో 7.5 రేటింగ్
ఓటీటీలోకి సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్ల వసూలు చేసిన సినిమా ఇది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉండగా.. కొత్త ఏడాదిలో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' (Weapons) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జాక్ క్రెగ్గర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. జనవరి 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కథ, విశేషాలు ఇవే.

హారర్ థ్రిల్లర్ వెపన్స్ ఓటీటీ స్ట్రీమింగ్
కొత్త ఏడాదిని (2026) ఒక మంచి హారర్ థ్రిల్లర్‌తో మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం 'వెపన్స్' సిద్ధంగా ఉంది. 'బార్బేరియన్' వంటి డిఫరెంట్ హారర్ సినిమా తీసిన దర్శకుడు జాక్ క్రెగ్గర్ తెరకెక్కించిన తాజా సినిమా ఇది. ఆగస్టు 2025లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టడానికి వస్తోంది.
వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉంటుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఇంతకుముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు జియోహాట్‌స్టార్ తోపాటు ఓటీటీప్లే ప్రీమియర్ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుంది.
వెన్నులో వణుకు పుట్టించే కథ
మేబ్రూక్ అనే ఊరిలో జరిగే కథే ఈ వెపన్స్ మూవీ. రాత్రి 2:17 గంటలకు.. ఇళ్లలో ఉన్న 17 మంది చిన్న పిల్లలు ఒకేసారి మాయమైపోతారు. వాళ్లు తిరిగి రారు. ఒక స్కూల్ క్లాస్ రూమ్‌లో మిగిలిన పిల్లలందరూ మాయమైపోతే.. ఒక్క పిల్లాడు (అలెక్స్ లిల్లీ) మాత్రమే మిగులుతాడు. దీంతో అందరి అనుమానం ఆ క్లాస్ టీచర్ జస్టిన్ (జూలియా గార్నర్) మీద పడుతుంది. అసలు ఆ పిల్లలు ఏమయ్యారు? ఆ టీచర్ పాత్ర ఏంటి? ఆ ఒక్క పిల్లాడు ఎలా మిగిలాడు? అనేది ఉత్కంఠ రేపుతుంది.
వెపన్స్ మూవీ గురించి..
కేవలం 38 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ వెపన్స్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2400 కోట్లు) వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో జూలియా గార్నర్, జోష్ బ్రోలిన్ (థానోస్ ఫేమ్), ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్ కీలక పాత్రల్లో నటించారు.
జియోహాట్‌స్టార్ ఈ సినిమా ప్రోమోను షేర్ చేస్తూ.. "రాత్రి 2:17 గంటలకు 17 మంది పిల్లలు అదృశ్యమయ్యారు.. వాళ్లు ఎక్కడికి వెళ్లారు?" అంటూ ఆసక్తిని రేకెత్తించింది. హారర్, సస్పెన్స్ ఇష్టపడేవారికి ఈ వెపన్స్ మూవీ మంచి ఛాయిస్. జనవరి రెండో వీకెండ్ ఈ మూవీని చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


