OTT Horror Thriller: ఓటీటీలోకి ఈ ఒక్క రోజే రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తమన్నా మూవీ ఫ్రీగా.. మైత్రీ తొలి హారర్ కూడా
OTT Horror Thriller: హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు డబుల్ ట్రీట్ లభించింది. రెండు హారర్ మూవీస్ డిజిటల్ వేదికలపై అందుబాటులోకి వచ్చాయి. తమన్నా ఫోక్-హారర్ థ్రిల్లర్ 'ది వ్వాన్' (The Vvaan), మైత్రీ మూవీ మేకర్స్ తొలి హారర్ థ్రిల్లర్ '418' స్ట్రీమింగ్ కు వచ్చాయి.
OTT Horror Thriller: వీకెండ్ వచ్చేసిందంటే చాలు ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా చీకటి గదిలో కూర్చుని ఒళ్లు గగుర్పొడిచే హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి థ్రిల్లర్ ప్రియులకు శుక్రవారం (నవంబర్ 20, 2026) అద్భుతమైన డబుల్ ట్రీట్ లభించింది.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన రెండు భిన్నమైన హారర్ థ్రిల్లర్ చిత్రాలు నేడు ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వేదికలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాల విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ది వ్వాన్ (The Vvaan): ప్రైమ్ వీడియోలో ఫ్రీ స్ట్రీమింగ్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారి జంటగా నటించిన ఫోక్-హారర్, ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం 'ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (The Vvaan). 'పంచాయత్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో, ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్యాస్తమయం తర్వాత అడవిలోకి అడుగుపెట్టడం నిషేధం అనే నిబంధన ఉన్న ఒక పురాతన గ్రామం, వన్ దేవి ఆలయ రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సంప్రదాయాలను కాదని రాత్రివేళ ఆ నిషిద్ధ అడవిలోకి అడుగుపెట్టిన హీరోకు ఎదురైన అతీంద్రియ శక్తులు, భయానక అనుభవాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టిన ఈ సినిమా, ఇప్పటివరకు 'పే-పర్-వ్యూ' (రెంటల్) పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే నవంబర్ 20 నుంచి అది తొలగిపోయింది. ఇకపై ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే తమన్నా, సిద్ధార్థ్‌ల ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఇందులో సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ, మనీష్ పాల్, అనూప్ సోని కీలక పాత్రలు పోషించారు.
2. 418: నెట్‌ఫ్లిక్స్‌లోకి మైత్రీ మూవీ మేకర్స్ తొలి హారర్ థ్రిల్లర్
'పుష్ప', 'రంగస్థలం' వంటి భారీ చిత్రాలను నిర్మించిన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్‌లో నిర్మించిన చిత్రం ‘418’. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, ఆయన వద్ద 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలకు పనిచేసిన కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
2020 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తీరప్రాంతంలోని ఒక మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 15 ఏళ్లుగా మూసివేసి ఉన్న 'రూమ్ నంబర్ 418' వెనుక ఉన్న రహస్యం ఏంటి? పక్కనే ఉన్న 417 గదిలోకి వచ్చిన విద్యార్థికి ఎదురైన భయానక సంఘటనలు, యక్షగాన జానపద విశ్వాసాలకు ఈ గదికి ఉన్న సంబంధం ఏమిటనేది నరాలు తెగే ఉత్కంఠతో చూపించారు.
సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికెట్ పొందిన ఈ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్, నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కన్నడ నటి చైత్ర జె ఆచార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి వెంకీ జీజీ అందించిన నేపథ్య సంగీతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
మొత్తానికి ఈ వీకెండ్‌లో ఒకవైపు అడవి రహస్యాలతో కూడిన ఫోక్ హారర్ 'ది వ్వాన్' ప్రైమ్ వీడియోలో, మరోవైపు హాస్టల్ గది మిస్టరీతో సాగే సైకలాజికల్ హారర్ '418' నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావడంతో హారర్ సినిమా అభిమానులకు పండగే అని చెప్పాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


