Netflix Telugu: నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న రోజుల్లో తెలుగు సినిమాల జాతర.. ఈ లైనప్ చూస్తే షాకే.. రణబాలి నుంచి 418 వరకు..

Netflix Telugu: ‘నెట్‌ఫ్లిక్స్’ఇండియాలో తన ప్రాంతీయ కంటెంట్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ 9 సరికొత్త తెలుగు సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. వెంకటేష్ - త్రివిక్రమ్‌ 'ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47', మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ అండ్ క్రైమ్ డ్రామాలు ఉన్నాయి.

Published on: Oct 27, 2026, 19:02:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Telugu: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్నమైన కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ప్లానింగ్‌తో ముందుకు వచ్చింది. రాబోయే కాలంలో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్న 9 అత్యంత క్రేజీ తెలుగు సినిమాల అధికారిక లైనప్‌ను వెల్లడించింది.

Netflix Telugu: నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న రోజుల్లో తెలుగు సినిమాల జాతర.. ఈ లైనప్ చూస్తే షాకే.. రణబాలి నుంచి 418 వరకు..
Netflix Telugu: నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న రోజుల్లో తెలుగు సినిమాల జాతర.. ఈ లైనప్ చూస్తే షాకే.. రణబాలి నుంచి 418 వరకు..

థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న వెంటనే ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నాయి. మాస్ యాక్షన్ థ్రిల్లర్ల నుంచి కామెడీ ఎంటర్‌టైనర్లు, మైండ్ బ్లోయింగ్ మిస్టరీల వరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న ఆ 9 తెలుగు చిత్రాల పూర్తి వివరాలు ఇవే.

1. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Dont Trouble The Trouble)

ఫాంటసీ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టైటిల్‌తోనే విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రియులకు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమవుతోంది.

2. రణబాలి (Ranabaali)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. 19వ శతాబ్దపు బ్రిటిష్ కరువు నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం థియేట్రికల్ రన్ అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

3. 418

మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన తొలి హారర్ థ్రిల్లర్ మూవీ ఈ 418. దీనికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో అడుగు పెట్టనుంది.

4. ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామా 'ఆకాశంలో ఒక తార'. క్లాస్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

5. మైసా (Mysaa)

రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'మైసా' చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల కానుంది. రష్మిక ఇందులో టైటిల్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

6. దొంగ నా కొడుకు (Donga Naa Koduku)

ఔట్ అండ్ ఔట్ కామెడీ అండ్ ఫన్ రైడర్‌గా తెరకెక్కిన 'దొంగ నా కొడుకు' ప్రేక్షకులకు నవ్వుల విందు అందించడానికి నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. మౌళి లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది.

7. ఆదర్శ కుటుంబం - హౌస్ నం: 47 (Adarsha Kutumbam - House No: 47)

విక్టరీ వెంకటేష్ 77వ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ క్రైమ్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 (AK47)'. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. నవంబర్ చివరన డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది.

8. ఇడుపు కాయితం (Idupu Kayitham)

తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న 'ఇడుపు కాయితం' చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రియదర్శి ఈ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు.

9. మ్యాడ్ జూనియర్స్ (MAD Juniors)

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ప్రాంచైజీ 'మ్యాడ్' నుంచి వస్తున్న తదుపరి క్రేజీ సీక్వెల్/స్పిన్-ఆఫ్ 'మ్యాడ్ జూనియర్స్'. కాలేజ్ కామెడీ, యూత్‌ఫుల్ హ్యూమర్‌తో రాబోతున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More