OTT Horror: ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ ‘సతన్ ది డార్క్’ అదరగొడుతోంది. మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. మైండ్ బ్లాక్ ట్విస్ట్ లతో సతన్ ది డార్క్ మూవీ డిజిటల్ లవర్స్ కు థ్రిల్ అందిస్తుంది.
సతన్ ది డార్క్ ఓటీటీ

ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఈ జోనర్లో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు అదే హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సతన్ ది డార్క్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, టెంట్ కోట్టా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రెండింగ్ నంబర్ వన్
సతన్ ది డార్క్ మూవీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ప్రైమ్ వీడియోలో హారర్ మూవీస్ లో సతన్ ది డార్క్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను జనాలు తెగ చూసేస్తున్నారు. మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. ఈ హారర్ థ్రిల్లర్ కు మణికంఠన్ రామలింగం డైరెక్టర్.
స్టోరీ ఇదే
సతన్ ది డార్క్ మూవీ రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో సాగుతుంది. ఇండియాలో ఇండిపెండెన్స్ రావడానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కొనసాగుతుంది. ఆ సమయంలో హస్తినాపురం అనే కొండ ప్రాంతంలో కొందరు రహస్యంగా ఒక క్షుద్రపూజ చేస్తారు.
ఆ మంత్రతంత్రాల ప్రక్రియ ఊహించని విధంగా వికటించి, ఒక దుష్టశక్తి పంజరం నుంచి బయటకు వస్తుంది. చిన్నారిని సైతం వదలకుండా తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి కథే ఈ సినిమా.
సైతాన్ అరాచకం
{{/usCountry}}ఆ మంత్రతంత్రాల ప్రక్రియ ఊహించని విధంగా వికటించి, ఒక దుష్టశక్తి పంజరం నుంచి బయటకు వస్తుంది. చిన్నారిని సైతం వదలకుండా తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి కథే ఈ సినిమా.
సైతాన్ అరాచకం
{{/usCountry}}ఇక కథ ప్రస్తుత కాలంలోకి వస్తే.. మార్సిలిన్ (మోనా బేద్రే) అనే మహిళ ప్రవర్తనలో అకస్మాత్తుగా వింత మార్పులు వస్తాయి. ఒక అదృశ్య శక్తి ఆమెను ఆవహించడంతో ఆమె అత్యంత క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆ దుష్టశక్తి అంతటితో ఆగకుండా మార్సిలిన్ చిన్న కూతురు అలీషా (ఐరా పాలక్)ను కూడా తన వశం చేసుకుంటుంది.
ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లితోపాటు చుట్టుపక్కల వారు చేసిన పోరాటం ఏమిటి? వందల ఏళ్ల నాటి ఆ శాపాన్ని వారు ఎలా బద్దలు కొట్టారు? చిన్నారినే ఆ దుష్టశక్తి ఎందుకు వెంటాడింది? అనేదే సతన్ ది డార్క్ మూవీ మిగిలిన స్టోరీ.