ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇదో రియల్ స్టోరీ.. ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మృతి వెనుక మిస్టరీపై..

ఓటీటీలోకి నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. శుక్రవారం (డిసెంబర్ 12) అడుగుపెట్టనున్న ఈ సిరీస్ ఫ్రీగా అందుబాటులోకి రానుండటం విశేషం. దేశంలో తొలి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మృతి చుట్టూ ఉన్న మిస్టరీపై ఈ సిరీస్ రూపొందించారు.

Published on: Dec 11, 2025, 14:49:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ఇష్టమా? అయితే ఓటీటీలోకి ఈవారం అలాంటిదే ఓ వెబ్ సిరీస్ వస్తోంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లోకి అడుగుపెడుతున్న ఈ సిరీస్‌ను ఫ్రీగా చూడొచ్చు. దేశంలో తొలి సర్టిఫైడ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మృతి చుట్టూ తిరిగే సిరీస్ ఇది. అసలు ఈ సిరీస్ ఏంటి? దాని వివరాలను ఇక్కడ చూడండి.

ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇదో రియల్ స్టోరీ.. ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మృతి వెనుక మిస్టరీపై..
ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇదో రియల్ స్టోరీ.. ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మృతి వెనుక మిస్టరీపై..

భయ్: గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్

టీవీ సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, బాలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టిన నటుడు కరణ్ టాకర్ ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన హారర్ మిస్టరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇండియాలో తొలి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ (Gaurav Tiwari) జీవితం ఆధారంగా రూపొందించిన 'భయ్ - ది గౌరవ్ తివారీ మిస్టరీ' సిరీస్ విడుదలకు సిద్ధమైంది.

హారర్ తో కూడిన ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శుక్రవారం అంటే డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి విడుదల కానున్నాయి. నిజ జీవిత ఘటనలపై హారర్ థ్రిల్లర్ కావడంతో ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది.

భయ్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?

గౌరవ్ తివారీ కమర్షియల్ పైలట్ ఉద్యోగాన్ని వదిలేసి దెయ్యాలను పరిశోధించే 'పారానార్మల్ ఇన్వెస్టిగేటర్'గా ఎలా మారాడు? కేవలం 32 ఏళ్ల వయసులో అతని మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే అంశాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. గౌరవ్ తివారీ స్వయంగా రాసుకున్న డైరీలు, జర్నల్స్ ఆధారంగా వాస్తవ ఘటనలను ఇందులో చేర్చినట్లు మేకర్స్ చెబుతున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో గౌరవ్ తివారీ పాత్రలో కరణ్ టాకర్ నటించగా, అతని మరణాన్ని పరిశోధించే జర్నలిస్ట్ ఐరీన్ వెంకట్‌గా కల్కి కోచ్లిన్ కనిపించనుంది. దెయ్యాలంటే నమ్మకం లేని ఐరీన్.. ఈ కేసును పరిశోధించే క్రమంలో ఎలాంటి భయానక నిజాలను తెలుసుకుందనేది ఆసక్తికరంగా ఉండబోతోంది.

గౌరవ్ తివారీ మరణం వెనుక మిస్టరీ

2016లో ఢిల్లీలోని తన సొంత ఇంట్లోనే గౌరవ్ తివారీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో బాత్రూమ్ నుండి పెద్దగా అరుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు తలుపు పగలగొట్టి చూడగా, గౌరవ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పోలీసులు దీన్ని ఆత్మహత్యగా తేల్చినప్పటికీ, అతని మరణానికి ముందు పరిశోధించిన ఓ దెయ్యం పట్టిన అమ్మాయి కేసు చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయి. అతని మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందించిన ఈ భయ్ వెబ్ సిరీస్ లో కరణ్ టాకర్, కల్కి కోచ్లిన్‌లతో పాటు సలోని బాత్రా, డానిష్ సూద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More