బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసింది.. ఆ బ్లాక్‌బస్టర్ మూవీకి 30 ఏళ్లు.. లండన్‌లో కాంస్య విగ్రహం ఆవిష్కరణ
బాలీవుడ్ సూపర్ హిట్ ఐకానిక్ జోడీ షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిశారు. తమ బ్లాక్‌బస్టర్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే మూవీకి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్ లో ఈ జోడీ తమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.
భారతీయ సినిమా చరిత్రలో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన మూవీ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' (డీడీఎల్‌జే). ఈ క్లాసిక్ మూవీ విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని మూవీలో లీడ్ రోల్స్ పోషించిన షారుఖ్ ఖాన్, కాజోల్ లండన్‌లో ఒక ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. లండన్‌లోని ప్రసిద్ధ లెస్టర్ స్క్వేర్‌లో ఈ సినిమాలోని తమ ఐకానిక్ పోజ్‌ను ప్రతిబింబించే కాంస్య విగ్రహాన్ని వీరిద్దరూ కలిసి ఆవిష్కరించారు. ఒక భారతీయ సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే తొలిసారి.

రాజ్, సిమ్రన్ మళ్లీ కలిశారు..
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షారుక్, కాజోల్ సందడి చేశారు. నలుపు రంగు సూట్‌లో షారుఖ్ స్టైలిష్‌గా కనిపించగా, నీలి రంగు చీరలో కాజోల్ మెరిసిపోయింది. విగ్రహం పక్కన నిల్చుని వారు ఫోటోలకు పోజులిచ్చారు. బాలీవుడ్ లో వీళ్లది సూపర్ హిట్ జోడీ. ఇద్దరూ కలిసి ఈ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగేతోపాటు బాజీగర్, కుచ్ కుచ్ హోతా మై, కభీ ఖుషీ కభీ ఘమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
అయితే వాళ్ల కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ డీడీఎల్‌జే మూవీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలాంటి సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.
సినిమా గురించి షారుఖ్ ఏమన్నాడంటే?
ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. రాజ్, సిమ్రన్ పాత్రలను అమర ప్రేమికులుగా మార్చింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఈ సినిమా ఇప్పటికీ ప్రదర్శితమవుతుండటం ఒక ప్రపంచ రికార్డు. దీనిపై షారుక్ ఖాన్ తాజాగా స్పందించాడు.
"డీడీఎల్‌జే విడుదలై 30 ఏళ్లు అయ్యిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అది నిన్ననే జరిగినట్లుంది. ఎందుకంటే.. 'బడే బడే దేశో మే ఐసీ చోటీ చోటీ బాతే హోతీ రెహ్తీ హై' (పెద్ద పెద్ద దేశాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి).. కానీ ఇప్పటికీ ఇది నమ్మశక్యంగా లేదు. రాజ్ పాత్ర పోషించినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను. ఈ సినిమా ప్రజల హృదయాల్లో ఇంతటి స్థానం సంపాదిస్తుందని ఎవరూ ఊహించలేదు" అని షారుఖ్ అన్నాడు.
కాజోల్ రియాక్షన్ ఇలా..
ఈ మూవీపై కాజోల్ కూడా స్పందించింది. "దీని తర్వాత వచ్చిన దాదాపు ప్రతి రొమాంటిక్ సినిమాపైనా డీడీఎల్‌జే ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. నా వరకు, సిమ్రన్ అనేది ఎప్పటికీ ముగియని ఒక అధ్యాయం. మన దేశంలోని కోట్లాది మంది అమ్మాయిలకు ఆమె ప్రతిరూపం. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉంటూనే, మరోవైపు స్వేచ్ఛను కోరుకునే అమ్మాయిలందరికీ సిమ్రన్ ఒక స్ఫూర్తి. అందుకే ఆమె పాత్ర ఇప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా 'జా సిమ్రాన్, జా' (వెళ్లు సిమ్రాన్, వెళ్లు) అని అన్నప్పుడల్లా.. ధైర్యం, ప్రేమ కలిసి ఉంటాయనే నమ్మకం బలపడుతుంది" అని కాజోల్ వివరించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


