Horror Web Series: ఓటీటీ వేదికగా ఎన్నో రకాల జానర్లలో వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. కానీ ఒళ్లు గగుర్పొడిచే నిజమైన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అనుభూతిని పంచే వెబ్ సిరీస్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక సరికొత్త, భయానక అనుభవాన్ని అందించిన వెబ్ సిరీస్ 'దహన్ - రాకన్ కా రహస్య' (Dahan - Rakan Ka Rahasya).

ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 9 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా భయపెడుతోంది. దీని ఐఎండీబీ రేటింగ్ కూడా 7.1గా ఉంది. రాజస్థాన్‌లోని ఒక మారుమూల శాపగ్రస్త గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది.
దహన్ వెబ్ సిరీస్ విశేషాలు
వెబ్ సిరీస్ : Dahan - Rakan Ka Rahasya (దహన్ - రాకన్ కా రహస్య)
జానర్ : సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
ఓటీటీ: JioHotstar (జియోహాట్‌స్టార్)
ఎపిసోడ్లు : 9
డైరెక్టర్లు : విక్రాంత్ పవార్, జై శర్మ
రైటర్స్ : నిసర్గ్ మెహతా, శివ బాజ్‌పాయీ, నిఖిల్ నాయర్
నటీనటులు : టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్ తైలాంగ్, ముకేశ్ తివారీ, రోహన్ జోషి
ఐఎండీబీ రేటింగ్ : 7.1 / 10
దహన్ స్టోరీ ఏంటంటే?
అవని రౌత్ (టిస్కా చోప్రా) అనే నిజాయితీ గల ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంలో భయంకరమైన విషాదం, భర్త మరణం తాలూకు బాధ, అలాగే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు రాజస్థాన్‌లోని 'శిలాస్పూర్' (Shilaspur) అనే రహస్యమైన గ్రామానికి పోస్టింగ్ లభిస్తుంది.
అవని అక్కడ మాంగోన్ కార్పొరేషన్ తరఫున అత్యంత విలువైన, అరుదైన భూమిలోని ఖనిజాల మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వెళుతుంది. అయితే ఆ గ్రామంలోని మైనింగ్‌ను గ్రామ పెద్దగా ఉండే స్వరూప్ (సౌరభ్ శుక్లా) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. భూమిని తవ్వితే భూగర్భంలో ఉన్న 'రిధ్యాకన్' అనే క్రూరమైన రాక్షసుడు మేల్కొంటాడని, దానివల్ల ఊరికి ఊరే సర్వనాశనమైపోతుందని హెచ్చరిస్తాడు.
భయానక సంఘటనలు.. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్
{{/usCountry}}అవని అక్కడ మాంగోన్ కార్పొరేషన్ తరఫున అత్యంత విలువైన, అరుదైన భూమిలోని ఖనిజాల మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వెళుతుంది. అయితే ఆ గ్రామంలోని మైనింగ్‌ను గ్రామ పెద్దగా ఉండే స్వరూప్ (సౌరభ్ శుక్లా) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. భూమిని తవ్వితే భూగర్భంలో ఉన్న 'రిధ్యాకన్' అనే క్రూరమైన రాక్షసుడు మేల్కొంటాడని, దానివల్ల ఊరికి ఊరే సర్వనాశనమైపోతుందని హెచ్చరిస్తాడు.
భయానక సంఘటనలు.. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్
{{/usCountry}}గ్రామంలో వరుసగా చనిపోయిన పక్షులు కనిపించడం, వింతైన హత్యలు జరగడంతో కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఐఏఎస్ అధికారి అయిన అవని ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ, ఒక డాక్టర్ సహాయంతో దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని, నిజాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ప్రతి అడుగులోనూ ఊహించని భయానక దృశ్యాలు ఎదురవుతాయి.
ఈ వెబ్ సిరీస్‌ను విక్రాంత్ పవార్, జై శర్మ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్ తైలంగ్, ముకేష్ తివారీ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఈ వెబ్ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.
రైటర్స్‌కే థెరపిస్ట్ అవసరమైందట..
ఈ వెబ్ సిరీస్ వెనుక ఒక ఆసక్తికరమైన, షాకింగ్ విశేషం ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు కథ అందించిన ముగ్గురు రైటర్లు నిసర్గ మెహతా, శివ బాజ్‌పాయ్, నిఖిల్ నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో పడిన మానసిక ఒత్తిడిని బయటపెట్టారు. రైటింగ్ చేసే సమయంలో స్క్రిప్ట్ కోసం ముగ్గురి మధ్య తీవ్రమైన వాదనలు, గొడవలు జరిగేవని చెప్పారు.
కొన్నిసార్లు గొడవలు ఎంత తీవ్రంగా ఉండేవంటే ఒకరిపై ఒకరు పెన్సిళ్లు విసురుకునేవారని, ఆ తర్వాత మానసిక పరిస్థితి దెబ్బతినడంతో ఏకంగా ఒక థెరపిస్ట్‌ను కూడా హైర్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. డైరెక్టర్ తమకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే ఈ రేంజ్ డార్క్ థ్రిల్లర్ కంటెంట్ బయటకు వచ్చిందని వారు వెల్లడించారు. వీకెండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.