...
...
Next Story

Bigg Boss 10: బిగ్ బాస్ 10 సీజ‌న్‌లో హైప‌ర్ ఆది స‌పోర్ట్ ఎవ‌రికో తెలుసా? ఆ ఇద్ద‌రూ అనుకున్న‌దే.. కానీ ఈ బ్యూటీకి కూడా!

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా స్టార్ట్ అవడమే కాదు.. మహా పరీక్షతో రసవత్తరంగానూ మారింది. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడనే విషయం తేలిపోయింది. ఇందులో ఓ బ్యూటీ కూడా ఉంది.

Published on: Sep 8, 2026, 14:03:07 IST
Advertisement

Bigg Boss 10: ల్యాండ్‌మార్క్ సీజన్‌ బిగ్ బాస్ 10 తెలుగు సందడి షురూ అయిపోయింది. హౌస్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేస్తున్నారు. గొడవలు, టాస్క్ లతో హౌస్ లో హీట్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ హైపర్ ఆది బిగ్ బాస్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.

హైపర్ ఆది సపోర్ట్

బిగ్ బాస్ లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? (instagram-Jabardasth Hyper Aadi)
బిగ్ బాస్ లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? (instagram-Jabardasth Hyper Aadi)

బిగ్ బాస్ 10 తెలుగులోని కంటెస్టెంట్లలో హైపర్ ఆది ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్లే.. ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, వర్షిణి సౌందరరాజన్. అయితే ఇందులో ఆటో రాంప్రసాద్, నరేష్ కు హైపర్ ఆది సపోర్ట్ చేస్తాడనేది ముందే ఊహించిందే. కానీ హాట్ బ్యూటీ వర్షిణికి కూడా ఆది అండగా నిలవడం సర్ ప్రైజింగ్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆ ఫ్రెండ్ షిప్

జబర్దస్త్ స్టేజ్ పై తనతో కలిసి ఏళ్ల తరబడి వినోదాన్ని పంచిన ఆటో రామ్ ప్రసాద్, ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందర రాజన్, అలాగే పొట్టి నరేష్‌లకు ఆది తన పూర్తి మద్దతు ప్రకటించాడు. ఆటో రామ్ ప్రసాద్, ఆదిల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన స్కిట్లు బుల్లితెరపై సంచలనం సృష్టించాయి.

ఆది, రాంప్రసాద్ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ నవ్వులు పంచారు. అలాగే వేర్వేరు ఈవెంట్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. ఇక ఆది, నరేష్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్టే. వీళ్ల స్కిట్ లు చూసి జనాలు తెగ నవ్వుకుంటారు. ముఖ్యంగా నరేష్, ఆది ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు బాగా పేలుతాయి.

వర్షిణితో కెమిస్ట్రీ

తన ముగ్గురు మిత్రులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ హైపర్ ఆది పెట్టిన ఇన్ స్టా స్టోరీలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. బుల్లితెరపై విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హైపర్ ఆది సపోర్ట్ తెలపడం వల్ల ప్రారంభం నుంచే ఈ ముగ్గురు కంటెస్టెంట్లకు భారీగా ఓటింగ్ లభించే అవకాశముంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్ కామెడీ టైమింగ్, వర్షిణి గ్లామర్, నరేష్ గేమ్ స్ట్రాటజీ ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe