Ice Cream Man Trailer Released: ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. హాలీవుడ్‌లో సైకో థ్రిల్లర్లు, స్లాషర్ జోనర్ చిత్రాలకు వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ‘కంజూరింగ్’, ‘ఇన్సిడియస్’ వంటి ఇంగ్లీష్ హారర్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంటుంది.
ఐస్ క్రీమ్ మ్యాన్ ట్రైలర్

ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, హారర్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ ఎలి రాత్ నుంచి వస్తున్న సరికొత్త చిత్రమే ‘ఐస్ క్రీమ్ మ్యాన్’. తాజాగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ రెడ్ బ్యాండ్ ట్రైలర్ నెటిజన్లను వణికించేలా ఉండటమే కాదు చూస్తుంటే సుస్సు పోయించేలా ఉంది.
ఆగస్టు 7న ఉత్తర అమెరికా వ్యాప్తంగా దాదాపు 2,000 థియేటర్లలో ఐస్ క్రీమ్ మ్యాన్ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ‘ది హారర్ సెలెక్షన్’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న ఐస్ క్రీమ్ మ్యాన్ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.
ఐస్‌క్రీమ్ తిన్న పిల్లల మారణహోమం
ఒక అందమైన, ప్రశాంతమైన కాలనీలో వేసవి సెలవులను ఎంజాయ్ చేసే పిల్లల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కాలనీకి ఓ ఐస్ క్రీమ్స్ అమ్మె వ్యక్తి వ్యాపార నిమిత్తం వస్తాడు. అయితే, ఆ ఐస్ క్రీమ్ తిన్న పిల్లలంతా అకస్మాత్తుగా సైకోలుగా మారిపోతారు. ఎంతలా అంటే ఐస్ క్రీమ్ తిన్న పిల్లలు తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేస్తారు.
ఒళ్లు గగుర్పొడిచేలా
ఐస్ క్రీమ్ మ్యాన్ ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిద్రిస్తున్న తల్లిదండ్రులపై ఇద్దరు పిల్లలు రంపం, సుత్తితో దాడి చేయడం, రక్తం మడుగులో స్నో ఏంజిల్స్ (ఆటలు) చేయడం, ఒక మహిళను గట్టిగా పట్టుకుని గొడ్డలితో రెండు భాగాలుగా నరకడం వంటి అత్యంత భయానక సీన్లు ట్రైలర్‌లో కనిపించాయి.
అంతేకాకుండా స్కూల్ టీచర్ చేయి నరకడం, తల కోసేసి మెదడును ఐస్ క్రీమ్‌లో పెట్టి శవంతోనే తినిపించడం వంటి సీన్లు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. పిల్లల అమాయకత్వం కాస్తా ఐస్ క్రీమ్ మహిమతో అతి క్రూరత్వంగా ఎలా మారింది అనేదే ఈ సినిమా కథ.
హాలీవుడ్ అగ్ర తారలు..
{{/usCountry}}అంతేకాకుండా స్కూల్ టీచర్ చేయి నరకడం, తల కోసేసి మెదడును ఐస్ క్రీమ్‌లో పెట్టి శవంతోనే తినిపించడం వంటి సీన్లు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. పిల్లల అమాయకత్వం కాస్తా ఐస్ క్రీమ్ మహిమతో అతి క్రూరత్వంగా ఎలా మారింది అనేదే ఈ సినిమా కథ.
హాలీవుడ్ అగ్ర తారలు..
{{/usCountry}}ఈ చిత్రంలో ‘ఆర్ఫన్ బ్లాక్’ ఓటీటీ సిరీస్ ఫేమ్ అరి మిల్లెన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ నటుడు బెంజమిన్ బైరాన్ డేవిస్, కారెన్ క్లిచే, డైలాన్ హాకో, సారా అబాట్ కీలక పాత్రల్లో నటించారు. ఎలి రాత్ స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా తన పాత మిత్రుడు నోహ్ బెల్సన్‌తో కలిసి ఈ క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
స్నూప్ డాగ్ స్పెషల్ మ్యూజిక్
ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. ప్రముఖ కంపోజర్ బ్రాండన్ రాబర్ట్స్ ఒరిజినల్ స్కోర్ అందించగా, గ్లోబల్ రాప్ ఐకాన్ స్నూప్ డాగ్ అదనపు మ్యూజిక్ అందించారు. ‘ది వేల్’ సినిమాకు ఆస్కార్ గెలుచుకున్న అడ్రియన్ మొరోట్ ప్రోస్తెటిక్ మేకప్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చూశారు. క్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేట్ హారిసన్, ఎలి రాత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ది హారర్ సెక్షన్’ బ్యానర్‌లో తొలి అడుగు
దర్శకుడు ఎలి రాత్ 2025లో ప్రత్యేకంగా హారర్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి ‘ది హారర్ సెక్షన్’ అనే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ కింద వస్తున్న మొట్టమొదటి చిత్రం ‘ఐస్ క్రీమ్ మ్యాన్’. ఈ సంస్థ తదుపరి ప్రాజెక్ట్‌గా ‘డోంట్ గో ఇన్ దట్ హౌస్, బిచ్!’ అనే సినిమాను లైన్‌లో పెట్టింది.
ఈ తదుపరి చిత్రానికి రాపర్ స్నూప్ డాగ్ కేవలం సంగీతమే కాకుండా వండర్‌ఫుల్ రైటర్‌గా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. హారర్ చిత్రాల ప్రియులను ఈ ఆగస్టులో ‘ఐస్ క్రీమ్ మ్యాన్’ ఒక అల్టిమేట్ థ్రిల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.