Allu Arjun Forbes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సాధిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప: ది రైజ్', పుష్ప 2 సినిమాలు ఇచ్చిన అద్భుత విజయం తర్వాత ఆయన పాన్-ఇండియా దాటి గ్లోబల్ ఐకాన్‌గా అవతరించారు.

తాజాగా ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) మ్యాగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన సినీ ప్రయాణం, బాక్సాఫీస్ ఒత్తిడి, నేటి ప్రేక్షకుల అభిరుచిపై పలు సెన్సేషనల్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన ముఖ్యమైన విషయాలను తన ఇన్‌స్టాలో బన్నీ షేర్ చేశారు. సగటు కంటెంట్‌ను ఇప్పుడు జనాలు ఏమాత్రం ఆదరించరని, గొప్ప సినిమా ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు అవే వస్తాయని బలంగా చెప్పారు.
“నేను చేసిన అత్యంత 'ఆల్ఫా' పని అదే!”
'పుష్ప 2' (Pushpa 2: The Rule) ప్రమోషనల్ కంటెంట్‌లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో చీర కట్టుకుని, నీలం రంగు కాళికా దేవి అవతారంలో కనిపించిన రచ్చను ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పటికీ మరచిపోలేరు. దీనిపై ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా స్పందించిన బన్నీ.. "నా జీవితంలో నేను చేసిన అత్యంత 'ఆల్ఫా' (Alpha) పని ఏంటంటే.. సినిమాలో ఒక స్త్రీ రూపం ధరించి నటించడమే" అని పేర్కొన్నారు.
ఒక మాస్ రగ్గడ్ హీరోగా ఉంటూ అంతటి సవాలుతో కూడిన స్త్రీ అవతారాన్ని అత్యంత ధైర్యంతో చేసి మెప్పించడంపై ఆయన వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
“ఒత్తిడి అనేది ఒక ఆశీర్వాదం”
భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, కోట్ల మంది అంచనాలు మోస్తున్నప్పుడు వచ్చే ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. "ఒత్తిడి (Pressure) అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప ప్రివిలెజ్. దేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి బాధ్యత, ఒత్తిడి మోసే అవకాశం లభిస్తుంది. కాబట్టి నా దృష్టిలో ప్రెజర్ అనేది ఒక అదృష్టం. దానిని నేను ఎంతో సానుకూలంగా ఆహ్వానిస్తాను" అని అల్లు అర్జున్ చెప్పారు.
“సగటు కంటెంట్ ఇకపై చెల్లదు”
{{/usCountry}}భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, కోట్ల మంది అంచనాలు మోస్తున్నప్పుడు వచ్చే ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. "ఒత్తిడి (Pressure) అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప ప్రివిలెజ్. దేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి బాధ్యత, ఒత్తిడి మోసే అవకాశం లభిస్తుంది. కాబట్టి నా దృష్టిలో ప్రెజర్ అనేది ఒక అదృష్టం. దానిని నేను ఎంతో సానుకూలంగా ఆహ్వానిస్తాను" అని అల్లు అర్జున్ చెప్పారు.
“సగటు కంటెంట్ ఇకపై చెల్లదు”
{{/usCountry}}ప్రస్తుత సినిమా వ్యాపారం, బాక్సాఫీస్ సునామీపై స్పందిస్తూ.. "ఇప్పుడున్న కాలంలో యావరేజ్ కంటెంట్ ఎంతమాత్రం నిలబడదు. ప్రేక్షకులు చాలా స్పష్టంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడమే. ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తే, మిగిలిన బాక్సాఫీస్ లెక్కలన్నీ అవే చూసుకుంటాయి" అని నొక్కి చెప్పారు.
అంతేకాకుండా 'పుష్ప' సాధించిన విజయం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా తనను నిరంతరం ప్రేరేపిస్తోందని వెల్లడించారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోర్బ్స్ ఇంటర్వ్యూ కోట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.