Allu Arjun: అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగి తెగ మురిసిపోయిన మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ డైరెక్టర్.. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ..
Allu Arjun: అల్లు అర్జున్‌కు కేరళలో ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా. వాళ్లలో రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ డొమినిక్ అరుణ్ కూడా ఒకరు. తాజాగా ఆయన బన్నీని కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Allu Arjun: మలయాళంలో రికార్డుల వేట సాగించిన బ్లాక్‌బస్టర్ సూపర్‌హీరో మూవీ 'లోకా' (Lokah: Chapter 1 - Chandra) డైరెక్టర్ డొమినిక్ అరుణ్ రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని కలిసి సర్‌ప్రైజ్ చేశారు. పుష్ప రాజ్ అల్లు అర్జున్ తన సినిమా గురించి ప్రశంసలు కురిపించడంతో డొమినిక్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఊహించని కలయికకు సంబంధించిన క్యూట్ ఫొటోను డొమినిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు.

"నోట మాట రాలేదు బాస్!" - డొమినిక్ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్‌తో దిగిన పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డొమినిక్ అరుణ్.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"ఒక బిగ్ ఫ్యాన్‌బాయ్ మూమెంట్. 'ది' అల్లు అర్జున్‌ని కలిసే అద్భుతమైన అవకాశం నాకు దక్కింది. 'లోకా' సినిమాపై ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు స్వయంగా విన్నాను. సినిమాపై ఆయన చూపించిన ప్రేమ, రాబోయే చాప్టర్లకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు నిజంగా చాలా చాలా స్పెషల్. కొన్నేళ్లుగా మనం ఎంతగానో అభిమానించే వ్యక్తిని కలిసినప్పుడు, ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతాం కదా. నాకు ఈరోజు అలాగే అనిపించింది. ఆయన చూపించిన లవ్, చెప్పిన మంచి మాటలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సర్!" అంటూ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన మలయాళం సూపర్ హీరో మూవీ
దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ 'లోకా' మూవీ మలయాళ చిత్రసీమలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ సూపర్‌హీరో థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్‌లో అదరగొట్టగా.. నస్లేన్, శాండీ మాస్టర్ కీలక పాత్రల్లో అలరించారు.
యంగ్ టాలెంట్‌కి ఐకాన్ స్టార్ సపోర్ట్
ఇండియన్ సినిమా రేంజ్‌ని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వేరే భాషల్లో వచ్చిన కొత్త ప్రయోగాలను, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను ఎప్పుడూ ముందుండి ప్రోత్సహిస్తుంటారు. ఆ మధ్య 'లోకా' మూవీ చూసిన అల్లు అర్జున్, సినిమా మేకింగ్ శైలి, డొమినిక్ అరుణ్ విజన్ చూసి ఫిదా అయ్యారట. నెక్స్ట్ రాబోయే 'లోకా ఛాప్టర్ 2' ప్రొజెక్ట్ కోసం డొమినిక్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.
ప్రస్తుతం డొమినిక్ అరుణ్ 'లోకా ఛాప్టర్ 2' స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. లోకా సినిమాటిక్ యూనివర్స్‌ని భారీ స్కేల్‌లో బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి బిగ్ నేమ్ నుంచి ప్రశంసలు రావడం, లోకా చాప్టర్ 2 పై ఉన్న హైప్‌ని పాన్ ఇండియా లెవల్లో మరింత పెంచేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


