Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నిండు గర్భంతో మాజీ ప్రేమ డ్యాన్స్.. శ్రీవల్లి, నర్మదతో కలిసి.. వీడియో వైరల్

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమగా క్యూట్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకున్న నటి లావణ్య భరద్వాజ్. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె సీరియల్ కు దూరమైంది. తాజాగా సీరియల్ ఫ్రెండ్స్ శ్రీవల్లి, నర్మదతో కలిసి లావణ్య చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

Published on: Aug 4, 2026, 12:18:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu: స్టార్ మాలో రేటింగ్ లో దూసుకెళ్తున్న సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫన్ తో ఈ సీరియల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది లావణ్య భరద్వాజ్. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా సీరియల్ కు దూరమైన ఆమె.. ఇప్పుడు మరోసారి సెట్స్ లో తళుక్కున మెరిసింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నిండు గర్భంతో మాజీ ప్రేమ డ్యాన్స్.. శ్రీవల్లి, నర్మదతో కలిసి.. వీడియో వైరల్ (instagram-Thandra Anshu Reddy ❤️)
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నిండు గర్భంతో మాజీ ప్రేమ డ్యాన్స్.. శ్రీవల్లి, నర్మదతో కలిసి.. వీడియో వైరల్ (instagram-Thandra Anshu Reddy ❤️)

ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి కుటుంబం అనే కథతో తిరుగుతుంది. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు. ఆ కోడళ్లే శ్రీవల్లి, నర్మద, ప్రేమ. సీరియల్ స్టార్టింగ్ నుంచి చిన్న కోడలు ప్రేమగా లావణ్య భరద్వాజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ లో అలరించింది.

ప్రెగ్నెన్సీ రావడంతో

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్లో ఇప్పుడు లావణ్య భరద్వాజ్ నటించడం లేదు. తను ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో కన్నడ నటి మన్విత జగదీష్ ఈ ప్రేమ పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా లావణ్య భరద్వాజ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సెట్స్ లోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. అందరినీ కలిసింది. సరదాగా టైమ్ స్పెండ్ చేసింది.

శ్రీవల్లి, నర్మదతో డ్యాన్స్

సీరియల్ లో తన తోడికోడళ్లుగా నటించే శ్రీవల్లి (త్రివేణి యాదవ్), నర్మద (అన్షు రెడ్డి) తో కలిసి లావణ్య చేసిన డ్యాన్స్ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. బేబీ బంప్ తో ఉన్న లావణ్య.. బాబీ సినిమాలోని వైరల్ అవుతున్న ‘అటు పక్క మా అక్క’ అనే సాంగ్ కు త్రివేణి, అన్షుతో కలిసి స్టెప్పులేసింది. ముగ్గురు కలిసి సింక్ లో చేసిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

చాలా రోజుల తర్వాత

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో లావణ్య భరద్వాజ్ నటించే రోజుల్లో.. త్రివేణి, అన్షు తో కలిసి తరచుగా రీల్స్ చేస్తుండేది. ఈ ముగ్గురు కలిసి ట్రెండ్ అవుతున్న సాంగ్స్ కు డ్యాన్స్ చేసేవాళ్లు. ఆ వీడియోలకు మంచి రీచ్ ఉండేది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సీరియల్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఖుష్ అవుతున్నారు. ఫేవరెట్ ట్రయో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More