Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరే రేటింగ్ తో దూసుకెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి కలిసిపోయారా? అదేంటీ.. ప్రేమ కాపురాన్ని కూల్చిన భద్రావతి మళ్లీ మారిపోయిందా? అక్కను చెల్లి క్షమించిందా? ఆగండి, ఆగండి.. కాస్త బ్రేక్ తీసుకోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి పాత్రలు చేస్తున్న ఆర్టిస్టులు కలిశారు. కానీ ఇది సీరియల్ లో కాదు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆర్టిస్టులు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలకమైన వేదవతి పాత్రను సీనియర్ నటి ఆమని, భద్రావతి క్యారెక్టర్ ను దుర్గా దేవి ప్లే చేస్తున్నారు. ఇంటి పనోడు అయిన రామరాజుతో చెల్లి వేదవతి వెళ్లిపోయిందని భద్రావతి పగతో రగిలిపోతుంది. అంతే కాకుండా వేదవతి కొడుకును మేనకోడలు ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో రామరాజు కుటుంబంపై ప్రతీకారం కోసం భద్రావతి ఎదురు చూస్తోంది.
భద్రావతి, వేదవతి డ్యాన్స్
మరోవైపు వేదవతి ఏమో అక్క భద్రావతి ప్రేమ కోసం తపిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రావతి, వేదవతి కలిశారు. కలిసి డ్యాన్స్ చేశారు. కానీ ఇది సీరియల్ లో కాదు. రియల్ లైఫ్ లో ఇది జరిగింది. ఆమని, దుర్గా దేవి కలిసి ఓ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. హైదరబాదీ ఒరిజినల్ బుట్టో సాంగ్ కు కాళ్లు కదిపారు.
వీడియో వైరల్
ఆమనితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను దుర్గా దేవి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘‘ఆమని గారితో ఫస్ట్ టైమ్ డ్యాన్స్. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా. మాలాగే మీరు కూడా ఈ రీల్ ను ప్రేమిస్తారని అనుకుంటున్నా’’ అని దుర్గా దేవి ఆమనితో కలిసి డ్యాన్స్ చేస్తున్న రీల్ ను పోస్టు చేసింది.
సీరియల్ లో ఇలా
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. తన కాపురాన్ని కూల్చేరనే పగతో నర్మద, ప్రేమ జీవితాలను తలకిందులు చేయాలని పెద్ద కోడలు శ్రీవల్లి టార్గెట్ పెట్టుకుంది. అందుకే ప్రేమ, ధీరజ్ పెళ్లి విషయంలో అసలు నిజం భద్రావతికి చెప్పి రెచ్చగొట్టింది.
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. తన కాపురాన్ని కూల్చేరనే పగతో నర్మద, ప్రేమ జీవితాలను తలకిందులు చేయాలని పెద్ద కోడలు శ్రీవల్లి టార్గెట్ పెట్టుకుంది. అందుకే ప్రేమ, ధీరజ్ పెళ్లి విషయంలో అసలు నిజం భద్రావతికి చెప్పి రెచ్చగొట్టింది.
{{/usCountry}}దీంతో తమ్ముడు సేనాపతితో ప్రేమ, ధీరజ్ ల కాపురంలో భద్రావతి చిచ్చు పెట్టించింది. ప్రేమను ధీరజ్ నుంచి విడగొట్టి తన ఇంటికి తీసుకెళ్లింది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టేందుకు నర్మద రంగంలోకి దిగడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.