...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: రామరాజు రైస్ మిల్ ఆక్రమించేందుకు భాగ్యం ప్లాన్- ప్రేమపై వేదవతి మాటల ప్రభావం- ధీరజ్‌తో అలా!

Illu Illalu Pillalu Serial Latest Episode Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్డ్ ఎపిసోడ్ ప్రోమోలో నర్మదతో అత్త వేదవతి అన్న మాటల ప్రభావతం ప్రేమపై పడతాయి. అందుకే లాకప్‌లో ఉన్న ధీరజ్‌తో పెళ్లి గురించి అడుగుతుంది. దానికి ధీరజ్ ఇచ్చిన సమాధానం అదిరిపోతుంది. ధీరజ్‌కు గోరుముద్దలు తినిపిస్తుంది ప్రేమ.

Published on: Jun 7, 2026, 05:32:37 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో వేదవతి తెగ కుమిలిపోతుంది. నర్మద వచ్చి ఓదారుస్తుంది. మేన కోడలు జీవితం బాగుండాలని చిన్నోడిని ఇచ్చి పెళ్లి చేశానని, అలా పెళ్లి చేసి పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుందని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నారు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

ఆయన్ను పెళ్లి చేసుకున్నందుకు పాతికేళ్లుగా చంపుకు తింటున్నారు. అదంతా తెలిసి కూడా చిన్నోడితో ప్రేమ పెళ్లి చేశాను. అప్పటి నుంచి ఏదో రకంగా వాన్ని వేధిస్తూనే ఉన్నారు. వాడికి ప్రేమను ఇచ్చి పెళ్లి చేయకుంటే ఇలా జరిగేది కాదేమో. ధీరజ్‌కు జైళ్లో ఉండేందుకు ఒక రకంగా నేనే కారణం అని పశ్చాత్తాపపడుతుంది వేదవతి.

ఆ మాటలను ప్రేమ వింటుంది. ప్రేమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత భోజనం క్యారేజ్ కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుంది ప్రేమ. తన భర్తకు భోజనం ఇస్తానని ప్రేమ చెబితే లేడి కానిస్టేబుల్ వద్దని, ఎస్సై చూస్తే తిడతాడని చెబుతుంది. ఉదయం నుంచి ఏం తినలేదని ప్రేమ బతిమాలాడుకుంటుంది. దాంతో కానిస్టేబుల్ సరేనని, ఎస్సై రాకముందే వెళ్లిపోవాలని చెబుతుంది.

ధీరజ్‌కు గోరు ముద్దలు

దాంతో లాకప్‌లోకి ప్రేమ వెళ్తుంది. పిచ్చా నీకేమైనా.. ఈ టైమ్‌లో ఇక్కడికి ఎందుకు వచ్చావని ధీరజ్ అడుగుతాడు. నేను ఇంట్లో ఉన్నా సరే నా ప్రాణం మాత్రం ఇక్కడే ఉంది అని ప్రేమ చెబుతుంది. తర్వాత నీకోసం భోజనం తెచ్చానని, అసలు ఉదయం ఏం తినకుండా నన్ను ఎస్సై కోచింగ్‌లో జాయిన్ చేసేందుకు బయటకు వచ్చావని, ఇప్పుడు తినమని చెబుతుంది ప్రేమ.

అయితే, అత్త వేదవతి అన్న మాటల ప్రభావంతోనే ధీరజ్‌ను పెళ్లి గురించి అడుగుతుంది ప్రేమ. నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నా లైఫ్‌కే అర్థం ఉండేది కాదు అని చాలా ఎమోషనల్‌గా చెబుతాడు ధీరజ్. దాంతో కాస్తా సంతోషిస్తుంది ప్రేమ. భార్య ప్రేమ కూడా ఏం తినలేదని అర్థం చేసుకున్న ధీరజ్ ప్లేట్ తీసుకుని తినిపిస్తాడు. ప్రేమ లాగే ప్రేమకు ధీరజ్ కూడా గోరుముద్దలు తినిపిస్తాడు. అలా లాకప్‌లో ఒకరిపై మరొకరు ప్రేమను కురిపిస్తారు.

మరోవైపు ధీరజ్ జైలుకెళ్లడంపై భాగ్యం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు, వేదవతి, ఎస్సై, ప్రేమలు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే ఇమిటేట్ చేసి నవ్వుకుంటారు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్. వేరు కాపురంతో నర్మద బాధలో ఉంది. ధీరజ్ అరెస్ట్ కావడంతో ప్రేమ కుమిలిపోతుంది, ఇక వాళ్లిద్దరు నా జోలికి రారు అని శ్రీవల్లి తెగ సంతోషిస్తుంది.

రైస్ మిల్ ఆక్రమించేందుకు

ఇప్పుడు నేనే ఆ ఇంటికి రాజు, మంత్రిని. నేను ఏం అనుకుంటే అదే జరుగుతుందని శ్రీవల్లి అనుకుంటుంది. రామరాజు రైస్ మిల్లును కూడా మనం ఆక్రమించడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని భాగ్యం అంటుంది. దాంతో శ్రీవల్లి ఆలోచిస్తుంది. అలా రామరాజు రైస్ మిల్లు ఆక్రమించేందుకు ప్లాన్ వేసి శ్రీవల్లితో అమలు అయ్యేలా చేస్తుంది భాగ్యం. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe