Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు-సాగర్ లంచావతారం-నర్మద కాపురానికి సెగ తప్పదా? బల్లక్కాయ్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా
Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జోరు కొనసాగుతోంది. అదిరిపోయే ట్విస్ట్స్ అండ్ టర్న్ తో తెలుగు ఆడియన్స్ ను ఈ సీరియల్ అలరిస్తోంది. రామరాజు కుటుంబంలో బల్లక్కాయ్ చిచ్చు పెడుతోంది. ఇప్పుడు సాగర్ లంచం అలవాటును వాడుకొని నర్మద కాపురాన్ని వల్లి ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరిపోయే ట్విస్ట్ లు, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ లోని పరిణామాలు చూస్తే కథ మరో కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తోంది.

సాగర్ లంచావతారం
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజుకు నడిపోడు సాగర్ అంటే పిచ్చి కోపం. డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కున్నాడని చీప్ గా చూస్తున్నాడు. ఇక సాగర్ కూడా పంతానికి పోయి తన భార్య నర్మదతో కలిసి వేరు కాపురం పెట్టాడు. ఆఫీస్ లోనేమో లంచాలకు అలవాటు పడ్డాడు.
రెడ్ హ్యాండెడ్ గా
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో లంచం డబ్బుతో నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా సాగర్ దొరికాడు. దీంతో నర్మద పెద్ద పెద్ద మాటలు అన్నది. మోసగాడివని తిట్టింది. కానీ అది లంచం సొమ్ము కాదని, ఆఫీస్ మెయింటేనెన్స్ కోసం తీసుకున్నానని సాగర్ పచ్చి అబద్ధం చెప్పాడు. తనకు అసలు లంచం అంటేనే ఏంటో తెలియదన్నట్లు తెగ నటించేశాడు. దీంతో నర్మద కరిగిపోయింది.
బల్లక్కాయ్ కుట్ర
రామరాజు ఇంట్లోనే సొంత శత్రువుగా బల్లక్కాయ్ మారింది. శ్రీవల్లి తన మోసాల కారణంగానే కాపురాన్ని నాశనం చేసుకుంది. కానీ అందుకు నర్మద, ప్రేమ కారణం అని పగబట్టింది. ఇప్పటికే భద్రావతితో కలిసి కుట్ర చేసి ధీరజ్, ప్రేమ విడిపోయేలా చేసింది. ఇప్పుడు ఇక నర్మదను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సాగర్ లంచావతారం వల్లికి మంచి ఛాన్స్ లా దొరికినట్లే కనిపిస్తోంది. మేకర్స్ అదే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బండారం బయటపెట్టి
ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్ ఇప్పుడు సాగర్ లంచాలు తీసుకోవడాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే నర్మదకు దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు సాగర్. ఈ నేపథ్యంలో సాగర్ లంచాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని వల్లి త్వరలోనే తెలుసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే వల్లి కుట్రకు బీజం పడుతుంది. సాగర్ లంచాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని అటు మామయ్య రామరాజుకు, ఇటు నర్మదకు తెలిసేలా చేసి ఇంట్లో పెద్ద దుమారమే లేపుతుంది వల్లి. అదే జరిగితే సాగర్ ను ఇటు తండ్రి, అటు భార్య మరింత దూరం పెడతారు.
నర్మద బయటకు
అవినీతి, అన్యాయాన్ని సహించని నర్మద ఒకవేళ తన భర్త అవినీతిపరుడని తెలిస్తే మాత్రం అసలు క్షమించదు. కచ్చితంగా సాగర్ కు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇదే కారణంతో నర్మద, సాగర్ ను వల్లి విడగొట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా ఎపిసోడ్ లు హింట్ ఇస్తున్నాయి. మరి ఈ సీరియల్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్ లో తేలిపోనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


