Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నబల్లక్కాయ్.. చందు శాశ్వతంగా దూరం పెడతాడా?

Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరే ట్విస్టులతో, మనసును తాకే ఎమోషన్ తో సాగుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. కుట్రలు, కుతంత్రాలతో నిండిన శ్రీవల్లి తన కాపురాన్ని తానే చేజేతులా నాశనం చేసుకుంటుంది. తన భర్త చందుపై లేనిపోని నిందలు వేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. 

Published on: Oct 7, 2026, 13:58:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లోని క్యారెక్టర్లు చేసే కుట్రలు, పాత్రల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, కథను మలుపు తిప్పే ట్విస్ట్ లకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ సీరియల్ ను చూసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నబల్లక్కాయ్.. చందు శాశ్వతంగా దూరం పెడతాడా? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నబల్లక్కాయ్.. చందు శాశ్వతంగా దూరం పెడతాడా? (jiohotstar)

కన్నింగ్ బల్లక్కాయ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబానికి బయట శత్రువు భద్రావతి అయితే, ఇంట్లోని శత్రువు పెద్ద కోడలు శ్రీవల్లి. అబద్ధాల చెప్పి, మోసం చేసి రామరాజు పెద్ద కొడుకు చందును వల్లి పెళ్లి చేసుకుంది. తన కుట్రలు బయటపడుతున్నా ఎప్పటికప్పుడూ కన్నింగ్ బుద్ధితోనే కుతంత్రాలు చేస్తూనే ఉంది ఈ బల్లక్కాయ్.

వల్లినే కారణం

ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్, ప్రేమ విడిపోవడానికి కారణం బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమతో పాటు వల్లి భర్త చందుకు తెలిసిపోయింది. నర్మద, ప్రేమ ఏమో ఈ విషయాన్ని రామరాజుకు చెప్పాలని చూస్తున్నారు. చందు ఏమో తన భార్యను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బల్లక్కాయ్ తప్పు ఒప్పుకోకుండా, తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది.

చందుపై నింద

ఎక్కడ తన కుట్రను రామరాజుకు చెప్పేస్తారోనని తన అత్త వేదవతిని కిందపడేలా వల్లి చేసింది. ఇక చందు ఏమో బల్లక్కాయ్ పై ఆవేశంతో ఊగిపోయాడు. మెడ పట్టుకొని బయటకు గెంటేశాడు. దీంతో ఈ బల్లక్కాయ్ మరో కుట్రకు తెరతీసింది. తన తప్పులను రామరాజు నమ్మకుండా ఉండేలా కొత్త నాటకం స్టార్ట్ చేసింది.

పిల్లలను కనడం లేదని చందు బావ కొడుతున్నాడని రామరాజుకు వల్లి పెద్ద అబద్ధం చెప్పింది. తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చందుపై లేని పోని నిందలు వేసింది. అంతే కాకుండా నర్మద తనపై కుట్ర పన్నిందని కూడా రామరాజుకు వల్లి మాయ మాటలు చెప్పింది.

కాపురం నాశనం

చందుపై నింద వేసి తప్పించుకోవాలని వల్లి చూసింది కానీ తన చేతులతోనే తన కాపురం కూల్చుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. వల్లి అబద్ధాలను నమ్మిన రామరాజు తెగ ఆవేశంతో చందును ఇంటి నుంచి గెంటేసేందుకు రెడీ అయ్యాడు. చందు టార్చర్ చేస్తున్నాడని వల్లి చెప్పిందని రామరాజు అందరికి చెప్పేశాడు.

ఛీకొడుతున్న చందు

ఇప్పటికే బల్లక్కాయ్ ను చందు ఛీకొడుతున్నాడు. ఇక ఇప్పుడు చందుపై ఇంత పెద్ద నింద వేసి, తను ఎంతో ప్రేమించే తండ్రి చేతుల్లోనే అవమానపడేందుకు వల్లి కారణమైంది. దీంతో చందుకు వల్లిపై ద్వేషం మరింత పెరిగింది. ఇక ఈ జన్మలో బల్లక్కాయ్ ను చందు క్షమించే సూచనలు కనిపించడం లేదు. వల్లిని చందు శాశ్వతంగా దూరం పెడతాడనిపిస్తోంది.

మరి రాబోయే ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది? చందుపై పడ్డ నింద నిజం కాదని తెలుస్తుందా? వల్లి బండారాన్ని నర్మద బయటపెడుతుందా? అన్నది ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పై క్యూరియాసిటీని పెంచుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More