...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో పేల‌బోతున్న బాంబ్‌.. తిరుప‌తిని బ‌లిప‌శువు చేయ‌నున్న బల్ల‌క్కాయ్‌

Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో దూసుకెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మరో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాతికేళ్లుగా రామరాజుకు నమ్మిన బంటుగా ఉన్న తిరుపతిని ఇంటి నుంచి గెంటేయించేందుకు బల్లక్కాయ్ కుట్ర పన్నింది. తిరుపతిని బలిపశువును చేయాలని చూస్తోంది.

Published on: Aug 29, 2026, 18:11:16 IST
Advertisement

Illu Illalu Pillalu: తెలుగు సీరియల్ ఫ్యాన్స్ కు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తున్న ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఎక్కువే. ఇక ఇప్పుడేమో సీరియల్ లో రామరాజు కుటుంబంపై ప్రతీకారంతో రగిలిపోతున్న శ్రీవల్లి కుట్రలకు తెరతీస్తోంది.

బల్లక్కాయ్ కుట్రలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో పేల‌బోతున్న బాంబ్‌.. తిరుప‌తిని బ‌లిప‌శువు చేయ‌నున్న బల్ల‌క్కాయ్‌ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో పేల‌బోతున్న బాంబ్‌.. తిరుప‌తిని బ‌లిప‌శువు చేయ‌నున్న బల్ల‌క్కాయ్‌ (jiohotstar)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి అలియాస్ బల్లక్కాయ్ మొదటి నుంచి మోసాలతోనే సావాసం చేస్తుంది. అబద్ధాలు చెప్పి చందుకు, శ్రీవల్లికి పెళ్లి చేశారు. ఆ విషయం బయటపడటంతో చందు ఛీ కొట్టాడు. మళ్లీ ప్రెగ్నెన్సీ డ్రామాతో రామరాజు ఇంట్లో వల్లి అడుగుపెట్టింది.

కానీ తోడికోడళ్లు నర్మద, ప్రేమ కలిసి వల్లి గుట్టు రట్టు చేశారు. దీంతో వల్లిని భర్త పూర్తిగా దూరంగా పెట్టాడు. అత్త ఏమో చీదరించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన కాపురం కూల్చారని నర్మద, ప్రేమతో పాటు రామరాజు కుటుంబంపై వల్లి పగబట్టింది.

ప్రేమ, ధీరజ్ దూరం

ఇప్పటికే ధీరజ్, ప్రేమ విడిపోయేలా కుట్ర చేసింది బల్లక్కాయ్. దీంతో ప్రేమ పుట్టింటికి వెళ్లిపోయింది. లవ్ బర్డ్స్ లా ఉండే ప్రేమ, ధీరజ్ ఇప్పుడు ఎడ మొహం పెడ మొహం పెట్టుకుంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఈ జోడీ.. ఇప్పుడు వేర్వేరుగా ఉంటోంది.

తిరుపతి టార్గెట్

రామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడానికి భద్రావతిని వాడుకుంటుంది వల్లి. మరోవైపు భద్రావతి ఏమో వల్లి తనకు దొరికిన బ్రహ్మాస్త్రం అని ఎలా చెప్తే అలా వింటుంది. తిరుపతి బర్త్ డే రూ.6 లక్షల చైన్ వేయమని వల్లి చెప్పగానే భద్రావతి గిఫ్ట్ గా ఇచ్చింది.

తీరా చూస్తే ఆ చైన్ ను సుకన్యకు స్వయంగా తిరుపతి ఇచ్చేలా ప్లాన్ చేసింది వల్లి. ఇప్పుడు రూ.6 లక్షల చైన్ విషయాన్ని అత్త వేదవతి చెవిన పడేలా వల్లి డ్రామా ప్లే చేసింది.

రామరాజు ఏమంటాడో?

సీరియల్ రామరాజు కనిపించడం లేదు. మరి రైస్ మిల్ లో పోయిన రూ.6 లక్షలకు, తిరుపతి చైన్ కు లింక్ పెట్టి ఇంటి నుంచి గెంటించాలనే వల్లి కుట్ర ఎలాంటి మలుపు తీసుకుంటుదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రామరాజు వచ్చి తిరుపతిపై నమ్మకంతో ఏమనకుండా ఉంటాడా? లేదా వల్లి కుట్రను తెలుసుకోలేక తన బావమరిదిని బయటకు గెంటేస్తాడా? అన్నది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks