Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలని డాక్టర్ మెరుపుతీగగా చేసిన క్లీనర్ అంటుంది. దాంతో డాక్టర్, శ్రీవల్లి డ్యాన్స్ చేస్తారు. భాగ్యం ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ చేస్తుంది.
డబ్బు ఉంటేనే గౌరవం

మరోవైపు సాగర్‌ను పార్టీ అడిగితే.. వడ్డీలకు దానికి అయిపోతుంది. కానీ, ఏదో ఒకరోజు మాత్రం నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను అని సాగర్ అంటాడు. అలా ఇవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలిగా అల్లుడు అని మామ ప్రసాద్ రావు అంటాడు. తర్వాత పక్కకు తీసుకెళ్లి సాగర్‌తో డబ్బు, ఆస్తులు ఉంటేనే అందరూ గౌరవిస్తారని, అప్పుడే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ విలువ ఇస్తారని ఎక్కిస్తాడు ప్రసాద్ రావు.
ఈ ఫైల్ మీద నీ సంతకం కోసం వచ్చాను. సంతకం చేయి అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో అది ఏం చదవకుండానే ఫైల్ మీద సంతకం చేస్తాడు సాగర్. పక్కనున్న అతనికి ఫైల్ ఇచ్చి క్యాష్ తీసుకుని సాగర్‌కు ఇస్తాడు ప్రసాద్ రావు. డబ్బును డబ్బుతోనే కొనే రోజులు ఇవి. ఇప్పుడు నీ జేబులోని పెన్నుతో రెండు ఇంక్ చుక్కలతో సంతకం పెట్టగానే నీ జేబులో రూ. 10 వేలు ఉన్నాయి. జీతం నమ్ముకుంటే ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వలేవు అని ప్రసాద్ రావు అంటాడు.
అలా సాగర్ లంచం తీసుకుని సంతకం పెట్టేలా, సాగర్‌కు లంచం అలవాటు అయ్యేలా చేస్తాడు మామ ప్రసాద్ రావు. తర్వాత ఆఫీస్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తానంటాడు సాగర్. మరోవైపు శ్రీవల్లి అబార్షన్, తన వైపు వల్లి మాట్లాడం గురించి ప్రేమ, నర్మద, ధీరజ్ మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుకన్య వింటుంది. వల్లి అలా శాంతమూర్తిలా మాట్లాడిందంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుందని ప్రేమ అంటుంది.
వల్లి మంచితనంపై డౌట్
వాళ్లకు తింగరితనం తప్పా ప్లాన్ చేసే బుర్ర లేదని నర్మద అంటుంది. ఏం ప్లాన్ లేనిది వల్లి వదిన నిన్ను ఎందుకు సేవ్ చేస్తుందని ధీరజ్ అంటాడు. వల్లిని సడెన్‌గా తీసుకెళ్లా. ప్లాన్ చేసే అవకాశం కూడా లేదు. ఆ డాక్టర్ కూడా జెన్యూనే. అబార్షన్ అని అబద్ధం ఎందుకు చెబుతుంది. నిజంగా వల్లికి కడుపు ఉంటే అది పోయేందుకు నేనే కారణం. ఆ గిల్టీ నన్ను వెంటాడుతూనే ఉంటుందని తనపై తానే నిందలు వేసుకుంటుంది నర్మద.
{{/usCountry}}వాళ్లకు తింగరితనం తప్పా ప్లాన్ చేసే బుర్ర లేదని నర్మద అంటుంది. ఏం ప్లాన్ లేనిది వల్లి వదిన నిన్ను ఎందుకు సేవ్ చేస్తుందని ధీరజ్ అంటాడు. వల్లిని సడెన్‌గా తీసుకెళ్లా. ప్లాన్ చేసే అవకాశం కూడా లేదు. ఆ డాక్టర్ కూడా జెన్యూనే. అబార్షన్ అని అబద్ధం ఎందుకు చెబుతుంది. నిజంగా వల్లికి కడుపు ఉంటే అది పోయేందుకు నేనే కారణం. ఆ గిల్టీ నన్ను వెంటాడుతూనే ఉంటుందని తనపై తానే నిందలు వేసుకుంటుంది నర్మద.
{{/usCountry}}వల్లి వదినలో మార్పు రావడంలో మాయ మతలబు ఉందని ధీరజ్ అంటాడు. అంతకుమించి మీరు నన్ను కనిపెట్టగలరా ఏంటీ అని సుకన్య అంటుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందని ధీరజ్ అడిగితే.. ఆ అమ్మాయి కర్చీఫ్ కట్టుకుని వచ్చిందని నర్మద చెబుతుంది. నాకు తెలిసి ఈ ఏరియాలో లేడి డ్రైవర్లు ఎవరు లేరు. పైగా కర్చీఫ్ కట్టుకుందంటే తనను గుర్తు పట్టకూడదనే చేసిందని ధీరజ్ అంటాడు.
ఆ ఖిలాడీ డ్రైవర్‌ను పట్టుకుంటే వల్లి వదినలో వచ్చిన మార్పు ఏంటో తెలుస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో సుకన్య తెగ షాక్ అయిపోతుంది. కత్తి అటు ఇటు తిరిగి నావైపుకు వచ్చిందిరో అని ఇంట్లోకి పరిగెత్తుతుంది సుకన్య. వల్లి డ్యాన్స్ చేస్తుంటే భయంగా వెళ్లిన సుకన్య ధీరజ్ వాళ్లకు డౌట్ వచ్చిన విషయం చెబుతుంది. అసలు వాళ్లు ఆటో డ్రైవర్ గురించి ఆలోచించకుండా నేను చేస్తానుగా అని వల్లి అంటుంది.
నర్మదను కొట్టిన వేదవతి
సడెన్‌గా కడుపు నొప్పి వచ్చినట్లుగా ఏడుస్తుంది. వేదవతి, అమూల్య వస్తారు. కడుపు పోయిందన్న బాధ కలచివేస్తుంటే ఏం తినను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ డ్రామా చేస్తుంది వల్లి. చందు వస్తే మన బిడ్డ దూరమైందంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. నీ నటనా బీభత్సం మాములుగా లేదు అని సుకన్య అంటుంది.
నర్మదను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది వల్లి. అది ఆపిన ప్రేమ హాస్పిటల్‌లో, ఇంటికొచ్చాకా బాగానే ఉన్నావ్. ఇందాకా ఏదో తింటూ కనబడ్డావ్. సడెన్‌గా ఏడుపు మొదలుపెట్టావని అడుగుతుంది. వేదవతి వారిస్తుంది. నన్ను ఇరికించే నువ్వు హాస్పిటల్‌లో నాకోసం అలా మాట్లాడటం చూసి చాలా ఆశ్చర్యమేసిందని నర్మద అంటుంది.
నా విషయంలో శాంతమూర్తిలా ఉన్నావంటే నిజంగా నీకు కడుపు ఉందా అని నర్మద అడుగుతుంది. దాంతో వేదవతి వచ్చి నర్మద చెంపచెల్లుమనిపిస్తుంది. అంతా షాక్ అవుతారు. సుకన్య, వల్లి నవ్వుతారు. తల్లికి బిడ్డ పోతే ఎలా ఉంటుందో తెలుసా. ఏంటీ నీ ఉద్దేశం. నీ వల్ల తన కడుపు పోయిందన్న బాధ, జాలి నీలో అస్సలు లేదు. అసలు నువ్వు మనిషివేనా అని నర్మదపై విరుచుకుపడుతుంది.
ఉసురు తగులుతుందన్న వేదవతి
తల్లి కాబోయే విషయంలో ఏ ఆడది అబద్ధం చెప్పదు. నీతో మాట్లాడాలన్న, మొహం చూడాలంటే కంపరంగా ఉంది. బంగారంలాంటి కోడలు అని నెత్తిన పెట్టుకుని తప్పు చేశాను. తనకు తన బిడ్డను దూరం చేశావు. ఆ ఉసురు నీకు ఊరికే పోదు అని వెళ్లిపోతుంది వేదవతి. అత్తయ్య ఏదో బాధలో మాట్లాడింది. పట్టించుకోకని వల్లి అంటుంది.
అంతా వెళ్లిపోతారు. మన మీద డౌట్ రాకుండా, ఆలోచించకుండా ఎట్టా రివర్స్ షాక్ ఇచ్చానో చూశావా అని సుక్కుతో అంటుంది వల్లి. మరోవైపు ఇడ్లీ బాబాయ్ బీపీ చెక్ చేసుకుని 180 వచ్చిందని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. భాగ్యం వచ్చి అడిగితే చాలా టెన్షన్‌గా ఉందని బీపీ వచ్చి పోయేలా ఉన్నానని అంటాడు.
భాగ్యం 2 లక్షల చోరీ ఐడియా
అలా ఎలా పోతావ్. డాక్టర్‌కు 2 లక్షలు కట్టేసి పోవాలిగా అని భాగ్యం అంటుంది. రైస్ మిల్లులో 2 లక్షలు కొట్టేయి అని భాగ్యం చెబుతుంది. ఇది చాలా రిస్క్ అని భయపడిపోతాడు ఇడ్లీ బాబాయ్. ఎలా చేయాలో ఐడియా చెబుతానని భాగ్యం అంటుంది. సన్యాసంలో కలుస్తానని అరుస్తూ వెళ్లిపోతాడు ఇడ్లీ బాబాయ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.