...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 8 ఎపిసోడ్: కత్తితో సేనాపతిపై రామరాజు దాడి-పుట్టింటికి శాశ్వతంగా వెళ్లిపోయిన ప్రేమ-భర్తకు దూరం

Illu Illalu Pillalu Serial June 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్‌లో ధీరజ్ కేసులో ఎమ్మెల్యే కూడా ఏం చేయలేనని చెప్పాడని చందు చెబుతాడు. కోపంతో సేనాపతిపై కత్తితో దాడి చేస్తాడు రామరాజు. భద్రావతి పెట్టిన కండిషన్ ఒప్పుకుని పుట్టింటికి శాశ్వతంగా వెళ్లిపోతుంది ప్రేమ.

Published on: Jun 8, 2026, 08:22:16 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో లాకప్‌లో ఉన్న ధీరజ్‌కు భోజనం తీసుకెళ్తుంది ప్రేమ. ఎమోషనల్‌గా మాట్లాడుతుంది ప్రేమ. తినాలని లేదని ధీరజ్ అంటే.. తనకోసం తినమని ప్రేమ అంటుంది. ధీరజ్‌కు అన్నం తినిపిస్తుంది ప్రేమ.

నా లైఫ్ మారిపోయింది

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్

నా మీద నీకు కోపంగా ఉందిగా. నన్ను పెళ్లి చేసుకున్నందుకేగా మా వాళ్లు నీ మీద ఇంత కోపంగా ఉన్నారని ప్రేమ అంటే.. నిన్ను పెళ్లి చేసుకున్నాకే నా లైఫ్ మారింది. నీకోసం ఇంత కంటే పెద్ద కష్టం ఎదురైనా సరే ఆనందంగా భరిస్తాను. ఇలాంటి మాటలు ఇంకోసారి మాత్రం మాట్లడకు. అది భరించలేను అని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ప్రేమకు కూడా ధీరజ్ అన్నం తినిపిస్తాడు. నా మీద నీకున్న ప్రేమ నీకు వచ్చే కన్నీళ్లతో తెలుస్తుందని ఎమోషనల్‌గా చెప్పిన ధీరజ్ తర్వాత ప్రేమను నవ్విస్తాడు. మాములుగానే నీ మొహాన్ని చూడలేమే. ఏడిస్తే కోతిలా ఉందని, కొరివి దెయ్యంలా చూడకే ధీరజ్ అంటాడు. సచ్చినోడా.. బాధలో కూడా జోకులు వేస్తున్నావ్ అని ప్రేమ అంటుంది.

మరోవైపు శ్రీవల్లి సంతోషంతో గెంతుతుంది. సుకన్య అన్నం తినిపిస్తుంది. దేవుడు ఉన్నాడు. అందుకే ధీరజ్‌ను అరెస్ట్ చేసి ప్రేమను కుమిలిపోయేలా చేశాడని, భద్రావతి ఛాలెంజ్ చేసేలా చేశాడని సంతోషంగా చెబుతుంది. సరేగానీ ఇలా గెంతుతుంటే ఎవరైనా చూసి కాస్తా బాధ కూడా లేకుండా దున్నపోతులా తింటుందే అనుకుంటారని సుకన్య అంటుంది.

శ్రీవల్లి డ్రామా

మరోవైపు వేదవతికి అన్నం తీసుకెళ్లి తినమని చెబుతాడు రామరాజు. మీరు తిన్నారా అని వేదవతి అడిగితే రామరాజు తినలేదంటాడు. ఇద్దరు ధీరజ్ గురించి బాధపడతారు. చిన్నోడికి ఏం కాదని రామరాజు ఓదారుస్తాడు. చందు వస్తాడు. ఎమ్మెల్యేతో మాట్లాడుతా అన్నావుగా, ఏమైందని రామరాజు అడుగుతాడు.

కారులో ఇల్లీగల్ వస్తువులు దొరికాయి కాబట్టి అది పెద్ద కేసు అవుతుందని, పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. ఏదైనా ఉంటే కోర్టు నుంచి ట్రై చేసుకోమన్నారని చందు చెబుతాడు. శిక్ష పడి జైలుకు వెళ్తే వాడి జీవితం అన్యాయం అవుతుందని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీనంతటికి కారణం ఆ సేనాపతి. వాన్ని అని రామరాజు అనుకుంటాడు.

కత్తితో సేనాపతిపై రామరాజు దాడి

ఇప్పుడే వస్తానని వెళ్తాడు రామరాజు. మరోవైపు సేనాపతి చేసిన దానికి చాలా సంతోషంగా ఉంటాడు. ఈసారి కాళ్లు పట్టుకుంటాడు వాడు అని సేనాపతి అంటాడు. అప్పుడే సేనాపతిని వెనుకనుంచి తంతాడు రామరాజు. కత్తి పట్టుకుని కనిపిస్తాడు సేనాపతి. ఈరోజు నీ ప్రాణం తీస్తానని సేనాపతి మీదకు వెళ్తాడు రామరాజు. గొడవలో కత్తి పక్కకు పడిపోతుంది.

సేనాపతిని ఎడాపెడా కొట్టి కిందపడేసి చంపేసేందుకు రాయి ఎత్తుతాడు రామరాజు. సేనాపతిపై రాయి వేయబోతుంటే తిరుపతి వచ్చి ఆపుతాడు. దాంతో సేనాపతిని తన ఫ్రెండ్స్ తీసుకెళ్లిపోతారు. అలా సేనాపతిని తిరుపతి కాపాడుతాడు. ఇలా సహనం కోల్పోయేందుకే వాళ్లు ఇలా చేస్తున్నారు. శాంతించు బావ, నీకు దండం పెడతాను అని తిరుపతి అంటాడు.

ఒక్కసారిగా కోపంతో రామరాజు అరుస్తాడు. తర్వాత ఇంటికి వెళ్లిపోతాడు రామరాజు. భద్రావతి అన్న మాటలు తలుచుకుంటుంది ప్రేమ. ధీరజ్ జైళ్లో, ప్రేమ ఇంట్లో తమ గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటారు. నువ్వు ఇంటికి వచ్చేలా నేను చేస్తాను. ఉదయానికల్లా నువ్వు ఇంట్లో ఉంటావని. ఏం చేయాలో నేను ఒక నిర్ణయానికి వచ్చానని ప్రేమ అనుకుంటుంది.

పుట్టింటికి శాశ్వతంగా ప్రేమ

మరుసటి రోజు ఉదయం ప్రేమ రెడీ అవుతుంది. మాటి మాటికి భద్రావతి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వేదవతి అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది ప్రేమ. ప్రేమ పుట్టింటికి వెళ్తుంది. అది సుకన్య చూసి వల్లికి చెప్పాలని వెళ్తుంది. ప్రేమ కోసం వెతుకుతున్న నర్మద ప్రేమ పుట్టింటికి వెళ్లడం చూసి షాక్ అవుతుంది. శ్రీవల్లి దగ్గరికి వెళ్లిన సుకన్య ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతుంది.

దాంతో నిజమా అని శ్రీవల్లి తెగ సంతోషపడుతుంది. నేను వచ్చేశాను అత్త అని భద్రావతితో అంటుంది ప్రేమ. మేనత్త పెట్టిన కండిషన్‌కు ప్రేమ ఒప్పుకుని పుట్టింటికి శాశ్వతంగా వచ్చినట్లు చెబుతుంది. ధీరజ్ కోసం భర్తకు దూరంగా ఉండేందుకు వెళ్లిపోతుంది ప్రేమ. అంటే, ధీరజ్, ప్రేమ విడిపోయినట్లే అని తెలుస్తోంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe