...
...
Next Story

Illu Illalu Pillalu November 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ధీరజ్‌ను కాపాడిన రామరాజు, ప్రేమ- ముఖ్య అతిథిగా భద్రావతి

Illu Illalu Pillalu Serial November 7th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 6వ ఎపిసోడ్‌లో చందును మార్చి వల్లిని ఇంటికి తీసుకురావాలని రామరాజు అంటాడు. చందు ధీరజ్ మాట వింటాడని ప్రేమ అంటుంది. విశ్వ వచ్చి చింతామణి, భద్రావతి కుట్ర గురించి చెబుతాడు. దాంతో ధీరజ్‌ను కాపాడుతారు రామరాజు, ప్రేమ.

Published on: Nov 7, 2026, 09:08:56 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లిని ఇంటికి తీసుకురావడంలో తప్పు లేదు. అలా అని ఇప్పుడే తీసుకురాను. విడాకులకు కూడా ఒప్పుకోను. వల్లి పెద్దగా చదువుకోలేదు. తల్లి చెప్పినట్టు వింది. పెద్దోడు కూడా ఆవేశంలో విడాకులు పంపాడు. కానీ, వాడిలా మనం కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అని రామరాజు అంటాడు.

మనం ఎన్నిసార్లు గొడవపడలేదు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 7వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 7వ ఎపిసోడ్

ఇన్ని రోజులు వల్లితో కాపురం చేశాడంటే వాడికి కచ్చితంగా ప్రేమ ఉండే ఉంటుంది. కానీ, వాడి కోపం బయటకు రానివ్వట్లేదు. మనం కొత్తలో వచ్చినప్పుడు మనం ఎన్నిసార్లు కోప్పడలేదు. గొడవ పడలేదు. అదే భార్యాభర్తల ప్రేమ, బంధం అని రామరాజు చెబుతాడు. మీరు మాటలతో అందరి మనసులు మార్చేస్తారు. పైగా పెద్ద కోడలు అంటే ప్రేమ ఎక్కువేగా. సరే పెద్దోడు రాగానే మెల్లిగా మనసు మారుద్దామని వేదవతి అంటుంది.

అసలు పెద్దోడు ఎవరి మాట వింటాడని వేదవతి అంటే.. ధీరజ్ మాట వింటాడని ప్రేమ అంటుంది. అసలు చిన్నోడు ఎక్కడికి వెళ్లాడని రామరాజు అడిగితే.. ఫైనాన్స్ కోసం వెళ్లాడని ప్రేమ చెబుతుంది. అప్పటికే వచ్చిన విశ్వ ఆ ఫైనాన్స్ గురించే మాట్లాడదామని వచ్చానంటాడు. ఆ చింతామణి మా భద్రావతి అత్తయ్య మనిషి. చింతామణితో ధీరజ్‌ను ట్రాప్ చేస్తుంది. వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని భద్రావతి కుట్ర గురించి చెబుతాడు విశ్వక్.

ధీరజ్ ఫోన్ మర్చిపోయాడని ప్రేమ చెబుతుంది. చిన్నోడు ఆ సంతకం పెడితే భద్రావతి అస్సలు వదిలిపెట్టదని రామరాజు అంటాడు. మరోవైపు ధీరజ్ దగ్గరికి చింతామణి, భద్రావతి వెళ్తారు. భద్రావతి కారులో ఉంటుంది. ఇది కేవలం 30 లక్షల డబ్బు కాదు. ఎన్నో ఏళ్ల పగ. వాడు పాలేరు కావాలి. అదంతా ఇక్కడి నుంచి చూస్తుంటాను అని భద్రావతి అంటుంది.

కాసేపట్లో మన పనోడు అవుతాడు

30 లక్షలు అంటే మాటలు కాదుగా. ఈరోజు ఎవరిని నమ్మి లక్ష ఇవ్వట్లేదు. రేపు పొద్దున నాకు నువ్వు అడ్డం తిరిగి 30 లక్షలు ఇవ్వకుంటే నేను ఏమైపోతాను. అందుకే ఇలా రాశాను. ఇలా అయితే నువ్వు ఎలా నడిపిస్తున్నావో నేను చూసుకోవచ్చు. పూర్తిగా దివాళ తీసేవరకు పట్టించుకోకుండా ఎలా ఉండగలను. కేవలం ఆ ఉద్దేశంతోనే ఈ అగ్రిమెంట్ చేయించాను. నిజంగా నేను ట్రావెల్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే నీకెందుకు 30 లక్షలు ఇస్తాను. నేనే బ్యాంక్ వాళ్లతో తీసుకుంటాగా అని చింతామణి అంటుంది.

సంతకం పెట్టమంటుంది. ధీరజ్ సంతకం పెడుతుండగా.. రామరాజు, ప్రేమ వచ్చి ఆపుతారు. చింతామణి, భద్రావతి షాక్ అవుతారు. చింతామణి కంగారుపడుతుంది. నేను ఏది అనుకున్న జరగకుండా నాశనం చేస్తుందని ప్రేమను తిట్టుకుంటుంది భద్రావతి. ఆ అగ్రిమెంట్‌ను రామరాజు, ప్రేమ ఇద్దరు చింపేస్తారు. చింతామణి మొహంపై ముక్కలు చేసిన అగ్రిమెంట్ పేపర్ విసిరేస్తుంది ప్రేమ.

భద్రావతితో చింతామణి చేతులు కలిపింది

భద్రావతితో ఈ చింతామణి చేతులు కలిపిందిరా అని రామరాజు అంటాడు. సంతకం పెడితే మన కొంప కొల్లేరు అయ్యేదని ప్రేమ అంటుంది. ఏంటీ చింతామణి గారు భద్రావతి పెద్ద స్కెచ్ వేశావన్నమాట. నా గెస్ కరెక్ట్ అయితే ఆ భద్రావతి ఇక్కడే ఉంటుంది. ఓ భద్రావతి ఏడుండావమ్మా.. నీ ప్లాన్ పాడైపోయిందమ్మా అంటూ పిలుస్తాడు ధీరజ్.

అవమానంతో భద్రావతి తలదించుకుంటుంది. ధీరజ్ చూసి రమ్మంటాడు. లేకుంటే ఇంటికెళ్లేందుకు కారు ఉండదని బెదిరిస్తాడు. దాంతో భద్రావతి వస్తుంది. అయినా ధీరజ్‌పైనే పొగరుగా మాట్లాడుతుంది. 30 లక్షలు తీసుకుని సంతకం పెట్టు. నీకు ఎక్కడ 30 లక్షలు దొరకవు. ఇప్పుడు డబ్బు కట్టకుంటే 5 లక్షలు ఫైన్ కట్టాలి. అవి కూడా లేవు నీ దగ్గర. నువ్వు ఏం చేసిన సరే ఈ భద్రావతి చేతిలో ఓడిపోయినట్లే అని భద్రావతి అంటుంది.

అంత ఆనందపడిపోకు. నా కొడుకు ఓడిపోయాడను జనాలు అనుకునేలా ఈ రామరాజు ఎందుకు చేస్తాడు అని చప్పట్లు కొడతాడు. దాంతో ఒకతను డబ్బు తీసుకొస్తాడు. బ్యాంక్ వాళ్లకు 30 లక్షలు ఇస్తాడు రామరాజు. రేయ్ చిన్నోడ నీ ట్రావెల్ ఏజెన్సీ ఎక్కడికి పోదు అని రామరాజు అంటాడు. ధీరజ్ షాక్ అవుతాడు. బ్యాంక్ వాళ్లు డబ్బు తీసుకుని ఏజెన్సీ కీస్ ఇచ్చి వెళ్లిపోతారు.

ముఖ్య అతిథిగా భద్రావతి

ఆ తాళాలు ధీరజ్‌కు ఇస్తాడు రామరాజు. నాకు నా కుటుంబం ఉన్నంతకాళం నువ్వేం చేయలేవు. అసలే వయసు అయిపోతుంది. బీపీ పెరుగుతుంది. రేపు ఈ ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా మీరు రావాలి అని భద్రావతిని అవమానిస్తాడు ధీరజ్. రామరాజు వాళ్లు వెళ్లిపోతారు. ప్లాన్ ఫెయిల్ అయినందుకు చీదరించుకుంటుంది భద్రావతి.

మరోవైపు ధీరజ్ భద్రావతి ట్రాప్‌లో ఎలా పడ్డాడని వేదవతి కంగారుపడుతుంది. సుకన్న ఇల్లు తుడుస్తుంటే తిరుపతి వచ్చి అయ్యయ్యో కష్టపడిపోతుందే అని అక్కనంటాడు. నువ్వు కూడా చేయమంటుంది వేదవతి. వల్లికి పని చెప్పకుండా చూసుకున్నందుకు అంత చేసింది. అందుకే వీళ్లను మొదట్లోనే కంట్రోల్‌లో పెట్టుకోవాలని వేదవతి అంటుంది.

సుకున్య, తిరుపతి ఇద్దరు కలిసి ఇల్లు తుడుస్తారు. వేదవతికి కాఫీ తీసుకురమ్మని ప్రేమగా మాట్లాడుతుంది నర్మద. ఏంటే ప్రేమ పొంగిపోతుంది. ఏదో తేడా కొడుతుందని, ఇందులో ఏ తిరకాసు లేదుగా అని అంటుంది వేదవతి. నర్మద కాఫీ ఇస్తుంది. కంగారుగా ఉన్నారెందుకని నర్మద అడుగుతుంది.

నర్మద షాక్

భద్రావతి, చింతామణి చేసిన కుట్ర గురించి విశ్వ వచ్చి చెప్పాడని వేదవతి చెబుతుంది. దాంతో నర్మద షాక్ అవుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks