Illu Illalu Pillalu October 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-నర్మద ప్లాన్ రివర్స్- రంగంలోకి విశ్వ-కొబ్బరికాయతో భద్రావతి
Illu Illalu Pillalu Serial October 16th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 16వ ఎపిసోడ్లో నర్మద, ప్రేమ, ధీరజ్‌లు వల్లిని కేసు వాపసు తీసుకోమంటే తీసుకోదు. వీడియో తీస్తానని బెదిరిస్తుంది. అమూల్యకు జ్యూస్ ఇచ్చి ఓదారుస్తాడు విశ్వ. భాగ్యం వెళ్తున్న ఆటోకు ఎదురుతిరిగి ఆపుతాడు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లోకి తనను రానిస్తేనే కేసు వాపసు తీసుకుంటానని శ్రీవల్లి అంటుంది. మా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి నా కూతురుని కాపురానికి తీసుకెళ్లండి. అంతకుమించి మీకు వేరే ఆప్షన్ లేదని భాగ్యం అంటుంది. మామగారి నమస్కారం తీసుకో రా అని ఇడ్లీ బాబాయ్ అంటే.. ధీరజ్ చితకబాదుతాడు.

వీడియో తీస్తామని బెదిరింపు
వీడియో తీయమని ఇడ్లీ బాబాయ్ అంటాడు. వల్లి తీస్తుంది. ధీరజ్, ప్రేమ కోప్పడితే నర్మద ఆపుతుంది. కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇంకేమైనా చేస్తే కేసు కాంప్లికేట్ అవుతుందని నర్మద అంటుంది. నర్మద ప్లాన్ వర్కౌట్ కాకుండా రివర్స్ అయ్యేసరికి ముగ్గురు వెళ్లిపోతారు. భయపడ్డారని నవ్వుకుంటారు భాగ్యం ఫ్యామిలీ. మరోవైపు పోలీస్ స్టేషన్‌కి తిరుపతి, సుకన్య భోజనం తీసుకెళ్తారు.
భోజనం వద్దని అంటారు. తినకుంటే ఏమవుతుంది. మహా అయితే పోతాను. ఈ అవమానం కంటే ఇంకేముంది అని వేదవతి అంటుంది. ధీరజ్ వాళ్లు శ్రీవల్లి ఇంటికి వెళ్లిన విషయం చెబుతాడు తిరుపతి. కేసు వెనక్కి తీసుకునేలా చేస్తారంటాడు. సుక్కు అదే అంటుంది. రేయ్ ఈ సుకన్య కూడా వల్లి చందుకు తీసుకొచ్చిన పరిస్థితే తీసుకొస్తుందిరా. జాగ్రత్తగా ఉండురా అని వేదవతి చెబుతుంది.
పూర్తిగా మారిపోయానని చెప్పింది. నాకు చిన్న అనుమానం వచ్చిన సరే తన్ని తరిమేస్తానని తిరుపతి అంటాడు. ముగ్గురు భోజనం చేయకుండా ఉండిపోతారు. అమూల్య కోసం రామరాజు ఇంటికి విశ్వ వస్తాడు. ఏమైనా తిందో లేదో అని జ్యూస్ తీసుకొస్తాడు. అమూల్య ఏడుస్తుంటే విశ్వ పిలుస్తాడు. వెంటనే వెళ్లి విశ్వక్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది అమూల్య.
నా క్యూట్ బేబీవి కదా
అమ్మానాన్న గురించి చెప్పి ఏడుస్తుంటుంది. అమూల్య.. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అంటాడు విశ్వ. అమ్ము నువ్వు నా క్యూట్ బేబీవి కదా. నువ్వు అలా ఏడవకే నా గుండెల్లో దడగా ఉంది. కాళ్లు చేతులు వణుకుతున్నాయి అని విశ్వ అంటాడు. వాళ్లకు ఏం కాదు. నేను కూడా వల్లి వాళ్లకు చెప్పి కేసు వాపసు తీసుకునేలా చేస్తాను అని విశ్వ మాటిస్తాడు.
జ్యూస్ తాగమంటే అమూల్య తాగదు. వెళ్లిపోతాను అని విశ్వ అంటే.. కాసేపు ఉండు ప్లీజ్ అని అంటుంది. నీకోసం కాసేపు ఏంటీ లైఫ్ లాంగ్ ఉంటాను. ఈ జ్యూస్ తాగు అని అమూల్యకు జ్యూస్ తాగిపిస్తాడు విశ్వ. కొంచెం అని చెప్పి పూర్తిగా జ్యూస్ తాగిస్తాడు. పెదాలపై అంటిన జ్యూస్ తుడుస్తాడు విశ్వ. విశ్వ భుజాలపై తలవాల్చి పడుకుంటుంది అమూల్య.
మరుసటి రోజు ఉదయం కేసు గురించి మాట్లాడుకుంటారు. స్మితతో కాల్ మాట్లాడి తనవైపు ఎస్సైని మాట్లాడేలా చేయమని నర్మద అంటుంది. ధీరజ్, నర్మద, ప్రేమ కారులో బయలుదేరుతారు. ఎదురుగా భద్రావతి కొబ్బరికాయ, నీళ్లు పట్టుకుని ఉంటుంది. కారు ముందు నీళ్లు దారగా పోస్తుంది. దేవుళ్లందరికి మొక్కి కొబ్బరికాయ కొడుతుంది.
జైలుకు పంపడానికి వెళ్తున్నారుగా
కారు తీయరా ఎదురు వస్తాను అని అంటుంది భద్రావతి. ఆ రామరాజు గాడిని, వాడి భార్యను, కొడుకును జైలుకు పంపడానికి వెళ్తున్నారుగా. మిమ్మల్ని సాగనంపేందుకు నా వంతుగా చేయాలిగా. జైల్లో వాళ్లను పలకరిస్తానని చెప్పు అని భద్రావతి అంటే.. పగటి కలలు కనడంలో తెప్పేం లేదని ధీరజ్ అంటాడు. నువ్వు కొట్టిన కొబ్బరికాయ, దేవుళ్ల సాక్షిగా మా అమ్మనాన్నను బయటకు తీసుకొస్తాను. తర్వాత ఏడవాలిగా. అప్పటివరకు నవ్వుతూ ఉండమని ధీరజ్ అంటాడు.
అసలే నాకు ఓపిక ఉండట్లేదు. నేను కారు తీస్తే నీ మీదకు ఎక్కిస్తాను. తప్పుకో అని నర్మద బెదిరిస్తుంది. ఎలాగు ఎదురువచ్చావుగా రా. నువ్వు ఎదురొస్తే మంచిదని మా అమ్మ చెప్పిందని ధీరజ్ కారు తీస్తాడు. వచ్చేదాకా గుమ్మం దగ్గరే గబ్బింలా వేలాడు అని చెబుతాడు ధీరజ్. మరోవైపు ఆటోలో భాగ్యం ఫ్యామిలీ వస్తుంది. కాళ్లబేరానికి రామరాజు ఫ్యామిలీ వస్తుందని భాగ్యం అంటుంది.
రంగంలోకి దిగిన విశ్వ
ఆటోకి ఎదురుగా విశ్వ ఉంటాడు. రంగంలోకి దిగిన విశ్వ భాగ్యం ఫ్యామిలీ వెళ్తున్న ఆటో ఎదురునిలబడతాడు. కేసు పెట్టినందుకు తిడతాడు విశ్వ. కేసు వాపసు తీసుకోమంటాడు. మీరు చేసిన అన్యాయం ముందు మేము చేసేది ఎంత అని వల్లి అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


