Illu Illalu Pillalu September 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అమూల్య ముందు విశ్వ డ్యాన్స్- ప్రేమకు అదృష్ట దేవతలా ముగ్ధ
Illu Illalu Pillalu Serial September 5th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 5వ ఎపిసోడ్‌లో అమూల్యను సినిమాకు రమ్మన్న విశ్వ డ్యాన్స్ చేస్తాడు. దానికి అమూల్య సిగ్గుతో మురిసిపోతుంది. వరలక్ష్మి వ్రతంలో ధీరజ్ ఆశీర్వాదం తీసుకోలేకపోతున్నందుకు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో అమూల్యకు వీడియో కాల్ చేసిన విశ్వ సినిమాకు టికెట్లు తీయమంటావా అని అడుగుతాడు. దాంతో విశ్వను తెగ తిడుతుంది అమూల్య. మీ అన్నయ్య, నా చెల్లిని కలిపేందుకు ఐడియా వచ్చింది. అది చెప్పడానికే రమ్మంటున్నాను అని విశ్వ అంటాడు.

స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలంటే
అది బయట కూడా చెప్పొచ్చని అమూల్య అంటే.. మరో కారణం కూడా ఉంది. మీ కాలేజ్‌లో ఫెస్ట్ ఉంది. అందులో నువ్వు స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలంటే పార్టిస్‌పేట్ చేయాలి. ఈ సినిమాలో కొరియోగ్రఫీ చాలా బాగుందట. అది చూసి డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఎలా ఉంది ఐడియా అని విశ్వక్ అంటాడు.
నీ మొహంలా ఉందని తిడుతుంది అమూల్య. నేను బార్న్ డ్యాన్సర్‌ని అని అమూల్య ముందు డ్యాన్స్ చేసి చూపిస్తాడజు. అది చూసి అమూల్య నవ్వుతుంది. పక్కన ఉన్న కుర్చీ కాలుకు తగలడంతో విశ్వ అరుస్తాడు. అది చూసి పగలబడి నవ్వుతుంది అమూల్య. అలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని పొగుడుతాడు విశ్వ.
రేపు నేను సినిమాకు రావట్లేదు. మా ఇంట్లో వ్రతం ఉంది అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది అమూల్య. విశ్వ చేసిన పనికి నవ్వుతూ సిగ్గుపడుతుంది అమూల్య. మరుసటి రోజు ఉదయం రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు జరుగుతుంటాయి. పూలదండలు డెకరేట్ చేస్తున్న ధీరజ్‌ను ప్రేమ అదేపనిగా చూస్తుంది. ధీరజ్ కూడా చూస్తాడు.
కన్నీళ్లతో ప్రేమ
ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో విశ్వ వచ్చి మీ ఆయనకు సైట్ కొడుతున్నావా ఏంటీ అని అంటాడు. ప్రేమ కన్నీళ్లతో కనిపిస్తుంది. అది చూసి ఏమైందని అడుగుతాడు విశ్వక్. ఈరోజు వ్రతం. భర్త ఆశీర్వాదం తీసుకుంటారని ప్రేమ అంటుంది. పోయినసారి ప్రేమ లేకుండా పూజలో కూర్చున్నామని ఈసారి ప్రేమ ఉన్న కూర్చోలేకపోతున్నామని ఇద్దరు అనుకుంటారు.
అత్తింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకో అని విశ్వ అంటాడు. ఎలా వెళ్లాలని, వాడు నన్ను నవ్వులపాలు చేశాడని ప్రేమ అంటుంది. నీకున్న ప్రేమ అది జరిగేలా చేస్తుంది. ఏదో ఒక దేవత ఆ అదృష్టాన్ని నీకు అందిస్తుంది. నీ భర్త నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని విశ్వక్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు వేదవతి దిగాలుగా కూర్చుంటుంది. నర్మద వచ్చి మాట్లాడిస్తుంది.
ఇప్పుడు నా చిన్న కోడలు అక్కడుంది. ఎలానే వ్రతం చేసుకోవడం అని బాధపడుతుంది వేదవతి. ఏదో ఒక విధంగా ప్రేమను ధీరజ్‌ను ఆశీర్వదించేలా చేయాలి. పదండి చెబుతాను అని నర్మద అంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు ప్రేమ, ధీరజ్ దూరంగా ఉన్నారని సైకోలా డ్యాన్స్ చేస్తూ సంతోషిస్తుంది. స్వీట్ తింటూ డ్యాన్స్ చేస్తుంది శ్రీవల్లి.
తినడానికే పుట్టనట్లున్నారు
అది చూసిన చందు దేవుడికి నైవేద్యం పెట్టేవరకు తినకూడదని కొంచెం కూడా బుద్ధి లేదని, కొంతమంది తినడానికే పుట్టినట్టున్నారని తిట్టి వెళ్లిపోతాడు. ఫీల్ అయినట్లు చేసిన శ్రీవల్లి హా.. తిట్టింది మొగుడేగా. దున్నపోతుపై వర్షం కురిసినట్లు తుడుచుకునిపోవాలని అనుకుంటుంది. ధీరజ్ ఇంటికి ముగ్ధ అందంగా రెడీ అయి వస్తుంది.
ముగ్ధను చూసి ధీరజ్, ప్రేమ ఇద్దరు షాక్ అవుతారు. ఈ దొంగ సచ్చినోడు దాన్ని వ్రతానికి పిలిచినట్లు ఉన్నాడని కిందకు దిగుతుంది ప్రేమ. ధీరజ్‌ను చూసిన ముగ్ధ అరుస్తూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. అది చూసి ప్రేమ మరింత షాక్ అవుతుంది. ఉడుక్కుంటుంది. ఆ వగలాడి నా మొగుడుని హగ్ చేసుకుందని అసూయ పడుతుంది.
రామరాజు వాళ్లు వస్తారు. ధీరజ్ ఇది నీ ఇల్లా. ఇది డెస్టినీ మిరాకిల్ తెలుసా అని ముగ్ధ అంటుంది. ఎవర్రా ఈ అమ్మాయి అని రామరాజు అడుగుతాడు. హగ్ చేసుకుందంటే చనువు గట్టిగానే ఉంది. బహుశా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియారాలు గట్రా ఉన్నాయేమో అని శ్రీవల్లి అంటుంది. కొడతానని వేదవతి తిడుతుంది. ఈ అమ్మాయి ఫ్రెండ్. నర్మద వదిన ఫ్రెండ్ అని ధీరజ్ అబద్ధం చెబుతాడు.
నర్మద ఫ్రెండ్‌గా ముగ్ధ
నర్మదనే షాక్ అవుతుంది. అంటే నీ ఫ్రెండ్ కాదా అని రామరాజు అడుగుతాడు. ధీరజ్ బతిమిలాడుకుంటాడు. అయ్యో నా ఫ్రెండే అని అంటున్నా అని నర్మద అంటుంది. మరి నర్మద ఫ్రెండ్ నీకెలా పరిచయం అని రామరాజు అడిగితే.. కూరగాయలకు వెళ్లినప్పుడు పరిచయం చేసిందని ధీరజ్ చెబుతాడు. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నాడని తిట్టుకుంటుంది ప్రేమ.
నర్మద ఫ్రెండ్ అయితే తనను హగ్ చేసుకోవాలి కానీ నిన్ను హగ్ చేసుకోవడం ఏంటి మరిది గారు అని శ్రీవల్లి అంటుంది. జెన్‌జీలు అంతే వదిన అని ధీరజ్ అంటాడు. ఇక్కడికి ఎలా వచ్చావని వేదవతి అడిగితే.. తన ఇల్లు మా ఇంటి పక్కనే. మాతోపాటు ముగ్ధను తీసుకొచ్చామని పక్కనున్న ఒకావిడ చెబుతుంది. ఈ పేరు ఎక్కడో విన్నామని నర్మదతో అంటుంది వేదవతి.
కోచింగ్ సెంటర్ ముగ్దనే. ప్రేమ కూడా చూస్తోందని నర్మద అంటుంది. మంట మీద పెట్రోల్ పోసినట్లే ఏంటే ఇది అని వేదవతి అంటుంది. పంతులు వస్తాడు. అంతా వ్రతానికి లోపలికి వెళ్తారు. నీ ఫ్రెండ్‌ని నాకు పరిచయం చేయలేదని సాగర్ అంటే.. చేస్తే లైన్ వేసేవాడివా అని అంటుంది నర్మద.
ప్రేమను ఆటాడుకున్న ధీరజ్
ఇది చూసింది కదా. ఖాళీగా ఎందుకు ఉండటం. దీన్ని ఓ ఆట ఆడుకుంటా అని కావాలనే ముగ్ధ పేరు చెబుతూ రొమాంటిక్‌గా లోపలికి వెళ్తాడు ధీరజ్. ఏం చేయాలని ప్రేమ కంగారుపడుతుంది. వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంటుంది. విశ్వ చెప్పినట్లుగా ప్రేమకు అదృష్ట దేవతలా ముగ్ధ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


