Illu Illalu Pillalu August 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ గిఫ్ట్ తిరిగిచ్చిన ధీరజ్- విశ్వ మాటలకు అమూల్య ఫ్లాట్
Illu Illalu Pillalu Serial August 24th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌లో శ్రావణ మాసం కారణంగా ఇల్లు క్లీన్ చేయాలని ప్రేమ వస్తువులు బయటపెడతాడు ధీరజ్. అది చూసి తన బట్టలు బయటపడేస్తున్నాడని ధీరజ్‌తో గొడవ పడుతుంది ప్రేమ. చెల్లికి విశ్వ సలహా ఇస్తే ఆ మాటలకు అమూల్య పడిపోతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఒక మెట్టు దిగింది కానీ ధీరజ్ బెట్టు చేస్తున్నాడని, ఇద్దరి బెట్టులను సెట్ చేసి కలిపేయాలని నర్మద అంటుంది. ఈ వేదవతి తలుచుకుంటే ఏమైనా చేస్తుందని గొప్పలు పోతుంది వేదవతి.

వేదవతి గాలి తీసిన నర్మద
ఏం చేయకున్నా మీరు మాత్రం భలే క్రెడిట్ ఇచ్చుకుంటారండి అని నర్మద అంటుంది. దాంతో తల్లిని పంపించిన వేదవతి మా అమ్మ ముందు తుస్సున గాలి తీశావ్ కదే అని వేదవతి అంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రష్ వేసుకుంటూ వచ్చిన ప్రేమ ధీరజ్ కోసం చూస్తుంది. ధీరజ్‌కు ఇచ్చిన ప్రేమ గిఫ్ట్ కనిపిస్తుంది. అది బయట పారేసుంది ఏంటని షాక్ అవుతుంది ప్రేమ.
ఈ ఆడాళ్లు పూజలని చెప్పి పనులన్నీ మనతోనే చేయిస్తార్రా. శ్రావణ మాసం అని చెప్పి సాయంత్రానికి కల్లా ఇల్లు క్లీన్ చేయాలని మీ అమ్మ, మా అక్క స్వీట్ వార్నింగ్ ఇచ్చిందిరా అని తిరుపతి అంటాడు. అన్ని చెప్పి పని మాత్రం తప్పించుకుంటున్నావని ధీరజ్ అంటాడు. ప్రేమ బట్టలు బయటపెడతాడు ధీరజ్.
ఇదేంటీ నా బట్టలు, బ్యాగులు బయటపెడుతున్నాడు. నేనే కాదు నేను ఇచ్చిన గిఫ్టులు, నా వస్తువులు ఇంట్లో ఉండకూడదని బయట పడేస్తున్నాడన్నమాట. వాడి బలుపు సంగతి చెబుతా అని అత్తింట్లోకి అడుగుపెడుతుంది ప్రేమ. తనిచ్చిన గిఫ్ట్ పట్టుకుని చూసుకుంటుంది. అది ఇచ్చినప్పుడు ధీరజ్ చెప్పింది గుర్తు చేసుకుంటుంది ప్రేమ.
వల్లికి ప్రేమ వార్నింగ్
అదంతా శ్రీవల్లి చూస్తుంది. ధీరజ్ నిన్ను తన జీవితంలోనుంచి పడేసినట్లు నీ వస్తువులు కూడా పడేశాడుగా శెల్లాయ్ అని జాలిపడినట్లు నటిస్తుంది శ్రీవల్లి. ఎలాగు నిన్ను ధీరజ్ వద్దనుకున్నాడుగా. నీ వస్తువులు నువ్వు తీసుకెళ్లు. అప్పుడు నువ్వెవరో ధీరజ్ ఎవరో అన్నట్లుగా ఉండొచ్చని వల్లి అంటుంది. దాంతో కోపంగా వల్లిపైకి చేయి ఎత్తుతుంది ప్రేమ.
సైలెంట్‌గా ఉండకుంటే 32 పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వస్తే ఏరా కొండముచ్చోడా నా వస్తువులన్నీ ఎందుకురా బయటపడేశావని అడుగుతుంది. నీ కోపానికి కారణం ఇదా. ఇదంతా ఎందుకంటే అని ధీరజ్ చెబుతుంటే.. మధ్యలోనే నాకు తెలుసురా.. తెలుసు. నా వస్తువులను నువ్వు చెత్తలా చూస్తున్నావ్. అందుకే పడేశావ్ అని అంటుంది ప్రేమ.
దీనికి అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవడం రాదు. దీని రూట్‌లోనే వెళ్దాం అని అవునే అని కావాలనే ధీరజ్ అంటాడు. ఇంతలో వేదవతి, నర్మద వస్తారు. నర్మద చెబుతున్నా కూడా ప్రేమ వినదు. ఇంతలో తిరుపతి వచ్చి చెప్పాలని చూస్తే పక్కకు తోసేస్తుంది ప్రేమ. ధీరజ్, ప్రేమ వాదించుకుంటారు. గొడవ పడతారు. మధ్యలో వెళ్లిన తిరుపతిని తోసేయడంతో కింద పడి నడుము విరగ్గొట్టుకుంటున్నట్లు అరుస్తాడు.
ప్రేమ గిఫ్ట్ తిరిగిచ్చేసిన ధీరజ్
తర్వాత ప్రేమను ఆపి శ్రావణ మాసం అని నీ రూమ్‌తో సహా క్లీన్ చేస్తున్నామని అసలు నిజం చెబుతుంది వేదవతి. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. మరి నిజం చెప్పొచ్చుగారా అని ప్రేమ అంటే.. ఎక్కడ చెప్పనిచ్చి చచ్చావని ధీరజ్ అంటాడు. నా ప్లేసులో ఉండి ఆలోచించు అని వాదిస్తుంది ప్రేమ. వేదవతి ఆపి ప్రేమను వెళ్లమంటుంది.
ప్రేమను ఆపిన ధీరజ్.. జ్ఞాపకాలకు ప్రాణం ఉండదు. కానీ ఎదుటి వాళ్ల ప్రాణం తీయగలవు. నాకు ఈ జ్ఞాపకం కూడా అలాంటిదే. నాకు దూరంగా తీసుకెళ్లిపో అని ధీరజ్ అంటాడు. ప్రేమ గిఫ్ట్‌ను తిరిగి ఇచ్చేస్తాడు ధీరజ్. నా ప్రేమ అర్థం చేసుకోకుండా నువ్వే నన్ను చంపుతున్నావని ప్రేమ కోపంగా వెళ్లిపోతుంది. శ్రీవల్లి నవ్వుకుంటుంది.
సాగర్ ఇంట్లోకి వచ్చి తను బీరువాలో దాచిన డబ్బును సైలెంట్‌గా బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకెళ్తుంటాడు సాగర్. కానీ, వాకిట్లో నర్మద ఉండి చూస్తుంది. ఆ లంచం డబ్బులు వెనక్కి దాస్తాడు సాగర్. దీన్నే దొరికిపోయాక దాక్కోవడం అంటారని, ఆ డబ్బులెందుకు దాస్తున్నావని నిలదీస్తుంది నర్మద. డబ్బులు బ్యాంకులో వేయడానికి తీశానని సాగర్ అంటాడు.
లంచం డబ్బుతో దొరికిపోయిన సాగర్
ఇది ఎఫ్‌డీ అమౌంట్ అని చెప్పావుగా. వాటిని డైరెక్ట్ సేవింగ్స్ అకౌంట్‌కు పంపించుకోకుండా క్యాష్ తీసుకోవడం దేనికి నర్మద అంటుంది. నాకు ఆ ప్రాసెస్ తెలియదు. అందుకే క్యాష్ తీసుకున్నానని సాగర్ అంటాడు. అలాగైతే డబ్బు తీసుకున్నాకా అక్కడే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చుగా. ఇంటికి తీసుకురావడం ఎందుకు మళ్లీ బ్యాంకులో వేయడం ఎందుకని అడుగుతుంది నర్మద.
నీకు చూపిద్దామని తీసుకొచ్చానని సాగర్ అంటే.. మరి దొంగచాటుగా తీసుకెళ్లడం ఎందుకు, నాకు చెప్పొచ్చుగా అని నర్మద అనుమానిస్తుంది. నర్మద అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావా. ఏంటే ఇది. కాస్తా భర్తలను అర్థం చేసుకోండే అని సాగర్ మాట దాటేసి వెళ్లిపోతాడు. దాంతో సాగర్‌పై డౌట్ పడుతుంది నర్మద.
మరోవైపు కోచింగ్ సెంటర్‌లో ప్రేమను డ్రాప్ చేసిన విశ్వ ఒక విషయం చెప్పాలని ఇబ్బందిపడతాడు. పక్కకు వెళ్లి అమూల్యకు కాల్ చేసి ప్రేమకు ఎలా సర్దిచెప్పాలో చెప్పవా అని విశ్వ అడుగుతాడు. అమూల్య తిడుతుంది. తర్వాత చెబుతానంటుంది. నువ్వు నాకు ఫోన్‌లో చెప్పు నేను డైరెక్టుగా చెబుతానని ఇయర్ బడ్స్ పెట్టుకుంటాడు విశ్వ.
ప్రేమకు విశ్వ సలహా, అమూల్య ఫ్లాట్
అమూల్య ప్రేమ గురించి చెబుతుంది. కానీ, అది సరిగ్గా చెప్పడు విశ్వ. ప్రేమకు ఏం అర్థం కాదు. ఈ ఫోన్‌తో పెట్టుకుంటే వర్కౌట్ అయ్యేలా లేదు. మనకు తోచింది చెబుదామని పెంగ్విన్ కథ చెప్పి మీరిద్దరు విడిపోకండి. అలా అని నువ్వు తగ్గకు. నీకు ధీరజ్ అంటే చచ్చేంత ప్రేమ ధీరజ్ మాటలను క్షమించలేవా. మన అనే మనిషి లేకుంటే జీవితం శూన్యంలా ఉంటుంది. అన్నగా నేను చెప్పేది అదే అని మనస్ఫూర్తిగా విశ్వ చెబుతాడు.
అటు ప్రేమ, ఇటు అమూల్య ఇద్దరు ఫిదా అవుతారు. వీడి మనసు మొద్దుబారిపోయింది అనుకున్నా. కానీ, గురువుగారి దగ్గర ఎమోషన్స్ కూడా ఉన్నాయని విశ్వకు అమూల్య ఫ్లాట్ అవుతుంది. మరోవైపు ప్రేమ ఆలోచిస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


