Illu Illalu Pillalu August 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- కల్యాణ్ పేరుతో ప్రేమకు గోరింటాకు పెట్టిన ధీరజ్-తల్లి ఏడుపు

Illu Illalu Pillalu Serial August 16th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 16వ ఎపిసోడ్‌లో నర్మదకు లిప్ కిస్ పెట్టి కవిత్వం చెప్పి సాగర్ రొమాన్స్ చేస్తాడు. ప్రేమ గదిలోకి రాత్రి ధీరజ్ వెళ్తాడు. ప్రేమ త్రాచుపాములా లేస్తుంది. ఉదయం ప్రేమ ఇంటికి వచ్చినట్లు ధీరజ్‌ను నర్మద ఆటపట్టిస్తుంది.

Published on: Aug 16, 2026, 08:38:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో లంచం డబ్బులు ఫిక్స్‌డ్ డబ్బులు అని చెప్పి నర్మదను ఏమార్చి మల్లెపూలు పెడతాడు సాగర్. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. నీ కళ్లేంటీ ఇంత డేంజరస్‌గా ఉన్నాయి, మల్లెపూల కంటే మత్తెక్కిస్తున్నాయి, పెదాలు కూడా మాట్లాడుతున్నాయి గుర్తుండిపోయేలా చిలిపి సంతకం చేయమని సాగర్ కవిత్వం చెబుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 16వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 16వ ఎపిసోడ్

నర్మదకు సాగర్ లిప్ కిస్

నర్మదకు లిప్ కిస్ పెడతాడు సాగర్. దాంతో సిగ్గుతో పక్కకు జరుగుతుంది నర్మద. వెనుకనుంచి నర్మదను హగ్ చేసుకుంటాడు సాగర్. రొమాంటిక్‌గా కవిత్వతంతో మాట్లాడుతాడు సాగర్. దాంతో నర్మద మురిసిపోతుంది. మరోవైపు రాత్రి ఎవరు చూడకుండా భద్రావతి ఇంట్లోకి ధీరజ్ దూరతాడు. ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ ప్రశాతంగా పాటలు విని పడుకుంటుంది.

అంత ట్రాన్స్‌లో ఏం పాటలు వింటుందని ధీరజ్ కూడా ఇయర్ ఫోన్ పెట్టుకుంటాడు. మగాళ్లు వట్టి మాయగాళ్లే అని పాట వస్తుంది. ఇంతలో ప్రేమ లేస్తుంది. ధీరజ్‌ను చూసి ప్రేమ షాక్ అవుతుంది. అరవబోతుంటే అరవకుండా ప్రేమకు లిప్ కిస్ పెడతాడు ధీరజ్. దాంతో ప్రేమ షాక్ అయిపోతుంది. ప్రేమ బుగ్గలు పట్టుకుని గిల్లుతాడు.

రేయ్ సచ్చినోడా నిన్ను అంటూ ధీరజ్‌ను దిండుతో కొడుతుంది ప్రేమ. ప్రేమను ఆపి గట్టిగా హగ్ చేసుకుంటాడు ధీరజ్. కానీ, మధ్యలో దిండు ఉంటుంది. ప్రేమ అలాగే ఉండిపోతుంది. తర్వాత వదిలేయమని, కిస్ ఎందుకు చేశావురా, అత్తా అని అరుస్తుంది ప్రేమ. నోరు మూస్తాడు. పిలవకే అని ధీరజ్ అంటాడు. నీకోసం పిల్లర్లు ఎక్కి మరి వచ్చాను అని ధీరజ్ అంటాడు.

అమ్మాయిలను పడేయడంలో ఎక్స్‌పర్ట్‌వి

ఎందుకొచ్చావురా ఇక్కడికి. నాకు తెలిసురా నువ్వెంతటి మొండి కిట్టయ్యవో అని ప్రేమ అంటుంది. మళ్లీ నోరు మూసి నేను చెప్పేది వినవే, నన్ను అపార్థం చేసుకున్నావే అని ధీరజ్ అంటాడు. అమ్మాయిలను పడేయడంలో నువ్వు ఎక్స్‌పర్ట్‌వి అని నాకు తెలుసురా అని ముగ్ధ గురించి చెబుతుంది ప్రేమ. నువ్వు కారులో ఎక్కాలని సరదాగా మాట్లాడాని, రెచ్చగొట్టానని ధీరజ్ అంటాడు.

ఆడాళ్ల మెమోరీ పవర్ గురించి ధీరజ్ మాట్లాడుతాడు. అయినా ముగ్ధ కోసం ధీరజ్ చేసిన లీలల గురించి ప్రేమ అంటుంది. ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇక్కడున్నావని ధీరజ్ అంటాడు. నువ్వే ఆవేశంలో మా నాన్నకు కొట్టావ్ అని ప్రేమ అంటే.. పాత విషయాలు తవ్వకని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ అరుస్తుంటే ముగ్ధ ఆపుతావా అని ధీరజ్ అంటాడు.

దాంతో మరింత షాక్ అవుతుంది ప్రేమ. దాని విషయంలో ఎంత మునిగిపోయావో అర్థమవుతుందని ప్రేమ అంటుంది. నువ్వు మారిపోయావనుకున్నా.. కానీ భార్య ముందే వేరేదాని పేరు కలవరించేలా మారిపోయావురా. ఉండు నీ సంగతి చెబుతా అని అత్తా అత్తా అని పిలుస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్ మాయమైపోతాడు. మరుసటి రోజు ఉదయం ప్రేమను తీసుకొస్తాని శపథం చేశాను. అదేమో త్రాచుపాములా బుసలు కొడుతుందని ధీరజ్ అనుకుంటాడు.

అత్తారింట్లో అడుగుపెట్టావ్

ప్రేమను ఎలా తీసుకురావాలని ఆలోచిస్తుంటాడు ధీరజ్. ఇంతలో ప్రేమ అక్కడే ఆగిపోయావేంటీ, లోపలికి రా అని నర్మద అనేది ధీరజ్ వింటాడు. ప్రేమ వచ్చిందనుకుంటాడు. ఏమైతేనేం అత్తారింట్లో అడుగు పెట్టావని నర్మద అంటుంది. ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఒసేయ్ రాక్షసి ఎక్కడున్నావ్.. రావే అని గోల చేస్తుంటాడు ధీరజ్.

ధీరజ్‌నే నర్మద చూస్తుంది. ప్రేమ ఎక్కడుందో నువ్వే చెప్పాలి. ప్రేమను నువ్వు తీసుకొచ్చావ్ కదా. నిన్న పాతకాలం హీరోలా ఛాలెంజ్ చేశావుగా. ఏమైందని నర్మద అంటుంది. నర్మద తలపై మొట్టికాయ వేసి వాన్ని ఆటపట్టించడం ఏంటే అని తిడుతుంది వేదవతి. ఇలా రెచ్చగొడితేనైనా పౌరుషంతో భార్యను తీసుకొస్తాడని అన్నానన నర్మద అంటుంది.

నా కొడుకు తీసుకురావడం చాలా సులవు. తీసుకురావడం లేట్ అవ్వొచ్చేమో గానీ తీసుకురావడం పక్కా అని పవన్ కల్యాణ్ డైలాగ్ కొట్టి మ్యానరిజంతో చెబుతుంది వేదవతి. తర్వాత రామరాజు మాట్లాడకపోవడం గురించి కొడుకుతో చెప్పుకుని బాధపడుతుంది వేదవతి. పిచ్చిదాన్ని అయిపోతున్నారా, నా వల్ల కావట్లేదంటుంది.

ప్రేమకు కల్యాణ్ పేరుతో గోరింటాకు

ధాన్యం కొనడానికి వెళ్లిన మీ నాన్న రెండు మూడు రోజులు రారు. ఈలోపు ప్రేమను తీసుకురారా. కోడలు వచ్చిన సంతోషంలో అయినా నా మీద కోపం పోయి నాతో మాట్లాడుతారు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాగే అమ్మ. నీ బాధ దూరం చేస్తాను, మళ్లీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తానని ధీరజ్ మాటిస్తాడు.

నా చిన్నోడు బంగారం అని కొడుకును ప్రేమగా హగ్ చేసుకుంటుంది వేదవతి. తర్వాత మళ్లీ ప్రేమ గదిలోకి వెళ్తాడు ధీరజ్. పడుకున్న ప్రేమకు గోరింటాకు పెడతాడు. ఈ గోరింటాకు చూడగానే నీకోసం నేను ఎంతలా ఎదురుచూస్తున్నానో నీకు అర్థం కావాలని ధీరజ్ వెళ్లిపోతాడు. కానీ, ప్రేమ అరచేతిలో కల్యాణ్ పేరుతో గోరింటాకు పెట్టి ఉంటుంది. అది చూసి కోపంగా ధీరజ్‌ను పిలుస్తుంది ప్రేమ. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More