Illu Illalu Pillalu September 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- తిరుపతి పెళ్లి చెడగొట్టిన ధీరజ్, ప్రేమ- వ్రతానికి ముగ్ధ

Illu Illalu Pillalu Serial September 3rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 3వ ఎపిసోడ్‌లో తిరుపతి పెళ్లిచూపులు చెడగొట్టడానికి చింతామణి ఇంటికి వెళ్తారు ధీరజ్, ప్రేమ. తిరుపతికి మూడు పెళ్లిళ్లు అయ్యాయంటారు. ధీరజ్ ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి వచ్చిన ముగ్ధ గట్టిగా హగ్ చేసుకుంటుంది.

Published on: Sep 3, 2026, 08:06:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సుక్కు లేకుంటే బతకలేనని తిరుపతి అంటాడు. ప్రేమను ధీరజ్ ఆపుతాడు. ఇన్నేళ్లలో మావయ్య అడిగిన కోరిక ఇదొక్కటే, తీర్చకుంటే ఎలా అని ధీరజ్ అంటాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 3వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 3వ ఎపిసోడ్

ప్రేమ వార్నింగ్

వేరే అమ్మాయి అయితే నేను కాదనేదాన్ని కాదు. ఇప్పటికే వల్లి వల్ల ఎన్నో జరిగాయి. ఇప్పుడు బాబాయ్‌ని ఇది చేసుకుంటే ఇంకా ఏం చేస్తారో అని ప్రేమ హెచ్చరించి ఒప్పుకోనంటుంది. నువ్వేంటే ఒప్పుకునేది బోడి అని ధీరజ్ అంటాడు. ధీరజ్, ప్రేమ వాదించుకుంటారు. తర్వాత నువ్వంటే ఇష్టం లేకున్నా తర్వాత ప్రేమించానుగా. సుక్కు కూడా మారుతుందని ధీరజ్ అంటాడు.

సాయంత్రం పెళ్లి చూపులను ఎలాగైనా చెడగొడతానని ధీరజ్ అంటాడు. ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. నా అల్లుడు ఉన్నాడు. ఇక మన పెళ్లి అయిపోయినట్లే అని తిరుపతి అంటాడు. మరోవైపు డబ్బు గురించి, తిరుపతి గురించి ఆలోచిస్తుంది నర్మద. చందు వెళ్తుంటే డబ్బు గురించి అడుగుతుంది. అనుమానం ఎవరి మీద లేదని, అయినా ఆధారాలు కావాలని చందు అంటాడు.

కచ్చితంగా చెప్పలేను కానీ వల్లి అక్క వాళ్లు చేసి ఉంటారని నర్మద అంటుంది. లేదు వాళ్లు అక్కడ ఉన్నారన్న మాట నిజమే కానీ ఆ డబ్బు గురించి నాకు, తిరుపతి మామకు తప్పా ఇంకెవరికి తెలియదని చందు అంటాడు. మళ్లీ డబ్బు కోసం ఆ దొంగలు రాకపోరా. వాళ్లు నాకు చిక్కకపోరా అని చందు అంటాడు. మీరు నమ్మినట్లుగా నేను నమ్మలేను. పెద్ద దొంగల ముఠానే ఉంది. ఆ ముఠాను బయటకు లాగుతా అని నర్మద అనుకుంటుంది.

ధీరజ్, ప్రేమ పీకలపై కత్తులు

విశ్వ అడ్రస్ ఇచ్చిన పెళ్లి చూపుల వాళ్ల ఇంటికి వెళ్తారు ధీరజ్, ప్రేమ. ఇంట్లోకి ధీరజ్, ప్రేమ వెళ్లగానే ఇద్దరు రౌడీలు వాళ్ల మెడలపై కత్తులు పెడతారు. ఏదో అత్తారింటికి వచ్చినట్లు వస్తున్నారు. ఎవర్రా మీరు అని వాళ్లు అడుగుతారు. ఇంతలో పెళ్లి కూతురు తల్లి చింతామణి వచ్చి అయ్యయ్యో వాళ్లు మనకు కాబోయే అల్లుడి గారి అల్లుడు గారు అని చెబుతుంది.

దాంతో రౌడీలు విడిచిపెడతారు. ఏం చేస్తుంటారని అడిగితే ఫైనాన్స్ బిజినెస్ అని చింతామణి చెబుతుంది. అయితే మా మావయ్యకు అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. మీ దగ్గరే తీసుకోవచ్చని ధీరజ్ అంటాడు. అల్లుడు గారు అప్పులు చేస్తారా అని చింతామణి అంటుంది. లక్షల్లోనే ఉంటుందని చెప్పిన ప్రేమ అమ్మాయిని చూపించమనండని అంటుంది.

బాలామణిని చింతామణి పిలుస్తుంది. బాలామణిని చూసి ధీరజ్, ప్రేమ షాక్ అవుతారు. ఈ అమ్మాయేనా పెళ్లి కూతురు అని లావుగా ఉన్నట్లు ధీరజ్ చేతులు ఆడిస్తుంటే రౌడీలు వచ్చి మళ్లీ పీకపై కత్తులు పెడతారు. అరేయ్ పూర్తిగా చెప్పనివ్వండరా అని బాగున్నట్లుగా చేతులతో అంటాడు ధీరజ్. మాట పూర్తి కాకముందే మర్డర్స్ చేయొద్దని చెప్పానుగా అని వార్నింగ్ ఇస్తుంది చింతామణి.

తిరుపతి పెళ్లి చెడగొట్టిన ధీరజ్, ప్రేమ

తిరుపతి బాబాయ్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ మనిషి దొరకడం చాలా అదృష్టం అని ప్రేమ అంటుంది. ఏ పని లేకుండా పులి పులిహోర కలపడం చూశారా అని ధీరజ్ అంటాడు. అసలు ఎందులో ఎక్స్‌పీరియెన్స్ ఉందని చింతామణి అడుగుతుంది. పెళ్లిలో అనుభవం ఉంది. మీ అమ్మాయికి మంచిదే. ఇది తిరుపతికి మూడో పెళ్లి అని ప్రేమ చెబుతుంది.

అమ్మా.. అంటే పెళ్లికొడుకు ఫ్రెష్ కాదా అని బాలామణి అంటుంది. ముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఏమైయ్యారని చింతామణి అడుగుతుంది. మా మావయ్య ఎంత చెప్పిన అల్పాయిష్షు ఉన్నవాళ్లనే చేసుకుంటాడు. మొదటి అమ్మాయి అరటితొక్కపై కాలేసి చనిపోయింది. రెండో అమ్మాయి ఊయల కట్టబోయి ఉరిపడి చనిపోయిందని ధీరజ్ చెబుతాడు.

మీ ఇంటికి మా అమ్మాయిని పంపిస్తే దాని బతుకేంటో నాకు బాగా అర్థమైంది. పెళ్లి లేదు గిల్లి లేదు. మీ మావయ్యకు మా అమ్మాయిని ఇవ్వనని చింతామణి తెగేసి చెబుతుంది. అంత గట్టిగా డిసైడ్ అయ్యాక మేము మాత్రం ఏం చేస్తామని ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. బయటకు వెళ్లి ఇద్దరు నవ్వుకుంటారు. వచ్చిన పని అయిపోయిందనుకుంటారు.

బల్లక్కాయ్ కథ చెప్పిన నర్మద

మరోవైపు భాగ్యంవాళ్లను నిలబెట్టి బోర్డ్‌పై జరిగింది అంతా లెక్కలేస్తుంది నర్మద. అంతలో శ్రీవల్లి వస్తుంది. భాగ్యం వాళ్లు కలిసి ప్లాన్ చేసిందంతా రాస్తుంది. ఈ కథ పేరు బావిలో బల్లి అని నర్మద చెబుతుంది. అనగనగా ఒక అడవిలే బల్లి ఉండేది. అది రాక్షస బల్లిలే. కానీ దానికి అన్ని గుంటనక్క తెలివితేటలున్నాయి. అది ముగ్గురు మొసళ్లతో ప్లాన్ చేసింది అని వల్లి చేసిందంతా చెబుతుంది నర్మద.

ఆ మొసళ్లు బ్రెయిన్ వాడకపోవడంతో అడ్డంగా దొరికిపోయారు. ఆ మొసళ్ల మూతి పగలగొడితే అసలు విలన్ ఇంట్లో ఉండే వల్లి అని చెప్పారు. ఎలా ఉంది కథ అని నర్మద అంటుంది. బల్లక్కాయ్ నువ్వు సినిమాల్లో నటిస్తే పక్కాగా నంది అవార్డ్ వచ్చేది. ఎంత బాగా నటిస్తున్నావ్ అని నర్మద అంటుంది.

వ్రతానికి ముగ్ధ

ధీరజ్ ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి ముగ్ధ వస్తుంది. ధీరజ్‌ను హగ్ చేసుకుంటుంది. రామరాజు వళ్లి వచ్చి ఎవరని అడుగుతారు. ఇద్దరి మధ్య చనువు గట్టిగానే ఉన్నట్లుందని వల్లి అంటుంది. అదంతా చూసి ప్రేమ అసూయతో రగిలిపోతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More