Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో షాక్-రామరాజు ఇంటికి పోలీసులు-ఒక్కటైన బల్లక్కాయ్, భద్రావతి!

Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబాన్ని సమస్యలు వదిలేలా లేవు. తాజాగా రామరాజు ఫ్యామిలీకి శ్రీవల్లి బండారం మొత్తం తెలిసింది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు భద్రావతితో కలిసి బల్లక్కాయ్ పగ తీర్చుకుంటుందని తెలుస్తోంది.

Published on: Oct 12, 2026, 12:10:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial: బుల్లితెరపై అదరగొడుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. వారం వారం ఒక్కో ట్విస్ట్ తో, ఊహించని మలుపులతో ఈ సీరియల్ స్టోరీ సాగుతుంది. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబంపై పగతో రగలిపోతున్న భద్రావతి, బల్లక్కాయ్ కలిసి కుట్ర చేసినట్లు తెలుస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో షాక్-రామరాజు ఇంటికి పోలీసులు-ఒక్కటైన బల్లక్కాయ్, భద్రావతి! (youtube/starmaa)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో షాక్-రామరాజు ఇంటికి పోలీసులు-ఒక్కటైన బల్లక్కాయ్, భద్రావతి! (youtube/starmaa)

బల్లక్కాయ్ ను గెంటేసి

రామరాజు కోడలు శ్రీవల్లి చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయి. ఆమె నిజస్వరూపం తెలియడంతో రామరాజు ఫ్యామిలీ అంతా కలిసి బల్లక్కాయ్ ను గెంటేసింది. అయితే ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు. ఇప్పుడు ఆ బల్లక్కాయ్ తన తప్పు తెలుసుకొని కాళ్ల మీద పడటం మానేసి రివేంజ్ తీర్చుకుంటానని శపథం చేస్తోంది.

నర్మద పెళ్లి రోజు

రామరాజు ఇంట్లో ప్రస్తుతం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నర్మద, సాగర్ ల పెళ్లి రోజు సందర్భంగా నర్మద తల్లిదండ్రులు వచ్చారు. అయిదుగురు ముత్తయిదువులతో ఆశీర్వాదం ఇప్పిస్తే నర్మద కడుపు పండుతుందని తల్లి సుజాత చెప్పింది. దీంతో రామరాజు ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఈ విషయం సుక్కు ద్వారా బల్లక్కాయ్ కు తెలిసింది.

రంగంలోకి భద్రావతి

ధీరజ్, ప్రేమను శాశ్వతంగా విడగొట్టేందుకు భద్రావతి, బల్లక్కాయ్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ నర్మద తెలివి ముందు వీళ్ల పప్పులు ఉడకలేదు. చివరికి ధీరజ్, ప్రేమ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. దీంతో తనకు తాను శిక్ష వేసుకున్న భద్రావతి గదిలో బంధీగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు నర్మదను దెబ్బ కొట్టడం కోసం బయటకు వచ్చింది.

రామరాజు ఇంటికి పోలీసులు

నర్మద, సాగర్ ల పెళ్లి రోజు సంబరాలు జరుగుతున్న సమయంలోనే రామరాజు కుటుంబానికి షాకిచ్చేలా భద్రావతి, బల్లక్కాయ్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామరాజు కుటుంబంపై గృహ హింస‌ కేసు పెడతానని బల్లక్కాయ్ తల్లి భాగ్యం చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బల్లక్కాయ్, భద్రావతి కలిసి పోలీసులను రంగంలోకి దించారనే అనుమానం కలుగుతోంది. ఇంట్లో సందడి ఉన్న సమయంలోనే పోలీసులు రావడంతో రామరాజు ఫ్యామిలీ షాక్ అయింది.

ఏం జరుగుతుంది?

రామరాజు ఇంటికి పోలీసులను పంపించామని భద్రావతి తెగ హ్యాపీగా ఫీల్ కావడం కనిపించింది. మరి రామరాజుతో పాటు ఎవరిపై కేసు పెట్టారు? వీళ్లను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తారా? పరువే ప్రాణంగా బతికే రామరాజు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతాడా? నర్మద ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? అనేవి ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పై క్యూరియాసిటీని మరింత పెంచేశాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More