Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు..పెద్ధ సమస్య వచ్చిందే.. సాగర్ లంచం ఊబిలో కూరుకుపోతాడా? ఇదేనా ట్విస్ట్!

Illu Illalu Pillalu Serial: తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ రామరాజు కుటుంబానికి పెద్ద సమస్యే వచ్చింది. ఈ కారణంగా ఇప్పటికే లంచానికి అలవాటు పడ్డ సాగర్.. ఇప్పుడా ఊబిలో కూరుకుపోతాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Published on: Oct 25, 2026, 16:15:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వారానికో కొత్త స్టోరీ లైన్ తో, అదిరిపోయే ట్విస్ట్ లతో సాగిపోతోంది. ఇప్పుడేమో సీరియల్ లో రామరాజు కుటుంబానికి పెద్ద సమస్య వచ్చింది. అర్జెంట్ గా రూ.50 లక్షలు అవసరం వచ్చింది. మరి ఈ డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు..పెద్ధ సమస్య వచ్చిందే.. సాగర్ లంచం ఊబిలో కూరుకుపోతాడా? ఇదేనా ట్విస్ట్! (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు..పెద్ధ సమస్య వచ్చిందే.. సాగర్ లంచం ఊబిలో కూరుకుపోతాడా? ఇదేనా ట్విస్ట్! (jiohotstar)

పంతానికి పోయిన ప్రేమ

ట్రావెల్స్ ఆఫీస్ వేలం పాటలో ప్రేమ పంతానికి పోయిన సంగతి తెలిసిందే. తన అత్త భద్రావతి ముందు భర్త ధీరజ్ ఓడిపోవద్దని ఎక్కువ రేట్ అయినా సరేనని రూ.30 లక్షలకు వేలం పాట పాడింది. ఇప్పుడా డబ్బు ఎలా అరెంజ్ చేయాలా? అని ధీరజ్ తల పట్టుకుంటున్నాడు.

సేట్ డిమాండ్

మరోవైపు నగలు పెట్టి డబ్బులు తీసుకున్న సాగర్ కు కూడా షాక్ తగిలింది. ఆ సేట్ మరోసారి ఇంటికి వచ్చాడు. వడ్డీ కట్టడం కాదు అసలు కట్టాలంటూ అరిచాడు. దీంతో సాగర్ పొగరుగా మాట్లాడాడు. నాలుగు రోజుల్లో రూ.20 లక్షలు ముఖం మీద పడేస్తాననన్నాడు.

ఆస్తి అమ్మాలని

ఇప్పుడు ధీరజ్ కు రూ.30 లక్షలు, సాగర్ కు రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షలు కావాలి. ఈ నేపథ్యంలో ఊరి బయట ఉన్న స్థలాన్ని అమ్మాలని రామరాజు అనుకుంటున్నాడు. కానీ అందుకు కొడుకులు ఒప్పుకొంటారా? అన్నది సందేహంగా మారింది. తండ్రి మాట కాదనరు అని రామరాజు చెప్తున్నాడు.

లంచానికి అలవాటు

డబ్బులు పెట్టి గవర్నమెంట్ జాబ్ కొనుక్కున్న సాగర్ ఇప్పటికే లంచానికి అలవాటు పడ్డాడు. ఓ సారి నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ డబ్బు అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సాగర్ దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. ఇంకా రూ.15 లక్షలు కావాలి.

ఊబిలో కూరుకుపోతాడా?

సాగర్ కు ఇప్పుడు రూ.15 లక్షలు అర్జెంట్ గా కావాలి. ఈ నేపథ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మేకర్స్ మరోసారి సాగర్ లంచావతారం చుట్టూ కథను తిప్పుతారని అనిపిస్తోంది. ఇప్పుడో భారీ డీల్ రూపంలో పెద్ద మొత్తం లంచం ఆఫర్ చేస్తే సాగర్ లొంగిపోయే అవకాశముంది.

ఇప్పటికే ఎలాంటి తప్పు చేయొద్దని నర్మద వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ సాగర్ తన తండ్రి సాయం లేకుండా సేట్ కు డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాబట్టి లంచం తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్లలో సాగర్ లంచం చుట్టూ కథను నడిపి, మేకర్స్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More