Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. ఈ నర్మద మామూలుది కాదు కదా.. దెబ్బకు ఆ బల్లక్కాయ్ సైలెంట్!
Illu Illalu Pillalu Serial: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ట్విస్టులు మామూలుగా లేవు. రామరాజు పోలీస్ స్టేషన్ సెల్ లోకి వెళ్లడం ఓ ట్విస్ట్ అంటే.. ఈ కేసులో నర్మద తెలివిగా వ్యవహరించి బల్లక్కాయ్ నోరు మూయించడం వేరే లెవల్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Illu Illalu Pillalu Serial: తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్న సీరియల్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ముందంజలో ఉంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు తెలుగు నాట ప్రేక్షకులు ఎక్కువే. ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్ట్ లు, ఉత్కంఠతో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది.

నర్మద అదుర్స్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు నడిపి కోడలు నర్మద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తన తెలివితో ఆమె కాపాడుకుంటూ వస్తోంది. బల్లక్కాయ్ కుట్రల నుంచి భద్రావతి కుతంత్రాల వరకూ రామరాజు కుటుంబానికి నర్మద శ్రీ రామరక్షగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫ్యామిలీని సంతోషంగా ఉండేలా చూసుకుంది.
బల్లక్కాయ్ ట్విస్ట్
ఈ సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి తన అత్తామామలు, భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. తన కుట్రలు బట్టబయలు కావడంతో బల్లక్కాయ్ ను రామరాజు కుటుంబం గెంటేసింది. అయితే తన తప్పు తెలుసుకోకుండా, ఆ బల్లక్కాయ్ పగతో రగిలిపోతోంది. అందుకే తన భర్త, అత్తామామపై గృహ హింస కేసు పెట్టింది. దీంతో కథలో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇంట్లోకి అడుగుపెట్టేలా
రామరాజు, వేదవతి, చందుపై గృహ హింస కేసు పెట్టిన బల్లక్కాయ్.. ఈ కేసుతో తిరిగి తన అత్తారింట్లో అడుగుపెట్టాలని ప్లాన్ వేసింది. అత్తామామ, భర్త కలిసి తన కాళ్లపై పడతారని ఆమె ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ రామరాజు కుటుంబాన్ని కాపాడేందుకు రెడీగా ఉండే నర్మద రంగంలోకి దిగింది. బల్లక్కాయ్ కు దిమ్మదిరిగే షాకిచ్చి, ఆమె నోరును మూయించింది.
కళ్లు తెరిపించిన నర్మద
శ్రీవల్లిని కేసు వాపసు తీసుకోమ్మని అడిగేందుకు నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి వెళ్లారు. కానీ వల్లి మాత్రం తెగ బిల్డప్ ఇచ్చింది. తనను ఇంటికి తీసుకెళ్తేనే కేసు వాపసు తీసుకుంటానని డిమాండ్ చేసింది. దీంతో నర్మద, ధీరజ్, ప్రేమ కలిసి నిరాశగా తిరిగి వచ్చారు.
కానీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ బయట నర్మద ఆడిన మైండ్ గేమ్ మామూలుగా లేదు. ఈ కేసు పెట్టడం వల్ల బల్లక్కాయ్ ఎంత తప్పు చేసిందనే విషయాన్ని నర్మద వివరించి మరీ చెప్పింది. కేసు వాపసు తీసుకోకపోతే ఇక లైఫ్ లో చందు బావ జీవితంలోకి రాలేవని గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో బల్లక్కాయ్ చుప్ అయిపోయింది. కేసు వాపసు తీసుకునేందుకు రెడీ అయ్యింది. దీంతో మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


