Illu Illalu Pillalu October 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ, ధీరజ్, నర్మద రిక్వెస్ట్-బల్లక్కాయ్ కేసు వాపస్ డీల్

Illu Illalu Pillalu October 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 15 ఎపిసోడ్ లో రామరాజు, చందు, వేదవతికి బెయిల్ రావడం కష్టమని ఎస్ఐ చెప్తుంది. వల్లితో మాట్లాడి రాజీ చేసుకోమ్మని లాయర్ సలహా ఇస్తాడు. కానీ ప్రేమ, ధీరజ్, నర్మద వెళ్లి అడిగితే బల్లక్కాయ్ అందుకు డీల్ చేసుకుందామంటుంది.

Published on: Oct 15, 2026, 07:52:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu October 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి అక్రమంగా రామరాజు, వేదవతి, చందుపై గృహ హింస‌ కేసు పెడుతుంది. లాయర్ వచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వమని అడిగితే.. కోర్టులోనే చూసుకోమ్మని ఆ ఎస్ఐ చెప్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బెయిల్ కష్టమే

ఇలాంటి కేసుల్లో రెండు మూడు నెలల వరకూ బెయిల్ రావడం కష్టమే అని ఎస్ఐ అనగానే నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్ షాక్ అవుతారు. వాళ్లు అందరూ మోసగాళ్లు. వాళ్లు జాదుగాళ్లు. వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ అని, ఎంఏ చేసేందని మా చందు బావకు పెళ్లి చేశారని వల్లి కుటుంబం గురించి నర్మద, ప్రేమ చెప్తారు.

అత్తమామలు టార్చర్

ఆ పెళ్లి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ భర్త, అత్తమామలు టార్చర్ చేస్తున్నారని కేసు పెట్టినప్పుడు కోర్టు ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చూడటం నా బాధ్యత అని ఎస్ఐ అంటుంది. నిజంగా మోసపోయిన ఆడవాళ్లకు చట్టాలు అండగా ఉండాలి. కానీ మోసం చేసిన వాళ్లకు కాదని ధీరజ్ చెప్తాడు.

కోర్టులోనే తేల్చుకోవాలని

వాళ్లు మోసం చేస్తే ఎప్పుడో కేసు పెట్టాలి కదా. కానీ వల్లిని టార్చర్ చేసి గెంటేశారు. వల్లి కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్లే మోసగాళ్లు అని అంటున్నారని ఎస్ఐ అడుగుతుంది. మా ఇంటి పరువును మేమే రోడ్డున వేసుకున్నట్లవుతుందని వాళ్లు ఏం చేసినా సైలెంట్ గా ఉన్నామని ధీరజ్ చెప్తాడు. కానీ ఎస్ఐ వినదు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండని ఎస్ఐ చెప్తుంది.

ఇది చాలా సెన్సిటివ్ కేసు. కంప్లైంట్ ఇచ్చిన వల్లితో మాట్లాడి రాజీ కుదుర్చుకోవడం లేదంటే కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవడమేనని లాయర్ కూడా చెప్తాడు. ఏదైనా ఉంటే రేపు ఉదయం 10 గంటల్లోపు సాల్వ్ చేసుకోండి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు తీసుకెళ్లకుండా ఆపలేరని ఎస్ఐ అంటుంది.

సైకోలా భద్రావతి

మరోవైపు రామరాజును సెల్ లో పడేశారని భద్రావతి, సేనాపతి సైకోల్లా నవ్వుతారు. రామరాజును కోలుకోలేని దెబ్బకొట్టాం. ఆ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించి వాళ్ల పొగరును దించా. పాతికేళ్ల పగను తీర్చుకునే అవకాశం దక్కింది. ఇక వదిలిపెట్టా. వాడిని సర్వనాశనం చేసి పాతికేళ్ల పగను ముగిస్తానని భద్రావతి అంటుంది.

ప్రేమంతా పగగా

ఎంతవరకు రామరాజు మీద పగ అని ఆలోచిస్తున్నావ్ కానీ. అక్కడ నీ చెల్లి, మేనకోడలు ఉందనే సంగతి మర్చిపోయావ్. నీ చెల్లిని కూడా స్టేషన్ లో పెట్టారు. నువ్వు, అది చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంగా పెరిగారు కదా. ఆ ప్రేమంతా ఏమైపోయింది? అని భద్రావతిని శారదాంబ అడుగుతుంది. ఆ ప్రేమనంతా పగగా అదే మార్చిందని భద్రావతి చెప్తుంది.

వాళ్ల మీద కేసు పెట్టింది పెద్ద కోడలు. దానికి, నాకు ఏం సంబంధం? దాని ఆజ్యం పోశా. మీరు మరోసారి దీని గురించి మాట్లాడొద్దని తల్లికి భద్రావతి వార్నింగ్ ఇస్తుంది. ఇటు ఇంట్లో రామరాజు కొడుకులు, కోడళ్లు దిగాలుగా కూర్చుని ఉంటారు. మా పెద్దకోడలు బంగారం అని మా అమ్మానాన్న నెత్తిన పెట్టుకున్నారు. చివరకు అరెస్టు చేయించిందని కామాక్షి అంటుంది.

సుక్కు నీకు తెలుసు కదా

భోజనాలు వడ్డిస్తే ఎవరూ తినరు. అమ్మానాన్న, పెద్దన్నయ్య బయటకు రారా అన్నయ్య అని ధీరజ్ ను ఏడుస్తూ అమూల్య అడుగుతుంది. రేపు బయటకు వచ్చేస్తారని ధీరజ్ ధైర్యం చెప్తాడు. ఏయ్ సుక్కు అని ప్రేమ గట్టిగా అరుస్తుంది. వాళ్లు కేసు పెడతారనే విషయం నీకు ముందే తెలుసు కదా అని ప్రేమ అడుగుతుంది.

అమ్మ తోడు నాకు తెలియదని సుక్కు అంటుంది. మీరంతా తోడు దొంగలు, ఏం చేసినా కలిసే చేస్తారని ప్రేమ సీరియస్ అవుతుంది. నాకు తెలియదని చెప్పినా వీళ్లు నమ్మట్లేదు తిరు అని సుక్కు ఏడుస్తూ డ్రామా ఆడుతుంది. వల్లితో కేసు వాపసు తీసుకునేలా చేయడం ఒక్కటే మనకున్న మార్గమని నర్మద అంటుంది.

కేసు వాపసు తీసుకునేలా

అంత అహంకారంతో ఉన్నవాళ్లు కేసు వెనక్కి తీసుకుంటారా అని ప్రేమ అంటుంది. ఒకసారి వల్లి వదినతో మాట్లాడుదాం. మనం చెప్తే వింటుందని ధీరజ్ చెప్తాడు. ఆ వల్లి ఎందుకు వింటుందని ప్రేమ అడుగుతుంది. ఒకసారి ట్రై చేద్దామని సాగర్ కూడా అంటాడు. ఇంట్లో ఎవరూ తినరు.

బల్లక్కాయ్ క్యారేజీ

ఇటు సెల్ లో ఉన్న భర్త, అత్తామామకు బల్లక్కాయ్ క్యారేజీ రెడీ చేస్తుంది. నేను వెళ్లి భోజనం వడ్డించి వస్తానని వల్లి చెప్తుంది. ఏంటే అమ్మడు ఈ పిచ్చి పనులు. కష్టపడి కేసు పెడితే భోజనం పెడతానంటావేంటీ? అని భాగ్యం అడుగుతుంది. ఆ రౌడీ ఎస్ఐకి డౌట్ వచ్చిందనుకో మొదటికే మోసం వస్తుంది. నువ్వు గట్టిగా ఉంటేనే వాళ్లు మన కాళ్ల దగ్గరకు దిగి వస్తారని భాగ్యం చెప్తుంది.

ధీరజ్ రిక్వెస్ట్

అప్పుడే ప్రేమ, ధీరజ్, నర్మద అక్కడికి వస్తారు. వల్లితో మాట్లాడాలని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. మేం ఏదైనా కోర్టులోనే చూసుకుంటామని భాగ్యం, ఇడ్లీ బాబాయి అంటారు. వెంటనే ఇడ్లీ బాబాయిని ధీరజ్ ఒక్కటి పీకుతాడు. ఇలాంటి వాళ్లు అవసరమైతే తప్పించుకోవడానికి అవతలి వాళ్లను చంపేందుకు కూడా వెనుకాడరని వల్లి గురించి ప్రేమ అంటుంది.

ప్రేమకు వల్లి చేయి చూపించగానే నర్మద వెళ్లి ఆ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. పెద్ద వదినగా అమ్మ తర్వాత నీకు అమ్మ స్థానం ఇచ్చాం. కానీ నువ్వు దిగజారావ్. మా అమ్మానాన్న, అన్నయ్యను పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి పరువు తీశావు. ఇక చాలు అని ధీరజ్ అంటాడు. ఇది కరెక్ట్ కాదు. స్టేషన్ కు వచ్చి కేసు వాపసు తీసుకో అని ప్రేమ అడుగుతుంది.

వల్లి డీల్

అది మాత్రం చేయనని వల్లి అంటుంది. కోపంతో ప్రేమ రాయి ఎత్తుకొని వస్తుంది. మీతో పాటు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లండి. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా అత్తామామ, బావను ఇంటికి తీసుకొస్తా. డీల్ ఓకేనా అని వల్లి అడుగుతుంది. అందుకు ప్రేమ, నర్మద, ధీరజ్ ఒప్పుకోరు.

మా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పి మా అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లడం కంటే వేరే ఆప్షన్ లేదని భాగ్యం బిల్డప్ ఇస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More