శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్ల బాగోతాన్ని చందు బావకు తెలిసేలా నర్మద, ప్రేమ చేస్తారు. బల్లిని వీళ్లు ఇద్దరు కలిసి ఒక ఆటాడుకుంటారు. మరోవైపు వల్లి చేసిన మోసంతో ఆమెను చందు దూరం పెడతాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను కూడా నర్మద, ప్రేమ భయపెడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ రోజు ఏప్రిల్ 1 ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ లో చూసేయండి.
ధీరజ్ కోపం

ప్రేమ, ధీరజ్ మధ్య గిల్లికజ్జాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రేమ కాఫీ చేసిందని ధీరజ్ పారబోయబోతుంటే తల్లి వేదవతి అడ్డుకుంటుంది. అమ్మ చెప్పడంతో ధీరజ్ కాఫీ తాగుతాడు. ఇంత మొండోడిని కన్నావేంటీ అత్త అని వేదవతిని ప్రేమ అడుగుతుంది. వాడిని కరిగించే సందర్భం ఇంకా రాలేదని వేదవతి చెప్తుంది.
ప్రేమతో ప్రేమ
అప్పుడే ధీరజ్ కంట్లో నలుసు పడుతుంది. వెంటనే ఛాన్స్ వచ్చింది ప్రేమ, వెళ్లి ఆ నలుసు తీయమని వేదవతి చెప్తుంది. హే రాక్షసి అని ధీరజ్ పిలవగానే రాక్షసుడా అంటూ ప్రేమ దగ్గరకు వెళ్తుంది. ప్రేమగా భర్త కంట్లో నుంచి నలుసును ప్రేమ తీసేస్తుంది. కానీ ధీరజ్ మాత్రం కరగడు. ప్రేమను మళ్లీ బాధపెడతాడు.
నిద్ర పోకుండా
ఇక రాత్రి కాగానే శ్రీవల్లికి నర్మద, ప్రేమ కలిసి మళ్లీ కచేరి మొదలెడతారు. వల్లిని కుర్చీలో కూర్చోబెడతారు. దీంతో కరెంట్ షాక్ ఏమైనా పెడతారా అని వల్లి అడుగుతుంది. ఈ ఐడియా మాకు ఎందుకు రాలేదా? అని నర్మద, ప్రేమ అనుకుంటారు. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా, నిద్ర పోకుండా ఉండాలని బల్లక్కాయ్ కు చెప్తారు నర్మద, ప్రేమ.
నర్మద వార్నింగ్
కండీషన్ ఏంటి అని అడిగి మరీ వల్లి ఇబ్బందులు కొనితెచ్చుకుంటుంది. కళ్లు మూస్తే చెంపదెబ్బలు వాయిస్తామని తోడి కోడల్లు చెప్తారు. అయినా నా సర్టిఫికేట్ల సంగతి మా ఆయనకు తెలిసేలా చేశారు కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ అని వల్లి బాధతో అడుగుతుంది. రేపు శ్రీరామ నవమి, నీ వేషాలకు, మోసాలకు బుద్ధి చెప్పే సినిమా మాములూగా ఉండదని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
వాయిస్ రికార్డింగ్ డిలీట్
{{/usCountry}}కండీషన్ ఏంటి అని అడిగి మరీ వల్లి ఇబ్బందులు కొనితెచ్చుకుంటుంది. కళ్లు మూస్తే చెంపదెబ్బలు వాయిస్తామని తోడి కోడల్లు చెప్తారు. అయినా నా సర్టిఫికేట్ల సంగతి మా ఆయనకు తెలిసేలా చేశారు కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ అని వల్లి బాధతో అడుగుతుంది. రేపు శ్రీరామ నవమి, నీ వేషాలకు, మోసాలకు బుద్ధి చెప్పే సినిమా మాములూగా ఉండదని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
వాయిస్ రికార్డింగ్ డిలీట్
{{/usCountry}}ఇప్పుడు ఈ ఆట స్టార్ట్ చేద్దామని ప్రేమ చెప్పడంతో కను రెప్ప కూడా కొట్టకుండా శ్రీవల్లి అలాగే బిగుసుకుపోతుంది. మధ్యలో కళ్లు మూయగానే నర్మద లాగిపెట్టి కొడుతుంది. వల్లి కునికిపాట్లు పడుతుంది. కళ్లు మూయగానే ప్రేమ ఒక్కటి ఇస్తుంది. కనురెప్పల మూత పడకుండా ఉండటానికి వల్లి పుల్లలు పెట్టుకుంటుంది.
నర్మద, ప్రేమ నిద్రలోకి జారుకుంటారు. ప్రేమ ఫోన్ ను తీసుకుని వాయిస్ రికార్డింగ్ ను వల్లి డిలీట్ చేస్తుంది. ఇక మీ ఇద్దరికీ షాక్ ఇస్తానని వల్లి అనుకుంటుంది.
శ్రీవల్లి జోష్
పొద్దున తిరుపతి, ధీరజ్ కలిసి రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రేమ కంగారు వచ్చి ఆ వాయిస్ రికార్డింగ్ డిలీట్ అయిందని నర్మదతో చెప్తుంది. అప్పుడే అంతా రామమయం అని పాడుకుంటూ శ్రీవల్లి వస్తుంది. అదేంటీ చెల్లాయిలూ తుస్సుమన్న సీమ టపాకాయల మీ ముఖాలు ఉన్నాయి ఏంటీ? అని అడుగుతుంది.
ఫీల్ అయిన ప్రేమ
వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేసిన సంగతి తెలిసిందా? మీరు ఇప్పుడు ఎలా చూసినా సరే తగ్గేదేలే. మీ దగ్గరే ఇన్ని తెలివితేటలు ఉంటే, నా దగ్గర ఎన్ని సావు తెలివితేటలు ఉండాలి చెల్లాయిలూ. ఇప్పుడు ఏం చేస్తారో చేయండని ఆడుతూ పాడుతూ వల్లి వెళ్లిపోతుంది. మంచి ఛాన్స్ మిస్ అయిందని ప్రేమ ఫీల్ అవుతుంది.
చందు షాక్
అప్పుడే చందు వస్తాడు. వల్లి సర్టిఫికేట్లు ఫేక్ అని నీకెలా తెలుసని నర్మదను అడుగుతాడు. బావ ఇది చాలా చిన్న విషయం. మీ నాన్నకు హార్ట్ ఎటాక్ రావడానికి, అమూల్య జీవితం నాశనమవడానికి కారణమైన మనిషి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆ మనిషి వల్లీ అక్క అని నర్మద చెప్పేసరికి చందు షాక్ అవుతాడు.
ఆ మనిషి ఎవరో వల్లీ అక్కకు తెలుసు. మీరు అడగండని నర్మద మళ్లీ మాట మారుస్తుంది. అక్క నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అడుగుతుంది. ఆ వల్లిని తనంతట తానే బయటపడేలా చేయడమని నర్మద చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.