Illu Illalu Pillalu July 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ముగ్గురి జీవితాలు తలకిందులవుతాయి. ప్రేమ, ధీరజ్ విడిపోతారు. వేదవతిని తనతో మాట్లాడొద్దని రామరాజు శిక్ష వేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ధీరజ్ ను కొట్టిన ప్రేమ

సేనాపతి, భద్రావతి, శ్రీవల్లి కుట్రలో చిక్కుకున్న ప్రేమ తన భర్త ధీరజ్ ను చెంపపై కొడుతుంది. తిరిగి చేయి ఎత్తిన ధీరజ్ కొట్టకుండా ఆగిపోతాడు. కొట్టరా కొట్టు, భార్యను నలుగురిలో నవ్వులపాలు చేస్తూ నిలబెట్టిన నీకు కొట్టడం ఒక లెక్కా అని ప్రేమ అంటుంది. ప్రేమ బుద్ధి లేదా? భర్తపై చేయి చేసుకుంటావా? అని తల్లి రేవతి కోప్పడుతుంది.
ఐ హేట్ యూ
భర్త అనే బాధ్యత, భార్య అనే గౌరవం నిజంగా ఉంటే ఎవరో మోసం చేస్తే నీ మెడలో తాళి కట్టానని అందరి ముందు సిగ్గుతో తలవంచుకునేలా మాట్లాడతాడా? అని ప్రేమ పదే పదే అదే మాట అంటుంది. కళ్యాణ్ గురించి మాట్లాడనని ధీరజ్ ఇచ్చిన మాటను ప్రేమ గుర్తు చేసుకుంటుంది. నా ప్రేమను, నమ్మకాన్ని చంపేశావ్. ఐ హేట్ యూ ధీరజ్ అని ప్రేమ అంటుంది.
ఇంటికి వెళ్దామని
నిన్ను ఎంత బాగా చూసుకున్నా, నీకు ఎంత ప్రేమ పంచినా సరే నువ్వు నీ వాళ్లకే సపోర్ట్ చేస్తావని తెలుసు. అందుకే ఐ హేట్ యూ అని ధీరజ్ అంటాడు. గొడవను ఎందుకు పెద్దది చేసుకుంటున్నారని నర్మద అడుగుతుంది. నువ్వంటే అసహ్యం అని ముఖం మీదే చెప్తున్నా ఇంకా ఇక్కడే ఉంటావేంటీ? మన ఇంటికి వెళ్దాం పదా అని ప్రేమ చేతిని భద్రావతి పట్టుకుంటుంది.
శారదాంబ చెప్పినా
మధ్యలో శారదాంబ జోక్యం చేసుకుంటుంది. భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతాయి. మంచో చెడో, దైవ నిర్ణయమో వాళ్ల పెళ్లి జరిగింది. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు సర్దిచెప్పాలి. కానీ కాపురాన్ని కూల్చేస్తానంటావేంటీ అని భద్రావతిపై శారదాంబ కోప్పడుతుంది. పదే పదే నవ్వుల పాలు చేసేవాడితో ఎలా కలిసి ఉంటుంది? రేపటి నుంచి ఇంట్లో వాళ్లందరూ అది ఎవడితో లేచిపోయిందని చూస్తారు. పదా ప్రేమ అని భద్రావతి అంటుంది.
లాక్కెళ్లిన భద్రావతి
{{/usCountry}}మధ్యలో శారదాంబ జోక్యం చేసుకుంటుంది. భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతాయి. మంచో చెడో, దైవ నిర్ణయమో వాళ్ల పెళ్లి జరిగింది. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు సర్దిచెప్పాలి. కానీ కాపురాన్ని కూల్చేస్తానంటావేంటీ అని భద్రావతిపై శారదాంబ కోప్పడుతుంది. పదే పదే నవ్వుల పాలు చేసేవాడితో ఎలా కలిసి ఉంటుంది? రేపటి నుంచి ఇంట్లో వాళ్లందరూ అది ఎవడితో లేచిపోయిందని చూస్తారు. పదా ప్రేమ అని భద్రావతి అంటుంది.
లాక్కెళ్లిన భద్రావతి
{{/usCountry}}వేదవతి వెళ్లి ఆపుతుంది. కానీ భద్రావతి వినదు. ఒక్క క్షణం కూడా నా కూతురిని ఈ ఇంట్లో ఉండనివ్వను అని సేనాపతి అంటాడు. ఇన్ని రోజులు మీ కూతురిని కళ్లల్లో పెట్టి చూసుకున్నాం. కానీ ప్రాణాలు తీసే రాక్షసులమని మాట్లాడుతున్నారు. నీ కూతురిని ఇంటికి తీసుకుపో అని ధీరజ్ అంటాడు. సేనాపతి, భద్రావతి కన్నింగ్ గా నవ్వుకుంటారు. వాడు ఛీ కొట్టిన తర్వాత కూడా ఉండటానికి సిగ్గు లేదా, వెళ్దాం పదా అని ప్రేమను లాక్కెళ్తుంది భద్రావతి.
మన కాపురాన్ని కూల్చేసినోళ్ల కాపురాన్ని కూల్చేస్తే ఆ కిక్కే వేరు అని సుకన్యతో చెప్తూ శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది. ప్రేమను ఇంట్లోకి తీసుకెళ్తుంది భద్రావతి. రేవతి, శారదాంబ ఎంత చెప్పినా ప్రేమ కూడా వినదు.
రెచ్చగొట్టేలా శ్రీవల్లి
ఇటు ధీరజ్ చెప్పిన నిజాన్ని జీర్ణించుకోలేక రామరాజు రగిలిపోతాడు. దొరికిందే ఛాన్స్ అనుకొని.. ధీరజ్, ప్రేమది ప్రేమ పెళ్లి కాదా? అసలు ప్రేమ, ధీరజ్ ప్రేమించుకోలేదా? కళ్యాణ్ అనే వాడు మోసం చేస్తే అత్తయ్య ప్రేమ మెడలో ధీరజ్ తో తాళి కట్టించిందా? ఇన్ని రోజులు మామయ్యను భ్రమపెడుతూ వచ్చారా? అని శ్రీవల్లి కావాలనే రెచ్చగొడుతుంది.
మోసం చేశారన్న రామరాజు
నోటికొచ్చినట్లు మాట్లాడావంటే చెప్ప పగలకొడతాను అని వల్లిపై వేదవతి సీరియస్ అవుతుంది. అదే మాట నేను నిన్నంటే, వల్లి మాట్లాడిన ప్రతి మాట నిజం. వాళ్ల పెళ్లిని దాచి నన్ను మోసం చేశారని మాట్లాడితే నాక్కూడా వల్లికి చెప్పిన సమాధానమే చెప్తావా? నా మాటలు బాధగా అనిపిస్తున్నాయా? ఇంత పెద్ద నిజం దాచి మోసం దాచినందుకు నాకెంత బాధగా ఉండాలి? గుండె పగిలి చావాలా నేను అని రామరాజు కోప్పడతాడు.
వేదవతి కన్నీళ్లు
వీళ్ల పెళ్లి విషయం మీకు చెప్పకపోవడం తప్పే. ధైర్యం సరిపోక చెప్పలేదు. మిమ్మల్ని నేను ఎందుకు మోసం చేస్తానని వేదవతి ఏడుస్తుంది. అత్తయ్య చెప్పాలనుకుంది, కానీ ప్రేమ చెప్పొద్దని మాట తీసుకుందని నర్మద అంటుంది. నువ్వు కూడా ఈ విషయాన్ని నా దగ్గర దాచావు, నువ్వు మాట్లాడకు అని నర్మదతో సాగర్ అంటాడు. ఈ విషయానికి నర్మదకు సంబంధం లేదు. నేనే బాధ్యరాలిని అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సగం చచ్చిపోయా
నాకు మీకంటే ఎవరూ ఎక్కువ కాదు. ఈ నిజం బయటపడితే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని చెెప్పలేదని రామరాజుతో వేదవతి అంటుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఎవరో చెప్పేదాక నాకు తెలియలేదంటే ఇంతకంటే సిగ్గు చేటు ఏం ఉంటుంది? నీ పెళ్లాం నీకు ఏం విలువ ఇస్తుందని అన్నారు. అప్పుడే సగం చచ్చిపోయానని రామరాజు అంటాడు. నువ్వు పిల్ల మెడలో తాళి ఎలా కట్టావురా అని ధీరజ్ ను కామాక్షి అడుగుతుంది.
జన్మలో నాతో మాట్లాడకని
వల్లి గొడవను ఇంకా పెద్దది చేయాలని చూస్తుంది. వల్లిని వేదవతి చెంపపై కొడుతుంది. వెంటనే వేదవతి పైకి రామరాజు చేయి ఎత్తి ఆగిపోతాడు. కొట్టాల్సింది నిన్ను. ఇదంతా జరగడానికి నువ్వే కారణమని రామరాజు అంటాడు. ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికే అమ్మ ఇలా చేసిందని తండ్రిని శాంతపర్చడానికి చందు ప్రయత్నిస్తాడు. కానీ కట్టుకున్న భర్తను మోసం చేశావ్, కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేశావ్. ఈ జన్మలో నువ్వు నాతో మాట్లాడకని భార్యకు చెప్పి రామరాజు వెళ్లిపోతాడు.
నేను మోసం చేయలేదని కూలబడి వేదవతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసి హాయిగా ఉందని శ్రీవల్లి నవ్వుకుంటుంది. మరోవైపు పుట్టింట్లో ప్రేమ బాధపడుతూ కూర్చుంటుంది. నా మేనకోడలిని ఇంటికి తెచ్చుకున్నానని వేదవతి అనుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.