Illu Illalu Pillalu September 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నర్మద, వేదవతి, శ్రీవల్లి కలిసి పెళ్లి చీర, శుభలేఖ ఇచ్చేందుకు భద్రావతి ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ వీళ్లను ఆపేస్తారు. నర్మద చెప్పడంతో సెక్యూరిటీని బల్లక్కాయ్ పక్కకు తోసేస్తుంది.
ప్రేమకు సారె

వేదవతి లోపలికి వెళ్లి ప్రేమను పిలుస్తుంది. వీళ్లను చూసి శారదాంబ, రేవతి, విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో కోడలమ్మాయి నీ కోసం సారె తెచ్చానని ప్రేమతో వేదవతి అంటుంది. నీకు ఇష్టమైన చీరను మీ ఆయన సెలెక్ట్ చేశాడని నర్మద చెప్తుంది. వేదవతి చీరను తీసి ప్రేమపైన ప్రేమగా వేస్తుంది.
ఈ పెళ్లి అవ్వదు అత్త
ప్రేమ మీ పెళ్లి కార్డు అని వేదవతి ఇస్తుంది. కానీ ప్రేమ మాత్రం ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడుగుతుంది. ఇదంతా జరగదు అత్త. ఈ పెళ్లి అవ్వదు అని ప్రేమ షాక్ ఇస్తుంది. నువ్వు మీ మొండి పట్టుదలను వదిలిపెడితే పెళ్లి ఎందుకు అవ్వదు చెప్పు అని వేదవతి అడుగుతుంది.
వేదవతి సీరియస్
అప్పుడే వచ్చిన భద్రావతి ఆ సారెను గాల్లోకి విసిరికొడుతుంది. మంగళకరమైన సారెను నేలపాలు చేస్తావా అని వేదవతి సీరియస్ అవుతుంది. ఈ పెళ్లి జరగదని నా కోడలు చెప్పింది. బయటకు వెళ్లకుండా ఇంకా ఏం చేస్తున్నారు? ప్రేమ వీళ్లకు బుద్ధి వచ్చేలా చెప్పు అని భద్రావతి అంటుంది.
విషం నింపుతున్నావ్
చిన్న పిల్లలాంటి ప్రేమలో విషం నింపుతున్నావా? అని భద్రావతిని శారదాంబ సూటిగా అడుగుతుంది. రేవతి కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తుంది. కానీ భద్రావతి ఏమో ఎమోషనల్ డ్రామా మళ్లీ స్టార్ట్ చేస్తుంది. నేను ప్రేమకు కన్నతల్లి కంటే ఎక్కువ. మరి ఏం చేస్తే నా బిడ్డ సంతోషంగా ఉంటుందో నాకు తెలీదా అని భద్రావతి తిరిగి ప్రశ్నిస్తుంది.
ధీరజ్ కౌంటర్
{{/usCountry}}చిన్న పిల్లలాంటి ప్రేమలో విషం నింపుతున్నావా? అని భద్రావతిని శారదాంబ సూటిగా అడుగుతుంది. రేవతి కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తుంది. కానీ భద్రావతి ఏమో ఎమోషనల్ డ్రామా మళ్లీ స్టార్ట్ చేస్తుంది. నేను ప్రేమకు కన్నతల్లి కంటే ఎక్కువ. మరి ఏం చేస్తే నా బిడ్డ సంతోషంగా ఉంటుందో నాకు తెలీదా అని భద్రావతి తిరిగి ప్రశ్నిస్తుంది.
ధీరజ్ కౌంటర్
{{/usCountry}}ధీరజ్ కు నేను ఇచ్చిన అవకాశాలన్నీ పోయాయి. వాడి గురించి గొప్పగా చెప్పి నేను ఫుల్ అయ్యా. మా అత్తకు ఇచ్చిన మాట ప్రకారం నేను రాను అని ప్రేమ చెప్తుంది. అప్పుడే ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. కింద పడ్డ చీర, శుభలేఖ, పళ్లు, పూలను తీస్తాడు. దీన్ని అత్తకు ఇవ్వమని వేదవతికి చెప్తాడు. రేవతికి బొట్టు పెట్టి సారెను వేదవతి అందిస్తుంది.
ఇది నా అత్తగారిల్లు. ఇంటి అల్లుడిగా నేను ఎప్పుడైనా రావొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. ఇది నీకు పుట్టిల్లు తప్పా సొంతిల్లు కాదు. మా వాళ్లు జాలిపడి ఉండనిచ్చారు. ఎక్కువ మాట్లాడితే మా అత్త, అమ్మమ్మకు చెప్పి బయటకు గెంటేయిస్తానని భద్రావతికి ధీరజ్ కౌంటర్ ఇస్తాడు.
శుభలేఖ చేతిలో పెట్టి
ప్రేమ దగ్గరకు వెళ్లి ధీరజ్ ప్రేమగా మాట్లాడతాడు. శుభలేఖ ప్రాధాన్యం గురించి చెప్తాడు. మనది ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించి ముడివేసిన బంధం. ప్రేమ, ధీరజ్ లు వేరు కావొచ్చు కానీ ప్రాణం ఒక్కటే, గుండె చప్పుడు ఒక్కటే అని అందరికీ అర్థమయ్యేలా నిరూపిద్దాం.ఈ రోజు రాత్రి పదిన్నరకు మన పెళ్లి. నువ్వు వస్తావని ఎదురు చూస్తానని ప్రేమ చేతిలో శుభలేఖ పెట్టి ధీరజ్ వాళ్లు వెళ్లిపోతారు.
రామరాజు వార్నింగ్
మరోవైపు రామరాజు ఊరంతా వెడ్డింగ్ కార్డులు పంచుతూ హడావుడి చేస్తాడు. ఊరందరి సమక్షంలో మా కొడుకుకు, సేనాపతి కూతురికి పెళ్లి చేస్తున్నానని పెద్ద మనుషులకు రామరాజు కార్డులు ఇస్తాడు. అక్కడే ఉన్న సేనాపతి కోపంతో ఊగిపోతాడు. శుభలేఖలను కిందపారేస్తాడు. తండ్రి స్థానంలో నిలబడి పెళ్లికి వస్తే బాగుంటుందని రామరాజు వార్నింగ్ ఇస్తాడు.
సేనాపతి మీ ఇంటికి చీర, సారె పంపించానని రామరాజు చెప్తాడు. ఈ పెళ్లి జరగదని రామరాజును సేనాపతి నెట్టేస్తాడు. నువ్వు వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. మీ తాతలు దిగి వచ్చినా ఈ పెళ్లి ఆగదు అని అక్కడ ఉన్నవాళ్లకు శుభలేఖలు ఇచ్చి రామరాజు వెళ్లిపోతాడు.
ధీరజ్ హల్ది
ఇటు ధీరజ్ కు హల్దీ ఏర్పాటు చేస్తారు. రామరాజు ఫ్యామిలీ అంతా కలిసి హంగామా చేస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ చేస్తారు. వేదవతి, రామరాజు మళ్లీ ఆ నాలుగు గోడల మధ్య పెళ్లంటూ మాటలు అనుకుంటారు. పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయికి పుట్టిల్లు దూరమైందని పాతికేళ్లుగా పశ్చాత్తాపపడుతున్నానని రామరాజు అంటాడు.
బల్లక్కాయ్ నవ్వు
కానీ నా ఇద్దరు కొడుకులు ప్రేమ పెళ్లిల్లే చేసుకున్నారని రామరాజు అంటాడు. నర్మద మెల్లగా వేదవతి దగ్గరకు వచ్చి తమ గురించి లాగొద్దని చెప్తుంది. ఇదంతా చూస్తూ శ్రీవల్లి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావని నర్మద అడుగుతుంది. మీరు ఇంత ఆరాటం చేస్తున్నారు కానీ పెళ్లి అవుతుందా ఏంటీ? అని బల్లక్కాయ్ అడుగుతుంది.
ఎంత ఎగిరిపడతావో పడు. ధీరజ్, ప్రేమల పెళ్లి అయిన మరుక్షణమే నువ్వు పుట్టింటికి దారేది అని వెతుక్కుటూ వెళ్తావని నర్మద వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.